Search
  • Follow NativePlanet
Share
» »హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు!

హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు!

ఉత్తర భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ రాష్ట్రం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ రాష్ట్రంలోని దిగువ ఇవ్వబడిన 12 పర్యాటక ప్రదేశాలు అనేక పర్యాటక ఆకర్షణలు కలిగి వున్నాయి.

ప్రకృతి దృశ్యాలు, ఆధ్యాత్మికత, సాహస క్రీడలైన ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఫిషింగ్, రివర్ రాఫ్టింగ్, స్కై ఇంగ్ , పారా గ్లైడింగ్ , స్కేటింగ్ వంటి వన్నీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ ఆసక్తి కరంగా సందర్సించేది గా వుంటుంది.

భారత్ - చైనా ల మధ్య పర్యాటక ప్రదేశాలు

వర్షాకాలం అయినప్పటికీ ఈ ప్రదేశాలు పర్యటనకు అనుకూలంగానే వుంటాయి. ఇక్కడ అనేక దేవాలయాలు కలవు. ఈ దేవాలయాలు ఆధ్యాత్మికులైన ప్రతి ఒక్కరూ చూసి భక్తి పారవశ్యంతో ఆనందిన్చదగినవి.

హిమాచల్ ప్రదేశ్ హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

హిమాచల్ ప్రదేశ లోని చాలా పర్యాటక ప్రాంతాలు చేరేందుకు బస్సు లు అనుకూలమైనవి. ఈ రాష్ట్రంలోని ప్రసిద్ధ ప్రదేశాలు ఢిల్లీ నుండి డైరెక్ట్ బస్సు లు దొరుకుతాయి. హిమాచల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పర్యాటకుల సౌకర్యం కొరకు వోల్వో బస్సు లను కూడా నిర్వహిస్తోంది. సిమ్లా , కుళ్ళు, పటాన్ కోట్ ప్రదేశాలలో చిన్న ఎయిర్ పోర్ట్ లు కలవు. ఇవి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు కనుపబడి వున్నాయి. వాతావరణ అనుకూలతను బట్టి ఈ సేవలు లభిస్తాయి. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలకు కొద్దిపాటి రైలు మార్గాలు మాత్రమే కలవు.
Photo Courtesy: Kamaljith K V

అర్కి

అర్కి

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో కల టూరిస్ట్ ప్రదేశాలలో అర్కి ఒకటి. జిల్లాలో చిన్న పట్టణం. ఇక్కడ లుటూరు మహాదేవ టెంపుల్, దుర్గ టెంపుల్ మరియు శక్తి మహాదేవ టెంపుల్ ప్రసిద్ధి. అర్కి కోట మరియు అర్కి పాలస్ లు తప్పక చూడదగినవి.

Photo Courtesy: Kumar Chitrang

బరోగ్

బరోగ్

బరోగ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని సోలన్ జిల్లాలో సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. బరోగ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు దగ్శై , విశాల్ శివ ఆలయం, దోలంజి బాన్ మొనాస్టరీ మరియు రేణుక సరస్సు ఉన్నాయి. వీటితో పాటు షోలోని దేవి ఆలయం, పిల్లల పార్కు మరియు జవహర్ పార్క్ ను కూడా పర్యాటకులు తరచుగా సందర్శిస్తూ ఉంటారు.

Photo Courtesy: Fred Hsu

బిర్

బిర్

అత్యంత అనూహ్యకరమైన ఇంకా అత్యంత సాహసోపేతమైన క్రీడలలో ఒకటైన పారాగ్లైడింగ్ బిర్ లో ప్రసిద్ది చెందినది. 'భారత దేశం యొక్క పారాగ్లైడింగ్ రాజధాని' గా వ్యవరించబడే ఈ ప్రాంతం పారాగ్లైడింగ్ కి ముఖ్యమైన టేకాఫ్ సైట్ గా పనిచేస్తుంది. బిర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్లింగ్ లాండింగ్ సైట్ గా వ్యవహరిస్తుంది.ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో, టూరిజం శాఖ, సివిల్ ఏవియేషన్ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఇక్కడ 'పారాగ్లైడింగ్ ప్రీ వరల్డ్ కప్' ఈవెంట్ ని నిర్వహిస్తారు.

