Search
  • Follow NativePlanet
Share
» »థార్ ఎడారి లో ఏమేమి చూడాలి ?

థార్ ఎడారి లో ఏమేమి చూడాలి ?

By Super Admin

<strong>ఈ శివుని గుడి విశిష్టత వింటే వెంటనే వెళ్లి దర్శించుకుంటారు !</strong>ఈ శివుని గుడి విశిష్టత వింటే వెంటనే వెళ్లి దర్శించుకుంటారు !

<strong>ఈ గ్రామంలో పాము కరిచినా ప్రాణం పోదు? సైన్స్ కి అంతుచిక్కని రహస్యం !</strong>ఈ గ్రామంలో పాము కరిచినా ప్రాణం పోదు? సైన్స్ కి అంతుచిక్కని రహస్యం !

థార్ ఎడారి భారతదేశంలోని వాయువ్య భాగంలో ఇండియా - పాకిస్థాన్ సరిహద్దు భూభాగంలో ఉన్నది. ఈ ఎడారి రాజస్థాన్ లో అధికంగా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో కొద్దిగా విస్తరించి ఉన్నది. ఈ ఎడారిని 'గ్రేట్ ఇండియన్ డెసర్ట్' అని పిలుస్తారు. థార్ ఎడారి చుట్టూ ఆరావళి పర్వతాలు, సట్లెజ్ నది, సింధూ నది మరియు రాణాఫ్ కచ్ లు ఎల్లలుగా ఉన్నాయి.

విస్తృతమైన జంతు, వృక్ష జాలం కలిగి ఉన్న థార్ ఎడారిలో పర్యాటకులు ఆకట్టుకొనే ఎన్నో టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో అభయారణ్యాలు, ఒయాసిస్సులు, అరుదైన పక్షులు, ప్రాణులు కొన్ని. ఇతర ఆకర్షణల విషయానికి వస్తే ...

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

ఎడారి సంస్కృతి

ఎడారి సంస్కృతి

గిరిజనులు చేసే సంప్రదాయ మరియు జానపద నృత్యం థార్ ఎడారి ప్రత్యేక ఆకర్షణ. రాత్రి క్యాంపు ఫైర్ లో వారు చేసే నృత్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించి వారు నృత్యం చేస్తారు.

చిత్ర కృప : PROshankar s. Follow

ఆహారం

ఆహారం

థార్ ఎడారి లో 'కెర్ సాంగ్రి' స్పెషల్ డిష్. ప్లేట్ 150 రూపాయలు ఉంటుంది. పుల్లపుల్లగా, కారంకారంగా దీని రుచి ఉంటుంది. ఇదేకాక రాజస్థాన్ ఆహారాలు కూడా లభ్యమవుతాయి.

చిత్ర కృప : travelwayoflife Follow

థార్ ఎడారి నగరాలు

థార్ ఎడారి నగరాలు

జైసల్మీర్, రాజస్థాన్, జోధ్ పూర్, బికనీర్ మరియు ఉదైపూర్ లు థార్ ఎడారిలో ప్రధాన నగరాలు. ఇందులో జైసల్మీర్ ను ఎడారి యొక్క ఆభరణం అని అంటారు. ఈ ప్రదేశం కోటలకు, ఒంటెల సఫారీకి, బంగారు ఇసుక దిబ్బలకు మరియు రంగు రంగుల సంస్కృతికి ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప : Daniel Villafruela.

ఎడారి గిరిజనులు మరియు గ్రామాలు

ఎడారి గిరిజనులు మరియు గ్రామాలు

థార్ ఎడారిలో వివిధ జాతుల గిరిజనులు సమీప గ్రామాలలో నివశిస్తున్నారు. అందులో బిష్ణోయ్ గ్రామం బాగా ఫెమస్. ఇక్కడున్న స్థానికులు వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని తమ బాధ్యతగా కాపాడుకుంటుంటారు.

