Search
  • Follow NativePlanet
Share
» »మహారాజులా ప్రయానించండి !

మహారాజులా ప్రయానించండి !

ఒక్క వారం రోజుల పాటు అంటే ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు మహారాజు అవండి. ఈ ప్రయాణం మీకు ప్రపంచం అంతా మీ కొరకే సృష్టించాబదిండా అనిపించేలా చేస్తుంది. ఈ అనుభవానికి ఏ వర్ణనా సరిపోదు. అంతా విలాసాలు, వినోదాలు. ఈ ప్రయాణంలో చరిత్రను తిరగ వేయండి, ప్రకృతి అన్వేషించండి, అద్భుత శిల్ప కళల సంపద ఆనందించండి. రుచికర వంటకాలు తినండి, ఖుషీ చేసుకోండి, మీలోని రాజసం వెల్లడించండి, అనుభవాలను మిగిల్చుకోనండి. ఇండియా లో లక్జరీ ట్రైన్ అంటే అది గోల్డెన్ చారియోట్ మాత్రమే. దీనిని ప్రసిద్ధ ' పాలస్ ఆన్ వీల్స్' తీరులో ప్రవేశ పెట్టారు. గోల్డెన్ చారియోట్ అంటే బంగారు రధం అనే పేరును హంపి లోని ప్రసిద్ధ రాతి రధం నుండి వచ్చింది. ఈ మీ మహారాజ పర్యటనలో హంపి కూడా ఒక గమ్య స్థానమే.

మహారాజ పర్యటన

దక్షినాది గర్వం అని చెప్పుకోనబడే ఈ రైలు, రైల్వే శాఖకు కు కూడా ఒక గర్వ కారణమే. ఈ త్రైన్లోని ఆధునిక మరియు చారిత్రక అంశాలు ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రశంసలను తెచ్చి పెట్టాయి. కర్నాటక రాష్ట్ర పర్యటన లో ఒక అద్భుతం అయిన ఈ ట్రైన్ ప్రపంచంలోనే ఒక ఉత్తమ విలాసాల రైలు పర్యటనగా కీర్తించబడింది. ఈ ట్రైన్ ప్రయాణం మీకు చేరే ప్రదేశం కంటే కూడా జర్నీ ఆనందాన్ని ఇస్తున్దనతంలో సందేహం లేదు. అయితే, దీని ప్రయాణపు ఖర్చు కూడా కొంచెం అధికమే. ఒక్కసారి గొప్పవారి గొప్పవారి సౌకర్యాలు ఆనందిన్చేయడానికి ఇది ఒక అవకాశం. ట్రైన్ లో సేవలు ఏ లోపం లేకుండా వుంటాయి.

మహారాజ పర్యటన

ఈ ట్రైన్ అంశాలు పరిశీలిస్తే, 18 బోగీలు. పూర్తిగా అన్ని సదుపాయాలూ కల ౪౪ కేబిన్ లు, ఒక ఆయుర్వేదిక్ స్పా, ఒక జిం, రుచులూరే ఆహారం విలాసంగా వైన్ తాగుతూంటే కన్నులకు విందు చేసే డాన్స్ లు, సుఖంగా నిద్రించేందుకు సిల్క్ గుద్దల పరుపులు, బెడ్ షీట్ లు అన్నీ విలాసమే. అన్నిటికి కలిపి ఒకే మాట...రాజ భోగం. మహారాజ ఠీవి కి అనుగుణంగా, కోచ్ లు అన్నీ దక్షినాది రాజ్యాల పేర్లు కలిగి వున్నాయి. కదంబ, హోయసల, రాస్త్రకోట, గంగ, చాళుక్య, బహామిని, ఆదిల్ షాహి, సంగమ, శాతవాహన, యుడుకుల , విజయనగర మొదలైన పేర్లు పెట్టారు. బంగారు వన్నె కల ఇసుక నిండిన బీచ్ లు పుష్కలమైన వన్య జీవ సంపద, చూసి కూడా ఆనందించవచ్చు.

 వారం రోజుల మహారాజు

అద్భుత సౌకర్యం, అరుదైన అనుభవం అందించే గోల్డెన్ చారియోట్ - దక్షిణాదికి గర్వకారణమైన ఈ ట్రైన్, దక్షిణాదిన కల బెంగుళూరు - కాబిని-శ్రీరంగపట్న - మైసూరు - శ్రావనబెలగోల - బేలూర్ - హలేబీద్ - హంపి - బాదామి - పట్టదకాల్ - గోవా పట్టణాల పర్యటన చూపుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X