Search
  • Follow NativePlanet
Share
» »పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు ప్రయాణం

పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు ప్రయాణం

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో నల్లమల కొండలలో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఈ పట్టణం కృష్ణా నది ఒడ్డున గలదు. ఇది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా ఇక్కడకు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వ

By Venkata Karunasri Nalluru

శ్రీశైలం

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో నల్లమల కొండలలో ఉన్న ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఈ పట్టణం కృష్ణా నది ఒడ్డున గలదు. ఇది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా ఇక్కడకు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు. ఈ పట్టణంలో యాత్రీకులకు మరియు పర్యాటకులకు చూడగలిగే అనేక ఆలయాలు మరియు తీర్థాలు వున్నాయి.

అక్క మహాదేవి గుహలు:

అక్క మహాదేవి గుహలు నల్లమలై కొండల శ్రేణులలో ఉన్నాయి. ఈ గుహల చరిత్రలకు ఆధారాలున్నాయి. నిజానికి ఈ గుహలు పట్టణ చరిత్రలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. ప్రసిద్ధ 12 వ శతాబ్దపు తత్వవేత్త మరియు గీత రచయిత అయిన అక్క మహాదేవి వల్ల ఈ గుహలకు "అక్క మహాదేవి గుహలు" అని పేరు వచ్చింది. ఈమె గుహ లోపల లోతైన ఉనికిలో ఒక శివలింగానికి భక్తితో మనస్పూర్తిగా తపస్సు చేసి ప్రార్థనలు చేసింది. వంపు తిరిగిన గుహలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ప్రధాన గుహ సహజంగా ఏర్పడిన రాతి వంపు కలిగినది.

Travel to the Holy Town of Srisailam

The Shiva Lingam inside the cave

Photo Courtesy: రహ్మానుద్దీన్

మల్లెల తీర్థం ఫాల్స్

మల్లెల తీర్థంలో ఒక జలపాతం కలదు. ఈ ప్రాముఖ్యతగల్గిన ధార్మిక ప్రదేశాన్ని ప్రతి ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. జలపాతాలు ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్నాయి కానీ రోడ్ మార్గం ద్వారా సులభంగా చేరవచ్చు. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ఎందుకంటే జలపాతాలు హిందువులకు ప్రాధాన్యత కలిగినది మరియు మోక్షానికి మార్గంగా వున్నాయి. ఇది చర్మం మరియు కండరాల కీళ్లకు సంబంధించిన అనేక వ్యాధులను నయం చేసే గుణం కలిగివుంటుంది. ఈ జలపాతం చేరుకోవాలంటే మీరు దాదాపు 250 మెట్లు లోయలోకి దిగాలి. ఇక్కడ జలపాతం దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.

జలపాతం యొక్క అందమైన దృశ్యం

Travel to the Holy Town of Srisailam

Photo Courtesy: Ylnr123

శ్రీశైలం డ్యాం:

శ్రీశైలం డ్యాం ను కృష్ణా నదిపై నిర్మించారు. వ్యూహాత్మకంగా నల్లమల కొండలలో లోపల లోతైన గార్జ్ పైన నిర్మాణం జరిగింది. డ్యామ్ భారతదేశంలో గల అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులలో రెండవది. నేడు ఈ ఆనకట్ట (డ్యాం) 2,200 చదరపు కిమీ విస్తీర్ణం గల నీటిని అందిస్తుంది. వరదల సమయంలో శ్రీశైలం జలాశయం త్వరగా నిండిపోతుంది. మిగిలిన వరద నీటిని తక్కువ ఎత్తులో ఉన్న నాగార్జునసాగర్ ఆనకట్ట ద్వారా ప్రవహించేటట్లు చేస్తారు. ఇక్కడ డ్యామ్ ను చూడటానికి వచ్చిన యాత్రికులు పైనుండి సుందర దృశ్యం చూసి ఆనందిస్తారు.

Travel to the Holy Town of Srisailam

డ్యామ్ గేట్లు నుండి నీరు ఒకేసారి వరదలా ప్రవహించుట

Photo Courtesy: Chintohere

శ్రీశైలం యొక్క అభయారణ్యం:

శ్రీశైలం అభయారణ్యం భారతదేశంలోనే అతి పెద్ద పులుల అభయారణ్యంగా ఉంది. అభయారణ్యం లోపలి ప్రాంతంలో పూర్తిగా అనేక వెదురు మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఆకురాల్చు అడవులతో కప్పబడి ఉంటుంది. అభయారణ్యం లోపల పులులు, చిరుతలు, హైనాలు, అడవి పిల్లులు, ఎలుగు బంట్లు, జింకలు మరియు పాంగోలిస్ వంటి అడవి జంతువులు వున్నాయి. శ్రీశైలం డ్యాం కు చాలా దగ్గరగా ఉన్న ఆనకట్ట జలాలు మొసళ్ళకు కేంద్రంగా ఉంది.

Travel to the Holy Town of Srisailam

పంగోలిన్ యొక్క చిత్రం

Photo Courtesy: Valerius Tygart

శ్రీశైలంకు ఎలా చేరుకోవాలి?

విమాన మార్గం ద్వారా : శ్రీశైలంలో విమానాశ్రయం ఉంది. సమీప విమానాశ్రయం హైదరాబాద్ వద్ద వుంది. శ్రీశైలం పట్టణం నుండి ఇది 201 కి.మీ ల దూరంలో ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన నగరాలతో మరియు దేశంలోని ప్రముఖ నగరాలతో మరియు పట్టణాలతో బాగా అనుసంధానించబడింది.

రైలు మార్గం ద్వారా : శ్రీశైలంలో ఏ విధమైన రైల్వేస్టేషన్ లేదు. సమీప రైల్వేస్టేషన్ శ్రీశైలం నుండి 85 కి.మీ ల దూరంలో వున్న మార్కాపూర్ వద్ద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఇతర రైల్వే జంక్షన్లకు బాగా అనుసంధానించబడి ఉంది.

రోడ్డు మార్గం ద్వారా : శ్రీశైలం రోడ్లు కొన్ని ప్రధాన పట్టణాలకు మరియు నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం నుండి ఇతర ప్రాంతాలకు అనేక బస్సులు నడపబడుతున్నాయి.

Travel to the Holy Town of Srisailam

కాబట్టి మీరు శ్రీశైలం ప్రయాణం ఎప్పుడు చేయబోతున్నారు?

Photo Courtesy: sai sreekanth mulagaleti

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X