Search
  • Follow NativePlanet
Share
» »కంజిరప్పల్లి - ఐక్యతకు పుట్టినిల్లు !!

కంజిరప్పల్లి - ఐక్యతకు పుట్టినిల్లు !!

ఎరుమేలి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. శబరిమల వెళ్ళే భక్తులు తప్పక ఈ ప్రదేశాన్ని దర్శిస్తారు. ఇక్కడ రెండు ప్రధాన ఆకర్షణలు కలవు. అందులో ఒకటి మసీద్ కాగా, రెండవది శాస్త ఆలయం.

By Mohammad

కంజిరప్పల్లి కేరళలోని కొట్టాయంలో కలదు. ఇది తాలూకా మరియు ఒక చిన్న పట్టణం. ఈ ప్రదేశంలో సిరియన్ క్రైస్తవులు అధిక జనాభాగా కలరు. జనాభాలో ముస్లింలు మరియు హిందువులు కూడా కలదరు. మతపర స్ధిరత్వాలు పట్టణ సంస్కృతిపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఈ పట్టణం పేరు అక్కడి కంజిం చెట్లు కారణంగా ఏర్పడింది. ఒకప్పుడు ఈ ప్రాంతం నిండా కంజిం చెట్లు ఉండేవి. కొయ్యిన్ తెగల ప్రజలు ప్రారంభంలో ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. తర్వాతి కాలంలో తమిళులు స్ధిరపడ్డారు. దానితో ఆ ప్రాంతానికి వలస రాకలు, పోకలు ఆరంభమయ్యాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాండ్య రాజకుమారుడు స్వాధీనం చేసుకున్నాడు. మొదటగా ఇక్కడ స్ధిరపడిన తమిళులలో కన్ననూర్ చెట్టి కులం వారు వీరు, చెట్టినాడు గ్రామానికి చెందినవారు.

గణపతియార్ కోవెల్

గణపతియార్ కోవెల్

గణపతియార్ కోవిల్ దేవాలయం సుమారు 900 సంవత్సరాల క్రిందట నిర్మించబడింది. ఈ దేవాలయంపై అందమైన చెక్కడాలు, శిలా శాసనాలు దాని గ్రానైట్ స్తంభాలపై తమిళ భాషలో వ్రాయబడి కలవు. ఈ దేవాలయాన్ని గుడి చుట్టూ స్ధిరపడిన చెట్టి కులస్తులు నిర్మించారు.

చిత్రకృప : arunpnair

నైనారు మసీదు

నైనారు మసీదు

కంజిరప్పల్లి లో ముస్లింలు కూడా అధికమే. వీరంతా ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారు. నైనారు మసీదు ప్రతి సంవత్సరం వేలాది ముస్లిం భక్తులను ఆకర్షిస్తుంది. ముస్లింలకు ప్రసిద్ధి చెందిన మసీదు.

చిత్రకృప : jay

సెయింట్ డామినిక్స్ కేధడ్రల్

సెయింట్ డామినిక్స్ కేధడ్రల్

సెయింట్ డామినిక్స్ కేధడ్రల్ ను మొదటగా చర్చిగా నిర్మించారు. ఇది వయంపు పురయిడం లో చిట్టార్ నది ఒడ్డున కలదు. కేధడ్రాల్ ప్రదేశం అందంగా ఉంటుంది. దీనిని 1826లో నిర్మించారు. 1977 లో దీనిని కేధడ్రల్ గా ప్రకటించారు. ఈ కేధడ్రల్ అధిక సంఖ్యలో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్రకృప : Achayan

ఎరుమేలి

ఎరుమేలి

ఎరుమేలి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. శబరిమల వెళ్ళే భక్తులు తప్పక ఈ ప్రదేశాన్ని దర్శిస్తారు. ఇక్కడ రెండు ప్రధాన ఆకర్షణలు కలవు. అందులో ఒకటి మసీద్ కాగా, రెండవది శాస్త ఆలయం. ఇవేకాక చుట్టుప్రక్కల మరెన్నో మతపర కేంద్రాలు నడుస్తున్నాయి.

చిత్రకృప : Avsnarayan

పాజ్హాయపల్లి సెయింట్ మేరీస్ ఓల్డ్ చర్చ్

పాజ్హాయపల్లి సెయింట్ మేరీస్ ఓల్డ్ చర్చ్

భారతదేశంలో ఉన్న అతి పురాతన చర్చి లలో ఈ చర్చి ఒకటి. ఈ ప్రార్థనా ఆలయానికి మేరిమాత పేరుపెట్టారు. దీనిని క్రీ.శ. 1449 వ సంవత్సరంలో చెక్క మరియు రాళ్ళతో నిర్మించారు. తర్వాత నేటికాలానికి అనుకూలంగా మార్చివేశారు.

చిత్రకృప : Rinuthomas90

పొంకున్నం

పొంకున్నం

పొంకున్నం కంజిరప్పల్లి కి 6 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ప్రదేశం దివంగత నవలా రచయిత పొంకున్నం వార్కె స్వస్థలం. ఇక్కడ చిరకడవు మహాదేవర్ గుడి, పుతియకావిల్ దేవి ఆలయం చూడదగ్గవి.

చిత్రకృప : Dvellakat

చెమ్మలమట్టోమ్

చెమ్మలమట్టోమ్

వెంగతనం వాటర్ఫాల్స్ చెమ్మలమట్టోమ్ గ్రామానికి సమీపంలో ఉన్నది. జలపాతం కంజిరప్పలికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో, చెమ్మలమట్టోమ్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్రకృప : Rizwan jafar

వజ్హూర్

వజ్హూర్

వజ్హూర్ గ్రామము కంజిరప్పల్లి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ లార్డ్ అయ్యప్ప కు అంకితం చేయబడిన వెట్టికట్టు ధర్మ శస్త గుడి ఉన్నది. ఇవే కాక చేరువలో ఇతర మత కేంద్రాలు ఉన్నాయి.

చిత్రకృప : Vinayaraj

కంజిరప్పల్లి ఎలా చేరుకోవాలి ?

కంజిరప్పల్లి ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణంలో సుమారు గంటన్నర సమయంలో కొచ్చి నుండి కంజిరప్పల్లి చేరుకోవచ్చు. దూరం 101 కి.మీ.లు మాత్రమే. కంజిరప్పల్లి నుండి వివిధ పట్టణాలకు ప్రభుత్వ బస్ లు కూడా కలవు.

రైలు ప్రయాణం

ఈ పట్టణానికి కొట్టాయం సమీప రైలు స్టేషన్ కలిగి ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, అంటే చెన్నై, త్రివేండ్రం, బెంగుళూరు, మంగుళూరు, కొచ్చిన్, ఢిల్లీలకు రైళ్ళు కలిగి ఉంది.

విమాన ప్రయాణం

కంజిరప్పల్లి కి సమీప విమానాశ్రయం కొచ్చి లోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 98 కి.మీ.ల దూరంలో కలదు. విమానాశ్రయం నుండి బస్ లేదా ప్రయివేట్ టాక్సీలో చేరవచ్చు.

చిత్రకృప : VishnuMohan43

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X