Search
  • Follow NativePlanet
Share
» »అన్నవరం - సత్యనారాయణ స్వామి కొలువుదీరిన క్షేత్రం !!

అన్నవరం - సత్యనారాయణ స్వామి కొలువుదీరిన క్షేత్రం !!

అన్నవరం లోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కు చెందిన ఈ అన్నవరం గ్రామం రాజమండ్రి కి 70 కి. మీ. దూరంలో మరియు కాకినాడ కి 45 కి. మీ. దూరంలో ఉన్నది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైన దివ్య క్షేత్రం అన్నవరం.

ఇది కూడా చదవండి : కాకినాడ ప్రముఖ ఆకర్షణలు !!

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలసిన సత్య దేవుని ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉన్నది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి గుడి, వన దుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామ దేవత గుడి తో మొదలయ్యే దర్శనం చివరగా సత్యదేవునితో ముగుస్తుంది. ఈ క్షేత్రంలో సామూహికంగా వందలాది మంది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడం తప్పక చూడవలసిన దృశ్యం.

ఇది కూడా చదవండి : రాజమండ్రి ప్రముఖ ఆకర్షణలు !!

ప్రతి తెలుగు వారు తమ ఇంట ఏ శుభకార్యం చేసినా ముందుగా (వివాహం, గృహ నిర్మాణం, గృహ ప్రవేశం, పెళ్ళిళ్ళు ఇలా మరేదైనా శుభకార్యాలు) శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం తప్పక ఆచరిస్తారు. అంటే తెలుగు వారికి ఈ దేవుడు ఎంత ఇష్టదైవమో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన నవ దంపతులు ఇక్కడికి వచ్చి స్వామి వారి వ్రతాన్ని తప్పక ఆచరించి, సత్యదేవుని దర్శనం చేసుకుంటారు. ఇప్పుడైతే కార్తీక మాసం, పెళ్ళిళ్ల సీజన్ కనుక కొత్తగా పెళ్ళైన దంపతులు అన్నవరం క్షేత్రానికి వస్తే ఇక్కడి దేవుని దర్శనం తో పాటు ఇంకా ఏమి చూడవచ్చో తెలుసుకుందాం ..!

కాలి నడకన

కాలి నడకన

కొండ క్రింది నుండి పైకి చేరుకోవడానికి దేవస్థానం వారి బస్సులు ఉన్నాయి. ఓపిక ఉన్నవారు 450 మెట్లు ఎక్కి కూడా వెళ్ళవచ్చు. ఇలా కాలి నడకన పైకి ఎక్కడానికి పట్టే సమయం 20 నిమిషాలు.

చిత్ర కృప : Adityamadhav83

ప్రవేశద్వారం

ప్రవేశద్వారం

రత్నగిరి సత్రం, దేవస్థానం వారి ఫలహార శాల దాటగానే ప్రవేశద్వారం కనిపిస్తుంది. అందులోంచి కొంతదూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది.

చిత్ర కృప : Adityamadhav83

ముఖద్వారం

ముఖద్వారం

సత్యనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారం దగ్గర గోడ మీద వ్రాసి ఉన్న శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు.

చిత్ర కృప : Palagiri

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున వనదుర్గ ఆలయం, రామాలయం, విశ్రాంతి మందిరం కనిపిస్తూ ఉంటాయి.

చిత్ర కృప : Nanjih Bayar

వ్రత మండపాలు

వ్రత మండపాలు

రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి.

చిత్ర కృప : vinayvarma4u

నిత్యకళ్యాణం

నిత్యకళ్యాణం

స్వామి వారికి నిత్యం పూజలు, ఆర్చనలు మరియు భక్తుల సామూహిక వ్రతాలు జరుగుతుంటాయి. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చతుర్థి, శరన్నవరాత్రులు, సంక్రాంతి మొదలైన పర్వదినాల రోజులలో కల్యానోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో సంపన్నమైన ఆలయంగా సత్యదేవుని ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఎప్పుడు భక్తులతో, యాత్రికులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది.

చిత్ర కృప : pvsnraju

స్వామి వారి వ్రతం

స్వామి వారి వ్రతం

సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంది. సాధారణ వ్రతం రూ. 125 గా, ప్రత్యేక వ్రతం రూ. 200 గా, ధ్వజస్తంభం వద్ద వ్రతం రూ. 500 గా, విశిష్ట వ్రతం రూ. 1, 116 గా ఉంటాయి.

