Search
  • Follow NativePlanet
Share
» »గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున ఉన్నది. గంగోత్రి 'చార్ ధామ్' మరియు 'దో ధామ్' ఈ రెండిటి యొక్క పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం, గంగా దేవత భగీరథ రాజు, అతని పూర్వీకుల పాపాలను కడిగివేయటానికి నది రూపంలో వొచ్చింది. దీనినే గంగ నది అని పిలుస్తున్నారు. గంగ యొక్క ప్రవాహవేగ ఒరవడి భూమి కొట్టుకుపోకుండా, శివుడు అతని శిఖలో గంగను బంధించాడు. గంగా నది లేదా గాంజెస్ యొక్క మూలం,గంగోత్రి నుండి 19 కి. మీ. దూరంలో ఉన్న గౌముఖ్ . గంగానది ఆవిర్భవించినప్పుడు, దీనిని 'భగీరథి' అని కూడా పిలిచేవారు.

గంగోత్రి, పురాతన ఆలయాలు మరియు మతపరమైన నమ్మకాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో గంగోత్రి ఆలయం ఒక ప్రధాన హిందూ మతం పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని గూర్ఖా రాజు, అమర్ సింగ్ తాప18 వ శతాబ్దం లో నిర్మించారు. భక్తులు అధిక సంఖ్యలో గంగా దేవతను ఆరాధించటానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ఉన్న గ్యానేశ్వర్ ఆలయం మరియు ఏకాదశరుద్ర ఆలయాన్ని కూడా సందర్శించవొచ్చు. ఇక్కడ జరిగే 'ఏకాదశ రుద్రాభిషేకం పూజ' చాలా ప్రశస్తి చెందింది.

గంగోత్రి దేవాలయం

గంగోత్రి టెంపుల్ భగీరథి నది ఒడ్డున కలదు. ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 3200 మీ. ల ఎత్తున కలదు. ఈ టెంపుల్ లో గంగా మాత విగ్రహం వుంటుంది. దీనిని అమర్ సింగ్ తప అనే ఒక గోర్ఖ జనరల్ 18 వ శతాబ్దం లో నిర్మించారు. వింటర్ లో ఈ టెంపుల్ అధిక మంచు కారణంగా మూసివేస్తారు. సమీపం లో అనేక ఆశ్రమాలు కలవు. వీటిలో యాత్రికులు బస చేయవచ్చు.

గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

గంగోత్రి దేవాలయం ముఖ చిత్రం

Photo Courtesy: Atarax42

గంజ్ఞాని

గంజ్ఞాని గంగోత్రి లో ఒక ఆధ్యాత్మిక పట్టణం. ధ్యానం కు ఈ స్థలం అనువైనది. అందమైన పర్వతాలు, ఆహ్లాదకర వాతావరణం దూరాల నుండి వచ్చే పర్యాటకులకు సేద తీరుస్తాయి. ఇక్కడి రిషి కుండ్ అనే నీటి కొలనులో స్నానాలు చేసి ఆ తర్వాత గంగోత్రి టెంపుల్ సందర్శిస్తారు. గంజ్ఞాని సమీపం లో భట్వరి అనే టెంపుల్ కలదు. ఈ టెంపుల్ వేదవ్యాసుది తండ్రి అయిన పరాశరుడికి కట్టారు.

నందనవనం మరియు తపోవనం

నందనవనం మరియు తపోవనం, గంగోత్రి హిమానీనదానికి ఎదురుగా గంగోత్రి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నందనవనం, శివలింగం, భాగీరథి, కేదర్ డోమ్, తలయ సాగర్ మరియు సుదర్శన వంటి శిఖరాల అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది. ఈ ప్రదేశం సతోపంత్, ఖర్చాకుండ్, కాళింది ఖాల్, మేరు మరియు కేదర్ డోమ్ వంటి శిఖరాల ట్రెక్కింగ్ కు ఆధార స్థావరంగా పనిచేస్తుంది. ప్రయాణీకులు భాగీరథి నది వారగా ట్రెక్ చేస్తూ గోముఖ్ ను చూడవచ్చు. ఇది బండరాళ్ళ మధ్య దూకడం, హిమానీనదాల యాత్ర మరియు రాతి అధిరోహణ వంటి సాహసచర్యలతో కూడిన అత్యంత ప్రసిద్ధ పర్వతారోహణ.

ట్రెక్కింగ్ మార్గం చిర్బాసా వద్ద పైన్ చెట్లు మరియు భోజ్ బాసా వద్ద కొండ రావి పొదలను దాటుకుని వెళుతుంది. ట్రెక్ మార్గం భోజ్ బాసా నుండి లంక మరియు గోముఖ్ కు దారితీస్తుంది. ప్రయాణీకులు నందనవనం వెళ్ళే మార్గంలో గంగోత్రి హిమానీనదం మరియు చత్తురంగిని హిమానీనదం గుండా వెళతారు. నందనవనం నుండి ట్రెక్కింగ్ మార్గం రాతి భూభాగం గుండా వెళ్లి చివరికి తపోవనం యొక్క పచ్చని పచ్చికబయళ్ళకు దారితీస్తుంది.

గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

హీమానీనదంతో కప్పబడిన పర్వతశిఖరం

Photo Courtesy: Arpit Rawat

గంగోత్రికి ఎలా వెళ్ళాలి??

విమానాశ్రయం

గంగోత్రికి సుమారుగా 280 కి. మీ. దూరంలో, డెహ్రాడూన్ లోని జాలి గ్రాంట్ ఏర్‌పోర్ట్ ఉన్నది. దీనికి సమీపం లో గల మరొక అంతర్జాతీయ విమానాశ్రయంఇందిరా గాంధీ ఏర్‌పోర్ట్. ఇక్కడ నుండి ప్రతీరోజు విమాన సర్వీసుల సదుపాయం ఉన్నది.

రైలు మార్గం

గంగోత్రికి సుమారుగా 250 కి. మీ. దూరంలో రిశికేష్ రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు ప్రయాణించవచ్చు.

రోడ్డు మార్గం

గంగోత్రికి సమీప ప్రదేశాల నుంచి నిరంతరం బస్సు సదుపాయం ఉన్నది. గవర్నమెంట్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సుల సదుపాయం కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X