Search
  • Follow NativePlanet
Share
» »షోజా - లోయలో అందమైన ప్రదేశం !!

షోజా - లోయలో అందమైన ప్రదేశం !!

జలోరీ పాస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని సేరోల్సార్ సరస్సు కూడా షోజా లో ప్రసిద్ది చెందిన మరో ప్రదేశం. బుధి నాగిన్ అనే దేవత కోసం నిర్మించిన ప్రసిద్ద దేవాలయం కూడా ఈ ప్రాంతంలో వుంది.

By Mohammad

హిమాచల్ ప్రదేశ్ లోని సిరాజ్ లోయలో వున్న అందమైన ప్రాంతం షోజా. జలోరీ పాస్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో వుండే షోజా సముద్ర మట్టానికి 2368 మీటర్ల ఎత్తున వుంటుంది. ఇది మంచుతో కప్పబడిన హిమాలయాల అందమైన దృశ్యాల్ని అందిస్తుంది.

సేరోల్సార్ సరస్సు, రఘుపూర్ కోట, జలపాత కేంద్రం, జలోరీ పాస్, తీర్థాన్ లోయ ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు. కఠినమైన మెటల్ రోడ్డు గల జలోరీ పాస్ షోజాను షిమ్లా లాంటి చుట్టుపక్కల ప్రాంతాలకు కలుపుతుంది.

జలోరీ పాస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని సేరోల్సార్ సరస్సు కూడా షోజా లో ప్రసిద్ది చెందిన మరో ప్రదేశం. బుధి నాగిన్ అనే దేవత కోసం నిర్మించిన ప్రసిద్ద దేవాలయం కూడా ఈ ప్రాంతంలో వుంది. ఈ ప్రాంతానికి సంరక్షురాలిగా పిలువబడే ఈ అధిదేవతకు నూర్గురు కుమారులున్నారని చెప్తారు.

షోజా లో తప్పక చూడవలసిన ప్రాంతాల్లో ఒకటి జలపాత కేంద్రం. ప్రకృతి ఒడిలో వున్న ఈ జలపాత కేంద్రం అచ్చేరువొందించే ఆనందంతో అలరారుతోంది. షోజా నుంచి కేవలం 1కిలోమీటర్ దూరంలోనే ఉండడంతో ఉదయం పూట నడక కోసం జనం ఇక్కడి దాకా వస్తారు. ఇక్కడి నీరు చల్లగా, తీయగా ఉంటాయని చెప్తారు.

షోజా లోయ

షోజా లోయ

చిత్రకృప : Travelling Slacker

రఘుపూర్ కోట

సముద్ర మట్టానికి 3540 మీటర్ల ఎత్తున వున్న రఘుపూర్ కోట షోజా పట్టణంలోని ఏకైక చారిత్రిక స్థలం. పెద్ద కందకాలు, చేపల చెరువులతో వుండే అందమైన కోట ఇది. గతంలో బులెట్ల వల్ల దెబ్బ తిన్న గోడలను పర్యాటకులు చూడవచ్చు. అందమైన పరిసరాల్లో నెలకొని వున్న ఈ కోట తీర్థాన్ లోయ, హిమాలయ శ్రేణుల అందమైన దృశ్యాలను చూపిస్తుంది. ఇదే కాక, ఈ పర్వతాల మీద తమ పశువులను కాచుకుంటున్న గొర్రెల కాపర్లు కూడా పర్యాటకులకు కనపడతారు.

సేరోల్సార్ సరస్సు

షోజా లోని జలోరీ పాస్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న, అందమైన సరస్సు సేరోస్లార్. స్థానిక దేవత బుధి నాగిన్ కోసం నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం దగ్గరలోనే వుంది. బుధి నాగిన్ అనే దేవత ఈ ప్రాంతానికి సంరక్షకురాలని, ఆమెకు నూర్గురు కుమారులు వున్నారని విశ్వసిస్తారు. ఈ సరస్సు చుట్టూ అన్నివైపులా దట్టమైన సింధూర వృక్షాలు వుంటాయి.

గుడి వద్ద భక్తులు

గుడి వద్ద భక్తులు

చిత్రకృప : Travelling Slacker

తీర్థాన్ లోయ

తీర్థాన్ లోయ లో వున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. షోజా కు దగ్గరలో వున్న ఈ లోయ పర్యావరణ పరిరక్షణ మండలం లోకి వస్తుంది - ఇక్కడ పర్యావరణం మీద కాలుష్యం దుష్ప్రభావాలు పడకుండా చాలా చర్యలు తీసుకున్నారు. ఈ లోయలోని నదులలో యాంగ్లింగ్ చేయడాన్ని కూడా పర్యాటకులు ఆస్వాదించవచ్చు.

జలపాత కేంద్రం

షోజా నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో అందమైన వాతావరణం మధ్య వున్న ఆకర్షణీయమైన ప్రదేశం జలపాత కేంద్రం. అడవి ద్వారా కాలి నడకన పర్యాటకులు ఈ జలపాతానికి తేలిగ్గానే చేరుకోవచ్చు. స్థానికులు ఉదయం పూట నడక కోసం ఇక్కడి దాకా వస్తారు. ఫోటోలు తీసుకోవడానికి, ప్రకృతి ఒడిలో సమయం గడపాలనుకునే వారికి కూడా అందమైన ఈ ప్రాంతం స్వాగతం పలుకుతుంది. ఈ జలపాతాల నుంచి పడే నీరు చల్లగానూ, తియ్యగానూ వుంటాయి.

అందమైన పూతోట

అందమైన పూతోట

చిత్రకృప : Travelling Slacker

షోజా ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం : షోజా కు సుమారు 164 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ బయటి నుంచి పర్యాటకులు షోజా కు వెళ్ళే బస్సులు ఎక్కవచ్చు.

ఇది కూడా చదవండి : చంబా - ఉత్తర భారతదేశంలో అత్యుత్తమ ప్రదేశం !!

రోడ్డు మార్గం : కులు నుంచి నిత్యం నడిచే బస్సుల్లో పర్యాటకులు షోజా కు చేరుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థ వారి బస్సుల ద్వారా కులు ఇతర ప్రధాన భారతీయ నగరాలకు అనుసంధానించబడి వుంది.

వాయు మార్గం : భు౦టార్ విమానాశ్రయం గా పిలువబడే కులు మనాలి విమానాశ్రయం ఇక్కడి నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X