Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు చక్రవర్తి ... గౌతమీపుత్ర శాతకర్ణి !!

భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు చక్రవర్తి ... గౌతమీపుత్ర శాతకర్ణి !!

విశేషపాలనా నైపుణ్యాలు ప్రదర్శించిన రాజవంశాలలో శాతవాహనులు అగ్రగణ్యులు. వీరు క్రీ. పూ. 220 సంవత్సరం మొదలుకొని క్రీ.శ. 200 వరకు పాలనను కొనసాగించారు.

By Mohammad

గౌతమీపుత్ర శాతకర్ణి ... ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. బాలకృష్ణ 100 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అటు ఆయన అభిమానులే కాదు తెలుగు ప్రజలూ వేచి చూస్తున్నారు. మరి ఆశా మాషి వ్యక్తా ... గౌతమి పుత్ర శాతకర్ణి?! ఆయన భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి తెలుగు చక్రవర్తి. తెలుగు ఖ్యాతిని భారతదేశం నలుదిక్కులా వ్యాపింపజేసిన ఆయన వ్యక్తిత్వం ఆయనది. యుద్ధాలు జరగకూడదని .... శాంతిని నెలకొల్పాలని సంకల్పించిన వీరుడు, ధీరుడు. మరి ఆయన పాలన గురించి, వ్యక్తిత్వం గురించి ఆయనతో ముడిపడి ఉన్న ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం !

ఇది కూడా చదవండి : బాదామి వెళితే చాళుక్యుల కాలానికి ప్రయాణిస్తున్న అనుభూతి !!

విశేషపాలనా నైపుణ్యాలు ప్రదర్శించిన రాజవంశాలలో శాతవాహనులు అగ్రగణ్యులు. వీరు క్రీ. పూ. 220 సంవత్సరం మొదలుకొని క్రీ.శ. 200 వరకు పాలనను కొనసాగించారు. అంటే వీరి పాలన భారతదేశంలో 400 ఏళ్ళ పాటు సాగింది. శాతవాహన రాజులలో గౌతమి పుత్ర శాతకర్ణిది విశేష వ్యక్తిత్వం. ఈయనను శాలివాహనుడు అని కూడా అంటారు. ఈయన శాతవాహన రాజులలో 23 వ వాడు. తండ్రి తర్వాత ఇతను రాజ్యానికి రాజయ్యాడు. తండ్రి పేరులోని శాతకర్ణి (శాతవాహనుడు) ని మరియు తల్లి పేరులోని గౌతమిని (గౌతమి బాలశ్రీ) కలుపుకొని శాలివాహనుడు గౌతమిపుత్ర శాతకర్ణి గా ప్రజల మన్ననలను చూరగొన్నాడు.

ఈయనకు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి మరియు తెలంగాణలోని కోటిలింగాలతో ప్రత్యేక అనుబంధం ఉన్నది.

కోటిలింగాల

కోటిలింగాల

ఇక్కడ శాతవాహనుల రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు వేయించిన నాణేలు లభించాయి. ఇది గౌతమీపుత్ర శాతకర్ణి రాజధానిగా ఉండేది. కోటిలింగాల కరీంనగర్ జిల్లా వెల్గటూరు నుండి 4 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది, పెద్దవాగు సంగమస్థలంలో ఉంది.

చిత్రకృప : Vivek rachuri

శివాలయం

శివాలయం

గోదావరి దక్షిణ ఒడ్డున కోటిలింగాల దేవస్థానం (శివాలయం) ఉంది. కోటిలింగాల చారిత్రక బౌద్ధక్షేత్రము. చరిత్రకారులు ఇది శాతవాహనుల తొలి రాజధాని. శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్దకోట ఉండేదట. దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలాల ఎత్తైన కోట బురుజులు ఉండేవి.

శివాలయం

శివాలయం

ఆ తరువాత కొన్ని రోజులకు కోట బురుజులు శిధిలమై ఎత్తైన గడ్డగా మారాయి. అటుపిమ్మట ఈ గడ్డపైన గుడికట్టి, లింగాన్ని ప్రతిష్టించగా దానిని కోటలింగం అని, అదే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది. అందులోని దేవుడు కోటేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు.

అమరావతి స్తూపం

అమరావతి స్తూపం

గౌతమి పుత్ర శాతకర్ణి మరో రాజధాని అమరావతి. ఇప్పుడు అమరావతిలో లభ్యమైన శిల్పసంపద అంతా అప్పటి శాతవాహనుల కాలం నాటిదే! దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. వీరు మౌర్యుల శిల్పశైలులను మెరుగులుదిద్ది ఆంధ్రా వాస్తు శిల్పశైలులను చెక్కించారు.

