Search
  • Follow NativePlanet
Share
» »అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు !!

అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు !!

ఇండియా లోని అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు లో స్నానం చేయండి, లేదా ఇక్కడకల శిఖరాలకు ట్రెక్కింగ్ చేయండి. లేదా అందమైన జైన టెంపుల్స్ లోని తీర్థంకరుల విగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి.

By Venkatakarunasri

ఇండియా లోని అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు లో స్నానం చేయండి, లేదా ఇక్కడకల శిఖరాలకు ట్రెక్కింగ్ చేయండి. లేదా అందమైన జైన టెంపుల్స్ లోని తీర్థంకరుల విగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి. లేదా మౌంట్ అబూ వైల్డ్ లైఫ్ సాన్క్చురి లో వన్య జంతువులను చూసి ఆనందించండి. ఇవే కాక మౌంట్ అబూ ఆకర్షణలు ఇంకనూ అనేకం కలవు.

మౌంట్ అబూ రాజస్తాన్ లోని సిరోహి జిల్లా లో కలదు. సముద్ర మట్టానికి 1220 మీ. ల ఎత్తున ఆరావళి పర్వత శ్రేణులలో ఈ ఎత్తైన శిఖరం కలదు. ఈ హిల్ స్టేషన్ రాజస్తాన్ లో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం గా ప్రసిద్ధి కెక్కింది.

నక్కి సరస్సు

నక్కి సరస్సు

మౌంట్ అబూ లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. సముద్ర మట్టానికి సుమారు 1200 మీ. ల ఎత్తున ఈ సరస్సు కలదు. దేశంలోనే ఇది ఒక అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు. ఈ సరస్సు కు వెనుక అందమైన పర్వత శ్రేణులు కలవు. ఇక్కడే మరొక ఆకర్షణ గాంధి ఘాట్. దీనిని మహాత్మా గాంధి జ్ఞాపకార్ధం నిర్మించారు. ఆయన అస్థికలు ఇక్కడ కలిపారు.

Pic Credit: Koshy Koshy

సూర్యాస్తమయ ప్రదేశం

సూర్యాస్తమయ ప్రదేశం

ఈ ప్రదేశంలో పేరుకి తగినట్లు సాయంకాలాలు అద్భుతంగా వుంటుంది. టూరిస్ట్ లు, స్థానికులు సాయంత్రం వేళలో ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు. హనీమూన్ జంటలకు ఈ ప్రదేశం ఒక స్వర్గం వలే వుంటుంది. ఈ ప్రదేశం షాపింగ్ కు కూడా ప్రసిద్ధి చెందినది.

Pic Credit: ashish v

అచల్ ఘర్ ఫోర్ట్

అచల్ ఘర్ ఫోర్ట్

అచల్ ఘర్ ఫోర్ట్ మౌంట్ అబూ కు 11 కి. మీ. ల దూరంలో కలదు. ఈ కోటకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలదు. కోట లోపల ఒక శివాలయం కలదు. ఇక్కడి ఒక రాతి పై శివుడి కాలి ముద్రలు కలవు. శివుడి వాహనం అయిన నంది ఈ గుడిని కావలి కాస్తుంది. స్థానికులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ కోటలో కొన్ని జైన టెంపుల్స్ కూడా కలవు.

Pic Credit: Wikki Commons

బ్రహ్మ కుమారీస్ ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం

బ్రహ్మ కుమారీస్ ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం

మౌంట్ అబు కు ఆధ్యాత్మికత సాధనలో వచ్చిన వారు ఈ విశ్వ విద్యాలయం లో తప్పక నమోదు చేసికొనవచ్చు. ఇది బ్రహ్మ కుమారీలు నిర్వహించే ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక మరియు సామాజిక సంస్థ. ధ్యానం, యోగ, ఆధ్యాత్మికత లలో కోర్సులు నిర్వహిస్తారు.

Pic Credit: Wikki Commons

దిల్వారా జైన్ టెంపుల్స్

దిల్వారా జైన్ టెంపుల్స్

తప్పక చూడవలసిన ఆకర్షనలలో దిల్వారా జైన్ టెంపుల్స్ ఒకటి. ఈ అయిదు దేవాలయాలు అందంగా తెల్లటి మార్బుల్ తో నగిషీలు చెక్కబడి వుంటాయి. వీటి పేర్లు, విమల్ వసాహి, లూనా వాసాహి, పీతాల్ హార, ఖర్తార్ వాసాహి, శ్రీ మహావీర్ వామి టెంపుల్ అని చెపుతారు. జైనులు ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తారు.

Pic Credit: Nathan Hughes Hamilton

టోడ్ రాక్

టోడ్ రాక్

మౌంట్ అబూ లో ఇది ఒక పెద్ద రాయి. ఒక కప్పు ఆకారంలో వుంటుంది కనుక దీనిని టోడ్ రాక్ అంటారు. ఈ రాయి నక్కి సరస్సు సమీపంలో ట్రెక్కింగ్ మార్గంలోనే కలదు. ఈ ప్రాంతంలో ఈ రాయి అధిక సంఖ్యాకులను ఆకర్షిస్తుంది.

Pic Credit: Wikki Commons

మౌంట్ అబూ వైల్డ్ లైఫ్ సాన్క్చుఅరి

మౌంట్ అబూ వైల్డ్ లైఫ్ సాన్క్చుఅరి

ఈ సాన్క్చురి లో చిరుతలు, లేళ్ళు, అడవి ఎలుగులు, నక్కలు, తోడేళ్ళు వంటి అనేక జంతువులు కలవు. జంతువులే కాక ఈ సాన్క్చురి సుమారు 820 రకాల మొక్కలకు నిలయంగా వుంది. ప్రకృతి ప్రియులు, జంతు ప్రియులు తప్పక చూడవలసిన ప్రదేశం.

Pic Credit: Wikki Commons

ఆహారం

ఆహారం

మౌంట్ అబూ సందర్శకులకు వివిధ రకాల ఆహారాలు అందిస్తుంది. ఎన్నో ఎంపికలు కలవు. రుచికరమైన రాజస్థాని వంటకాలు అరటి ఆకులలో వడ్డించి తినిపించటం ఒక ప్రత్యేకత.

Pic Credit: shankar s.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X