Search
  • Follow NativePlanet
Share
» »ధంతరి - ఔత్సాహికులకు ఒక స్వర్గం !!

ధంతరి - ఔత్సాహికులకు ఒక స్వర్గం !!

భారతదేశ పురాతన ప్రాంతాలలో ధంతరి ఒకటి. ఈ భూమి అడవులతో నిండిన సారవంతమైన మైదానంలో ఉన్నది. ఈ ప్రాంతం విభిన్న జాతుల వన్యప్రాణుల కేంద్రంగా పరిఢవిల్లుతుంది. ఇక్కడ నివసిస్తున్న జంతువులు, పక్షుల గురించి తెలుసుకోవడానికి వచ్చే వన్యప్రాణుల ఔత్సాహికులకు ఇదొక స్వర్గంగా కనిపిస్తుంది.
ఈ పట్టణంలో చూడవలసిన అందాలు తక్కువే అయినప్పటికీ పట్టణ అందాలు తెరుచుకొనే ఉంటాయి. ఈ పట్టణానికి పర్యాటకులు చాలామంది దేశం నలుమూలల నుండి వస్తుంటారు ఎందుకు అని మీ సందేహమా??? విశ్రాంతి, అన్వేషణ మరియు కాసింత పట్టణ అందాల కొరకు. మీరు ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి ఒక లుక్కు వేద్దాం పదండి!!

సితానది వన్యప్రాణుల అభయారణ్యం

ఈ అభయారణ్యం మధ్యలో ఉద్భవించిన సితానది నది పేరు పెట్టబడిన సితానది వన్యప్రాణుల అభయారణ్యం దట్టమైన పచ్చని వృక్షజాతులు, గొప్ప, ప్రత్యెక జంతుజాతులకు పేరుగాంచింది. సితానది అభయారణ్యం ప్రధానంగా సాల్, టేకు, వెదురు వృక్షజాతుల అడవులను కలిగిఉంది. సితానది వన్యప్రాణుల అభయారణ్యంలో పులులు, చిరుతలు, అనేక అడవి జాతులకు చెందిన ప్రధాన వన్యప్రాణులు కనిపిస్తాయి. ఈ అభయారణ్యంలో గణనీయమైన పక్షులు కూడా కనుగొనవచ్చు. ఇది ప్రకృతి ప్రేమికులకు మరియు వన్యప్రాణుల ఔత్సాహికుల కి ఇది ఒక సహజ పర్యాటక కేంద్రం గా ఉన్నది. పర్యాటకులు ఇక్కడకు వచ్చి సఫారి జీప్ లో వెళ్ళి వన్యప్రాణులను చూస్తూ ఆనందించవచ్చు.

ప్రకృతి అందాలతో దీవించబడ్డ భూమి!!

అభయారణ్యంలో ఉన్న చిరుత

Photo Courtesy: Tambako The Jaguar

సిహావ

సిహావ, ధంతరి కి సమీపంలో ఉన్న చత్తీస్గడ్ లోని ప్రధాన యాత్రాస్థల కేంద్రాలలో ఒకటి. అడవులు, పర్వతాలతో చుట్టబడి ఉన్న ఈ చిన్న పట్టణప్రాంతం, మహానది నది ఒడ్డుపై ఉంది. కర్బేశ్వర్ ఆలయం, గణేష్ ఘాట్, హ్రింగి హథి ఖోట్ ఆశ్రమం, దంతేశ్వరి గుహ, అమ్రిత్ కుండ్, మహామాయి ఆలయం మొదలైనవి సిహావ లోని గుర్తుంచుకోదగ్గ ప్రదేశాలు. భక్తులు ఈ పవిత్ర ప్రదేశాలకు సుదూర ప్రాంతాలనుంచి ప్రార్ధనలు చేయడానికి వస్తుంటారు. ఇక్కడకు వస్తున్న పర్యాటకులు ఈ ప్రదేశాలను సందర్శించి, పక్కనే ఉన్న నది అందాలను ఆశ్వాదిస్తారు.

మదంసిల్లి డాం

ముర్రుంసిల్లి డాం అనికూడా పిలువబడే మదంసిల్లి డాం ఇది మహానది పై ఉన్నది. ఛత్తీస్గడ్ లోని ఉత్తమ నిర్మాణ అద్భుతాలలో ఒకటిగా భావించే ఈ డాం 1914-1923 మధ్య నిర్మించబడింది. ఈ డాం చత్తీస్గడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ నుండి షుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్యామ్ మీద నుండి ప్రకృతి ప్రేమికులు అడవి మొత్తం కవర్ చేయవచ్చు అంతే కాక ఇది ఫోటోగ్రాఫర్లు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. దీనికి మీ కుటుంబంతో పిక్నిక్ స్పాట్ గా వెళ్లినట్లయితే ప్రకృతి అందాలను తనివితీరా ఆనందించవచ్చు.

గంగ్రెల్ డాం

రవిశంకర్ డాం అనికూడా పిలువబడే గంగ్రెల్ డాం, ధంతరి జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది 15 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న మహానది నది పక్కన నిర్మించబడింది. ఈ రిజర్వాయర్ సమీప ప్రాంతాల కోసం విద్యుత్తును ఉత్పత్తిచేసే గంగ్రెల్ హైడల్ విద్యుత్తు ప్రాజెక్ట్ ను కూడా కలిగి ఉంది. ఇది చత్తీస్గడ్ ప్రాంతంలోని అతిపెద్ద, పొడవైన డాం కూడా.

ప్రకృతి అందాలతో దీవించబడ్డ భూమి!!

డ్యామ్ ముఖచిత్రం

Photo Courtesy: Chattisgarh Tourism

ధంతరికి ఎలా వెళ్ళాలి?

వాయు మార్గం

ధంతరికి డాగారాలో ఉన్న విమానాశ్రయం రాయ్‌పూర్, ఇది 16 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలచే అనుసంధానించబడినది.

రైలు మార్గం

ధంతరిలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకి రైళ్లు నిత్యం తిరుగుతూనే ఉంటాయి.

రోడ్డు మార్గం

రాయ్‌పూర్ నగరం 76 కి. మీ. దూరంలో ఉన్నది. రోడ్డు వ్యవస్థ బాగానే ఉన్నది. రాయ్‌పూర్ నుంచి ధంతరీకి బస్సులు నిత్యం తిరుగుతూనే ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X