చిత్రకృప : Nikhil0000711

శిల్పశైలి నిదర్శనాలు

శిల్పశైలి నిదర్శనాలు

అమరావతి శిల్ప శైలికి ప్రధాన కేంద్రాలు అమరావతి, నాగార్జున కొండ, జగ్గయ్య పేట, ఘంటశాల, గోలి, గుమ్మడి, దుర్లు మొదలైన ప్రాంతాలు ఈ శిల్పశైలి నిదర్శనాలు.

చిత్రకృప : Ambrose Dudley

అమరావతి

అమరావతి

1797 లో బయటపడ్డ అమరావతి స్తూపం శాతవాహనుల కాలం నాటిదే !! అమరావతి స్థూపం వంద అడుగుల ఎత్తు, 162 అడుగుల చుట్టుకొలత కలిగి దాని ప్రహరీ 102 అడుగుల చట్టుకొలతతో ఉంది. ఇక్కడ చూడవలసిన ఇతర ప్రదేశాలు : మ్యూజియం, కృష్ణా నది తీరం, సమీపంలో పంచారామ క్షేత్రం - అమరారామము (అమరేశ్వరుడు) చూడవచ్చు.

చిత్రకృప : Soham Banerjee

నాగార్జున కొండ

నాగార్జున కొండ

ఇది నాగార్జున సాగర్ వద్ద ఉన్న ఒక ఐలాండ్. ఇక్కడ కూడా శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. మహాచైత్యంతోపాటు నాలుగు విహారాలు, ఆరు చైత్యాలు, ఎనిమిది స్తూపాలు ఉన్నాయి. ఇది శాతకర్ణి ఉప రాజధాని. మ్యూజియం చూడదగ్గది.

చిత్రకృప : Michael Gunther

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట లో కూడా శాతవాహనుల అవశేషాలు లభ్యమయ్యాయి. ఇక్కడి కొండపై బౌద్ధ శిధిలాలు, నివాసాలు ఇప్పటికీ గమనించవచ్చు. జగ్గయ్య పేట లో పర్యాటకులను ఆకర్షించటానికి అనేక పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు ఉన్నాయి.

చిత్రకృప : Nbsubbaiah

ఘంటశాల

ఘంటశాల

కృష్ణా ఘంటశాల జిల్లాలోనిలో కూడా అమరావతి శైలి నిర్మాణాలు ఉన్నాయి. ఈ గ్రామములో కూడా శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపాలు మరియు హిందు శిల్పా శిథిలాలు అప్పటి శిల్ప కళలు బయటపడ్డాయి. ఇదే విధంగా గోలి, గుమ్మడి, దుర్లు ప్రాంతాలలో కూడా శాతవాహనుల అవశేషాలు లభించాయి.

చిత్రకృప : Ramarajugelli

సారూప్యత

సారూప్యత

అజంతా గుహల్లో తొమ్మిది, పది సంఖ్యల గుహల్లోని వర్ణ చిత్రాలు ఆంధ్ర శాతవాహనుల కాలంనాటివని అమరావతి శిల్పాలతో గల సారూప్యతను బట్టి చరిత్రకారులు గుర్తించారు.

చిత్రకృప : Dey.sandip

భారతదేశ చక్రవర్తి

భారతదేశ చక్రవర్తి

గౌతమి పుత్ర శాతకర్ణి శాశనాలలో ప్రముఖమైనది నాసిక్ శిలాశాశనం. దీనిని తల్లి గౌతమి బాలశ్రీ వేయించింది. ఆమె కుమారున్ని భారత దేశ చక్రవర్తిగా పేర్కొనింది. ఈయన పాలన దక్షిణాన కంచి వరకు వ్యాపించి ఉండేది. కొల్హాపూర్, బనవాసి రాజ్యాలను కూడా జయించాడు.

చిత్రకృప : Miline

అగ్రగణ్యుడు

అగ్రగణ్యుడు

ఈయన మూర్తి ఉన్న నాణేలను బట్టి ఈయన దృఢకాయుడని తెలుస్తోంది. ఉదారపాకునిగా, ఆగమనిలయునిగా, పరమధార్మకునిగా కీర్తించబడినాడు గౌతమి పుత్ర శాతకర్ణి. మౌర్యులు, కళింగుల మధ్య వీరిపాలన 450 ఏళ్ళ పాటు కొనసాగింది.

చిత్రకృప : Bharath chandra.y

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X