చైల్

చైల్

చైల్ ఒక అందమైన హిల్ స్టేషన్. చైల్ లో ఉన్న క్రికెట్ గ్రౌండ్ సమద్ర మట్టం నుండి 2444 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన క్రికెటింగ్ వేదికగా పేరొందింది. పోలో గ్రౌండ్ గా కూడా ఉపయోగించబడే ఈ క్రికెట్ గ్రౌండ్ 1893 లో పాటియాలా రాజు అయిన భూపిందర్ సింగ్ చే నిర్మించబడింది. ఈ గ్రౌండ్ చుట్టూ పైన్ మరియు డియోడార్ అడవులు ఉన్నాయి. ఈ గ్రౌండ్ మిలిటరీ స్కూల్ వారి నిర్వహణలో ఉంది. ఇక్కడ కల చైల్ వైల్డ్ లైఫ్ సంక్చురి లో అనేక రకాల వన్య జంతువులను చూడవచ్చు.

Photo Courtesy: Vinish K Saini

డల్హౌసీ

డల్హౌసీ

80,000 మీటర్ల ఎత్తులో ఉన్న డల్హౌసీ ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా హిమపాతం అనుభవిస్తుంది. మంచు కారణంగా వాహనాలు ఒక చోటు దాటి వెళ్ళలేవు , అందువల్ల, ఈ ప్రదేశం చేరుకోవడానికి నడకే అత్యంత సౌకర్యవంతమైన పధ్ధతి. సందర్శకులు ఎగువ నకోరోట కొండల గుండా లక్కర్మండి కు అడవులు వెంట నడిచి వెళ్ళవచ్చు. మార్గమధ్యంలో, పర్యాటకులు,టిబెట్ హస్తకళ కేంద్రం, డల్హౌసీ బంగాళాదుంప వ్యవసాయ భూమి మరియు డల్హౌసీ జల వ్యవస్థలను చూడవచ్చు. అదనంగా, సందర్శకులు, సైనిక శిబిరం అయిన దయాకుండ్ శిఖరం యొక్క దృశ్యం కూడా చూడవచ్చు. ఇక్కడ సందర్శనకు అనేక పురాతన చర్చి లు కూడా కలవు.
Photo Courtesy: Sonusandhu

కసౌలి

కసౌలి

కసౌలి క్లబ్ ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్ ఆవరణలో కలదు. దీనిని 1880 లో స్థాపించారు. ఇండియా లోని సోషల్ క్లబ్ లలో ఇది గొప్పది. సభ్యులుగా చేరాలంటే సుమారు 15 సంవత్సారాలు వేచి వుండాలి. సెక్రటరీ ఈ క్లబ్ ను పర్యవేక్షిస్తాడు. ఈ క్లబ్ లో కల చెక్క పని తనం అద్భుతం. కాని ఇది 2001 లో ఒక అగ్ని ప్రమాదానికి కొంత నష్ట పోయింది. ఈ క్లబ్ లో రెండు టెన్నిస్ కోర్ట్ లు, ఒక స్క్వాష్ కోర్ట్, కార్డు రూమ్ లు, బిలియర్డ్స్ రూమ్, ఒక గార్డెన్ కలవు. ఈ ప్రదేశంలో వసతి సౌకర్యం కూడా కలదు. ఈ క్లబ్ కంటోన్మెంట్ కు సంబంధంగా వుంటుంది. ఈ క్లబ్ స్థాపించి నప్పటి నుండి ప్రతి సంవత్సరం మే లేదా జూన్ లలో కసౌలి నైట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Photo Courtesy: Varun Kutty

కీ లాంగ్

కీ లాంగ్

కీ లాంగ్ ప్రదేశాన్ని 'బౌద్ధ ఆరామాల భూమి ' అని పిలుస్తారు. ఇక్కడ అనేక బౌద్ధ ఆరామాలు కలవు. ఇవి శిల్ప శైలి మరియు చారిత్రక అంశాల తో పర్యాతకుదుఇ అద్భుత ఆనందాలు అందిస్తాయి. ఈ ఆరామాలలో కర్ డాంగ్ మరియు శాసూర్ ఆరామాలు ప్రసిద్ధి చెందినవి. కీ లాంగ్ లో అనేక సాహస క్రీడలు, ట్రెక్కింగ్, జీప్ సఫారి,పారా గ్లైడింగ్, స్కయింగ్ , కామ్పింగ్, ఫిషింగ్ వంటివి ఆచరించవచ్చు.