చిత్ర కృప : pawan kumar

పూజా సామాగ్రి

పూజా సామాగ్రి

వ్రతానికి వచ్చే వారు టికెట్టు తీసుకొని కొబ్బరికాయలు, అరటి పండ్లు మాత్రం తీసుకొని వస్తే సరిపోతుంది. మిగిలిన పూజా సామాగ్రి లను దేవస్థానమే సమకూరుస్తుంది. వ్రతానికి భార్య, పిల్లలను అనుమతిస్తారు.

చిత్ర కృప : vthalakola

వనదుర్గ అమ్మవారి ఆలయం

వనదుర్గ అమ్మవారి ఆలయం

అన్నవరం దేవస్థానం పరిసరాల్లో అనేక దర్శనీయ క్షేత్రాలున్నాయి. కొండదిగువున ఘాట్‌రోడ్డు ప్రారంభంలో గ్రామ దేవత శ్రీ నేరుళ్లమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీకనకదర్గ అమ్మ వారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గంలో మద్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకులు సీతారామచంద్రుని ఆలయం ఉన్నాయి.

చిత్ర కృప : Adityamadhav83

కాల నిర్ణయ గడియారం

కాల నిర్ణయ గడియారం

పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉంది. సూర్యుని నీడ (ఎండ) ఆధారంగా కాల నిర్ణయం చేసి, పని చేసేగడియారం ఇది. దీని పక్కనే తులసి వనం, వనం మధ్యలో పాముల పుట్ట చూడవలసినది.

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

ఉద్యానవనం

ఉద్యానవనం

దేవాలయం కి వచ్చే భక్తులు సేదతీరేందుకై దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం తప్పక చూడాలి. అనేక రకాల పూల మొక్కలు, పూజ కు ఉపయోగపడే జాపత్రి మొక్కలు, పొగడ చెట్లు ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన ఆకర్షణలతో ఈ ఉద్యానవనం నిర్మితమైనది. ఇక్కడ కూర్చోవడానికి సిమెంట్ బల్లలు కూడా ఏర్పాటుచేశారు.

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

ప్రకృతి చికిత్సాలయం

ప్రకృతి చికిత్సాలయం

రత్నగిరి కొండపై భక్తుల ఆయురారోగ్యాల కోసం పకృతి చికిత్సాలయ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో నిష్ణాత్తులైన యోగ విద్య నిపుణులు, ప్రకృతి వైద్య నిపుణులు ఆద్వర్యంలో చిక్సిత అందిస్తారు. అనేక వ్యాదులకు చికిత్స అందిస్తారు.

చిత్ర కృప : vinayvarma4u

దేవస్థానం పరిసరాలు

దేవస్థానం పరిసరాలు

దేవస్థానం కొండ పైనించి చూస్తె, చుట్టుపక్కల పచ్చని మైదానం కనువిందు చేస్తుంది. కొండ క్రింద పెద్ద చెరువు వుంది. దాని పేరు పంపా సరోవరం. పచ్చికబయళ్ళు మరియు కొండలతో సరస్సు ఎంతో అందంగా కనిపిస్తుంది.

చిత్ర కృప : Raj

అన్నదానం

అన్నదానం

అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్య అన్నప్రసాద కార్యాక్రమం అందుబాటులో ఉంది. వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడ భోజనం చేసి దేవుని దర్శనం చేసుకుంటారు. కేవలం దాతలు సమర్పించే డబ్బుతోనే ఈ బృహత్తర కార్యాక్రమం నిర్వహించబడుతుంది. మీరు కూడా అన్నదాన సత్రానికి వెళితే మీకు తోచిన సాయం చేయటం మరవద్దు ..!

చిత్ర కృప : Teja Sunil

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరానికి వెళుతున్న మార్గంలో కనిపించే జలాశయం

చిత్ర కృప : Adityamadhav83

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం క్షేత్రంలో గోవుల సంరక్షణ కేంద్రం

చిత్ర కృప : benharlanes

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం క్షేత్రానికి సమీపిస్తున్న వేళ ... ప్రకృతి రమణీయత

చిత్ర కృప : Krishnan Ramchandran

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం క్షేత్రంలో సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కెమరాకు చిక్కిన అద్భుత దృశ్యం

చిత్ర కృప : benharlanes

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

ఉత్సవాల సమయంలో, పండుగ సమయాలలో అన్నవరం క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతున్న దుకాణాలు

చిత్ర కృప : Udai Paidipalli

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం క్షేత్రంలో కొలువైన సత్యదేవుడు