చిత్ర కృప : LRBurdak

ఎడారి ఉత్సవాలు మరియు పండగలు

ఎడారి ఉత్సవాలు మరియు పండగలు

ఎడారి లో ప్రతి సంవత్సరం ఉత్వాలు మరియు పండుగలు జరుగుతుంటాయి. వీటిని శీతాకాలంలో నిర్వహిస్తారు. పాములను ఆడించడం, పప్పెట్ షో, జానపద నృత్యాలు, గేయాలు మరియు ఇతర కళాప్రదర్శనలు ఉత్సవాలలో ప్రధాన భూమిక పోషిస్తాయి.

చిత్ర కృప : Abhishek Saha Follow

ఒంటెల సఫారీ

ఒంటెల సఫారీ

థార్ ఎడారి రెండు విధాలుగా సఫారీను అందిస్తున్నది. అందులో ఒకటి ఒంటె మీద సఫారీ మరియు రెండవది జీప్ మీద సఫారీ. జీప్ సఫారీ ఒంటె సఫారీ మాదిరి ప్రజాదరణ చూరగొనలేదు. ఒంటె సఫారీ ఎడారి అందాల్ని నిమ్మనెమ్మదిగా చూపిస్తుంది. ఒంటెసఫారీ కి జైసల్మీర్ బెటర్.

చిత్ర కృప : Honza Soukup

ఎడారి యొక్క వృక్షజాలం

ఎడారి యొక్క వృక్షజాలం

థార్ ఎడారిలో ముళ్ళు కలిగిన చెట్లు, మొక్కలు అధికంగా ఉంటాయి. ఇవి అక్కడక్కడా కనిపిస్తుంటాయి. వీటితో పాటు ఔషధ మొక్కలు, పెద్ద పెద్ద చెట్లను గమనించవచ్చు.

చిత్ర కృప : Michael Day

ఎడారి లో కనిపించే పక్షులు

ఎడారి లో కనిపించే పక్షులు

ఈ ప్రాంతంలో వలస పక్షులు ప్రాంతీయ పక్షులు కలిసి 141 జాతుల వరకు ఉన్నాయి. ఇక్కడ గ్రద్దలు, రాబందులు, హర్రియర్లు, ఫాల్కన్లు, బుజ్జార్డులు, కెస్ట్రల వంటి పక్షులు కనిపిస్తాయి.

చిత్ర కృప : Arun Prabhu

ఎడారిలో కనిపించే జంతువులు

ఎడారిలో కనిపించే జంతువులు

థార్ ఎడారిలో జంతువులు ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తుంటాయి. జింకలు, చింకారా, అడవి గాడిద, పాములు, ఎర్ర నక్కలు, తోడేళ్ళు మొదలైనవి ఎడారి లోని ప్రధాన జంతువులు.

చిత్ర కృప : Mr Raja Purohit

ఎడారి లో పార్క్ లు మరియు అభయారణ్యాలు

ఎడారి లో పార్క్ లు మరియు అభయారణ్యాలు

థార్ ఎడారి లో 11 అభయారణ్యాలు ఉన్నాయి. వీటిలో నారా ఎడారి వన్యప్రాణుల అభయారణ్యం, జాలోర్ వన్య ప్రాణులభయారణ్యం మరియు రానాఫ్ కచ్ అభయారణ్యం ప్రధానమైనవి.

చిత్ర కృప : LRBurdak

 ఆసక్తికరమైన విషయాలు

ఆసక్తికరమైన విషయాలు

థార్ ఎడారి ప్రపంచములోనే 18 వ అతిపెద్ద ఎడారి. దీని విస్తీర్ణం 2 లక్షల చదరపు కిలోమీటర్లు.

ప్రపంచములో ఎడారి ప్రాంతాలలో నివసించే అధిక జనాభాలలో గ్రేట్ ఇండియన్ డెసర్ట్ కూడా ఒకటి.

ఈ ఎడారి ప్రాంతంలోనే రాజస్థాన్ జనాభా 40% వరకు కలదు.

ఎండాకాలంలో ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు పైగా, చలికాలంలో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతుంది.

చిత్ర కృప : Dakshil Shah

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X