Search
  • Follow NativePlanet
Share
» »చెన్నైలో గల ఆర్మేనియన్ చర్చికు పయనం

చెన్నైలో గల ఆర్మేనియన్ చర్చికు పయనం

చెన్నై దక్షిణ భారతదేశంలో గల ప్రధాన పర్యాటక స్థలము. భారతదేశంలో ఉత్తమ ప్రయాణ గమ్యస్థానాలలో ఒకటి. ఆకర్షణీయమైన బీచ్లు, దేవాలయాలు, స్మారక అద్భుతాలు మరియు ఆధునిక ఆకర్షణలు చెన్నైలో ఉన్నాయి.

By Venkata Karunasri Nalluru

ఆర్మేనియన్ చర్చి చెన్నైలో చాలా విశిష్టమైనది. ఈ అందమైన చర్చిని ఒకసారి చుట్టివద్దామా!

చెన్నైలో గల ఆర్మేనియన్

PC: Svs99n

ఆర్మేనియన్ చర్చి 1712 లో నిర్మించబడింది. ఇది భారతదేశంలో గల పురాతన చర్చిలలో ఒకటిగా ఉంది. దీనిని వర్జిన్ మేరీ యొక్క ఆర్మేనియన్ చర్చి అంటారు. చెన్నైలో ఆర్మేనియన్ స్ట్రీట్ లో ఉన్నది. నేడు ఈ చర్చి మాత్రమే చూడదగిన ప్రదేశాలలో ఒక వారసత్వంగా వస్తూ వుంది.

చరిత్రలో ఒక తునక:

వలసల కాలంలో, చెన్నై (మద్రాసు అని కూడా పిలుస్తారు) దక్షిణ భారతదేశం యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటి. (ఎక్కువగా ఇరాక్ నుండి) అర్మేనియన్లు ఆగ్నేయ ఆసియాలోని ముఖ్యమైన వ్యాపారులు. అర్మేనియన్లు తమ ప్రాంతాల్లో అనేక చర్చిలు నిర్మించారు. చెన్నైలో గల ఆర్మేనియన్ చర్చి వాటిలో ఒకటి. భారతదేశంలో ఆర్మేనియన్ చర్చిలు కోలకతా మరియు ముంబైలో ఉన్నాయి.

చెన్నైలో గల ఆర్మేనియన్

PC: Svs99n

చర్చి గురించి ప్రత్యేక ఏమిటి?

చర్చి యొక్క ప్రత్యేకతలలో ఒకటి బెల్ టవర్. టవర్ వద్ద వివిధ పరిమాణాలు గల ఆరు గంటలు ఉన్నాయి. ఇవి చాలా బరువైన గంటలు. ప్రతి గంట 150 కిలోల బరువు ఉంది. ప్రతి గంట వివిధ కాలాలలో చరిత్రలో జరిగిన సంఘటనలను దాని పైన పేర్కొనబడిన శాసనాల ద్వారా తెలుపుతుంది. ఈ గంటలు చర్చి యొక్క సంరక్షకుల అధీనంలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గం.లకు మ్రోగుతాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే చర్చి ప్రాంగణంలో సమాధులు ఏర్పాటు ఉంది. మీరు ఇక్కడ సుమారు 350 అర్మేనియన్లు సమాధులు చూడవచ్చును.

చర్చి తెరచు వేళలు:

చర్చి అన్ని రోజులలో 9 గంటల నుండి 2.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ సమయంలో సందర్శకులు చూడవచ్చు.

చెన్నైలో గల ఆర్మేనియన్

PC: Svs99n

చెన్నైలో ఆర్మేనియన్ చర్చి చేరుకోవడం ఎలా?

చర్చి చెన్నై నగరంలో జార్జ్ టౌన్ యొక్క ప్యారీస్ కార్నర్ లో ఆర్మేనియన్ స్ట్రీట్ లో ఉన్నది. చర్చి నుండి చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ కు కేవలం 5 నిమిషాలలో చేరుకోవచ్చును. మీరు నగరంలో ఎక్కడి నుండినైనా చర్చికి చేరుకోవడానికి ఒక ఆటో రిక్షాలో లేదా టాక్సీలో వెళ్ళవచ్చు.

ఇక్కడ చెన్నై చేరుకోవడానికి ఎలా?

చెన్నైలోని ఇతర చర్చిలు:

నగరంలోని ఇతర ప్రసిద్ధ చర్చిలు: శాంతోమ్ చర్చి, సెయింట్ తెరెసా చర్చి, సెయింట్ పాట్రిక్స్ కేథడ్రల్ మరియు సెయింట్ జార్జ్ యొక్క కేథడ్రాల్ ఉన్నాయి. చెన్నైలో ఇతర ఆకర్షణలు కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X