చిత్ర కృప : Naveen K Prathapaneni

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం గ్రామానికి బస్సు సదుపాయం ఉన్నది. సమీప రాజమండ్రి, కాకినాడ , వైజాగ్ నగరాల నుండి ప్రతి రోజు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ మరియు ఇంద్ర వంటి ఏసీ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Phani'z Clickz

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటున్నప్పుడు రోడ్డు పక్కన గల కాకా హోటల్. ఇక్కడ టీ, టిఫిన్ లు లభిస్తాయి. బైక్ ల మీద వచ్చే వారు ఇక్కడ టీ తాగకుండా ఉండలేరు.

చిత్ర కృప : Bheemesh Chowdary Kacharagadla(Raghu)

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం ఆలయ క్యూ కాంప్లెక్స్ అనుకుంటున్నారా ?? తప్పు .. తప్పు క్యూ కాంప్లెక్స్ కాదిది అన్నవరం రైల్వే స్టేషన్.

చిత్ర కృప : Soulfrnd Sai

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

ఆలయ సన్నిధిలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దంపతులు

చిత్ర కృప : sumaswara

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

ఆలయ సన్నిధిలో గల సింహాసన మండపం

చిత్ర కృప : Adityamadhav83

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం దృశ్యాలు మరిన్ని ఫొటోలతో ...

అన్నవరం గ్రామానికి సమీపంలో గల కాఫీ డే

చిత్ర కృప : Adityamadhav83

కొత్త సన్నిధి

కొత్త సన్నిధి

నిత్యం భక్తుల రద్దీ పెరుగుతుండటంతో రత్నగిరికి అనుకుని 303 ఎకరాలు కొత్త కొండ (సత్యగిరి) కొనుక్కొని గ్రానైట్ రాయితో అత్యంత సుందరంగా నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వసతిగదుల నిర్మాణ పనులు చురుగ్గా చేస్తున్నారు.

చిత్ర కృప : Adityamadhav83

ప్రసాదం

ప్రసాదం

దేవస్థానంలో గోధుమ రవ్వతో తయారయ్యే ప్రసాడానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. గోదుమనూక, పంచదార, నెయ్యి, యాలకులపోడి, సుగందద్రవ్యాలతో ప్రసాదాన్ని తయారు చేస్తారు. బయట మీరు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు. 200 గ్రాముల ప్రసాదాన్ని రూ. 10 అమ్ముతారు.

చిత్ర కృప : vrk1219

వసతి

వసతి

సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు అనేక వసతి సౌకర్యాలు ఉన్నాయి. గుర్తింపు కార్డు చూపిస్తేనే గదులు కేటాయిస్తారు. కొండ క్రింది దేవస్థానం సత్రములు, హొటళ్ళు ఉన్నాయి. కొండపైన కూడా విడిదికి సత్రాలు దేవస్థానం తరపున గదులతో కూడినవి ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి.

చిత్ర కృప : pawan kumar

అన్నవరం ఎలా చేరుకోవాలి ??

అన్నవరం ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

అన్నవరం గ్రామానికి చేరుకోవడానికి సమీపంలో విమానాశ్రయం రాజమండ్రి దేశీయ విమానాశ్రయం. ఇది సుమారు 80 కి. మీ. దూరంలో ఉండి, రెండు గంటల్లో అన్నవరం చేరుకొనే విధంగా ఉంటుంది. అన్ని ప్రభుత్వ / ప్రవేట్ బస్సుల్లో లేదా వాహనాల్లో అన్నవారానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

అన్నవరంలో రైల్వే స్టేషన్ ఉంది. చెన్నై-హౌరా రైల్వేలైన్‌లో ఉన్న అన్నవరం రైల్వేస్టేషన్‌లో సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లన్నీ ఆగుతాయి.

బస్సు మార్గం

రాజమండ్రికి 80 కిలోమీటర్లు దూరంలో, కాకినాడకు 50 కిలోమీటర్ల దూరంలోనూ జాతీయ రహాదారికి పక్కన అన్నవరం ఉంది. రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ప్రతీ పావుగంటకు బస్సులున్నాయి. రాజమండ్రి నుంచి విశాఖపట్నం అన్నవరం సింగిల్‌స్టాప్‌ బస్సులుకూడా ప్రతీ 45 నిమిషాలకు అందుబాటులో ఉన్నాయి. అన్నవరం చేరుకున్న తర్వాత దేవస్థానం బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X