Search
  • Follow NativePlanet
Share
» »విహార యాత్ర విజయవంతం కావాలంటే... !!

విహార యాత్ర విజయవంతం కావాలంటే... !!

సామాన్యంగా పర్యటనకు వెళ్ళడం అంటే అందరకూ సంతోషమే. ఎందుకంటే, పుట్టినప్పటి నుండి ఒకే ప్రదేశంలో తిరుగుతుతాము కనుక మన మనస్సు ఇతర ప్రదేశాల ఆనందాలు, జీవన శైలి కూడా కోరుకొంటుంది. పర్యటనలకు వెళ్ళాలనే ఉత్సాహం ఎంత ఉన్నప్పటికీ, అక్కడకు వెళ్ళాలంటే , కొన్ని చర్యలు చేపట్టాలి. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొనడం తప్పని సరి.

విహార యాత్ర విజయవంతం కావాలంటే... !!

ఆరోగ్యపరమైన జాగ్రత్తలు

విహారయాత్రకు వెళ్లేవారు ముఖ్యంగా మెడికల్‌ కిట్‌ దగ్గరపెట్టుకోవడం మంచిది. అందులో చిన్న చిన్న గాయాలకు ప్రధమ చికిత్స చేసేందుకు ఉపయోగపడే విధమైన వస్తువులు, జ్వరం, జలుబు, కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కలిగించే మందులను మీకు దగ్గర్లోని డాక్టర్‌గారి సలహా మేరకు వెంటతీసుకెళ్లాలి. చక్కెర వ్యాధి గ్రస్తులు ఇన్సులిన్‌తో పాటు కొన్ని సందర్భాల్లో షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అందుకే పండ్లు, తినుబండారాలు దగ్గర పెట్టుకోవాలి. చాలా మంది పెద్దవారు డయాబెటిస్‌ ఉంది కనుక ఏమీ తినకూడదు అని ఉపవాసాలు చేస్తుంటారు. అది మంచిది కాదు. రక్తపోటు , గుండె జబ్బులు కలవారు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. వారి ఆరోగ్య పరిస్థితి గురించి పక్కవారితో చెప్పాలి. ఈత కొట్టడం, బరువులు ఎత్తడం చేయకూడదు. మోకాళ్ల నొప్పులు, అధిక బరువు ఉన్నవారు కొండ ప్రాంతాలు ఎక్కకపోవడం ఉత్తమం. ట్రెక్కింగ్‌ వంటివి చేసేప్పుడు ఆదమరిచి ఉండకూడదు. తప్పని సరిగా విహార యాత్రకు వెళ్లేముందు మీ ఫ్యామిలీ డాక్టరు సలహాలు తీసుకొని ప్రయాణమైతే చాలా వరకూ ఆరోగ్య పరంగా ఎదురయ్యే అవరోధాలను అధిగమించినట్లే.

విహార యాత్ర విజయవంతం కావాలంటే... !!

ఇప్పుడే త్వరపడండి అన్ని ఉచిత గోఐబిబో కూపన్ల కొరకు

విహార యాత్ర విజయవంతం కావాలంటే...

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం సహజం. కానీ వేసవి విహారానికి ఎత్తైన కొండలు, పర్వత ప్రాంతాలు, శిఖరాలు చల్లని ప్రదేశాలకు వెళుతున్నప్పుడు ఇంకా మరికొన్ని ఎక్కువ జాగ్రత్తలు పాటించడం అవసరం. అది పిల్లలైనా, పెద్దలైనా, యువతైనా. చాలా మందికి బస్సు ప్రయాణం పడదు. అలాంటి వారు రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం ఉత్తమం. అంతేకాకుండా ఎత్తైన కొండల్లో, ఘూట్‌ రోడ్డులో ప్రయాణించేప్పుడు మరి కొంత మందికి తల తిరగడం, కడుపులో వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు ముందుగానే మానసికంగా నాకేమీ కాదు అనే ధైర్యంతో ఉండాలి. వారి పక్కనున్న వారు ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. ఇంకొకటి చాలా మంది బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆహారపదార్థాలు, నీళ్లు సరిపడకపోవచ్చు. ఆ విషయంలో కొంచెం ముందు చూపుతో వ్యవహరించడం మంచిది.

విహార యాత్ర విజయవంతం కావాలంటే... !!

ఎక్కడిపడితే అక్కడ నీరు తాగకుండా ఫిల్టర్‌ చేసిన నీళ్లనే తాగడం ఉత్తమం. కొబ్బరి నీళ్లు, పండ్లు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. బయట దొరికే నూనె, ప్యాకెట్‌ పదార్థాలను సాధ్యమైనంత వరకూ తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కుర్రాళ్లు కొండలు, పర్వత ప్రాంతాలు, జలపాతాల దగ్గర తప్పని సరిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కలిసి వెళ్లినవారందరూ ఒకరినొకరు గమనించుకుంటూ ఇంకా మిగతా పర్యాటకులను పరిచయం చేసుకొని వారి సలహాలు, సూచనలతో సందర్శనీయ ప్రదేశాలను చూడటం మేలు. అక్కడ ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. లేని పక్షంలో చిరాకు, చిర్రుబుర్రులతో విహార యాత్ర అసంతృప్తినే మిగుల్చుతుంది. వన్య ప్రాణులు, అక్కడ కొన్ని ప్రదేశాల్లో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్టులను తప్పనిసరిగా గమనించాలి. ఆ ప్రాంతపు నియమ నిబంధనలను పాటించాలి.

విహార యాత్ర విజయవంతం కావాలంటే... !!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X