Photo Courtesy: Peter Krimbacher Moebius1

కిన్నౌర్

కిన్నౌర్

కిన్నౌర్ ను రాజ కుమారుల కదల భూమి అని చెపుతారు. హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ ఒక అందమైన జిల్లా. ప్రకృతి దృశ్యాలకు, మంచుతో కప్పబడిన శిఖరాలకు ప్రసిద్ధి. పచ్చటి లోయలు, ఆపిల్ తోటలు మరియు అందమైన వైన్ యార్డ్ తోటలు కూడా కలవు. ఈ లోయలలో సంగ్లా లోయ మరిఉ హన్గ్రంగ్ లోయ ప్రసిద్ధి చెందినవి. కిన్నౌర్ కైలాష్ మౌంటెన్ తప్పక చూడదగినది. ఇది ఈ ప్రాంతంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.

Photo Courtesy: Nick Irvine-Fortescue

కుఫ్రి

కుఫ్రి

సిమ్లా నుండి 13 కి. మీ. ల దూరంలో కల చిన్న పట్టణం కుఫ్రి. ఇక్కడ మహాసు శిఖరం, గ్రేట్ హిమాలయన్ నేచర్ పార్క్, వంటివి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు. గ్రేట్ హిమాలయన్ పార్క్ లో 180 రకాల పక్షులు మరియు అనేక వన్య జంతువులు చూడవచ్చు. అందమైన దృశ్యాలతో కూడిన ఫాగు కుఫ్రి కి 6 కి. మీ. ల దూరంలో కలదు. ప్రకృతి ప్రియులు ఈ ప్రదేశం బాగా ఇష్టపదతారు.

కుల్లు

కుల్లు

హిమాచల్ ప్రదేశ్ లో కుల్లు ఒక అందమైన జిల్లా. దీనిని 'వాలీ అఫ్ గాడ్స్' అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో రూపి పాలస్ అనబడే సుల్తాన్పూర్ పాలస్ ఒక పర్యాటక ఆకర్షణ. ఇక్కడి రాముడి దేవాలయం ను రఘ్నాథ్ టెంపుల్ అంటారు. ఇది కుల్లు లో ప్రధాన ఆకర్షణ. దీని నిర్మాణంలో ప్య్రామిదాల్ మరియు పహారీ శిల్ప శైలులు కనపడతాయి.
Photo Courtesy: John Hill

లాహోల్

లాహోల్

హిమాచల్ ప్రదేశ్ లో కల లాహోల్ టిబెట్ సరిహద్దులో కలదు. ఇక్కడ కిబ్బెర్ అనే గ్రామమో ప్రసిద్ధ బౌద్ధ ఆరామాలు మరియు కిబ్బెర్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి కలవు. పిన్ వాలీ నేషనల్ పార్క్, కీ మొనాస్టరీ, కుంజుం పాస్ లు ఇతర ఆకర్షణలు.

Photo Courtesy: Nvvchar

మండి

మండి

మండి ప్రదేశాన్ని 'వారణాసి కొండలు' అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ లోని ప్రధాన 12 పర్యాటక ఆకర్షనలలో ఒకటి. ఈ ప్రదేశంలో సుమారు 300 కు పైగా ఉదేవాలయాలి కలవు. ఈ హిందూ దేవాలయాలు ప్రధానంగా శివుడు, కాళికా మాతలకు సంబంధించినవి. ఇక్కడి దేవాలయాలలో పంచవక్త్రా దేవాలయం, అర్ధనారీశ్వర టెంపుల్ మరియు, త్రిలోకనాత్ టెంపుల్ ప్రసిద్ధి చెందినవి.

Photo Courtesy: Ritpr9

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X