Search
  • Follow NativePlanet
Share
» »ట్రెక్కింగ్ మరియు సాహసాల 'రామనగరం' !

ట్రెక్కింగ్ మరియు సాహసాల 'రామనగరం' !

By Mohammad

మీకు బాలీవూడ్ బ్లాక్ బాస్టర్ మూవీ 'షోలే' గుర్తుందా ? 1970 లలో తీసిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బ్లాస్టర్ మరియు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. 'షోలే' సినిమాలో మీకు కనిపించే కొండ ప్రాంతం అంతా కర్ణాటక లోని రామనగరం జిల్లా లో కలదు. సుమారు రెండున్నర సంవత్సరాల పాటు సినిమా షూట్ చేశారు.

ఇది కూడా చదవండి : బెంగళూరు టు మైసూర్ రోడ్ ట్రిప్ జర్నీ !

రామనగరం లేదా రామనగర కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు నైరుతి దిశగా 58 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు - మైసూరు హైవే రోడ్డు పై కలదు. వారాంతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య రానురానూ పెరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం పర్వతారోహణ. కొండ ప్రాంతం కావటంతో సాహసికులు, పర్యాటకులు పర్వతారోహణ , ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్ వంటి కార్యకలాపాలను ఆచరించటానికి ఇష్టపడతారు.

ఇది కూడా చదవండి : బెంగళూరు - మైసూర్ హై వే రెస్టారెంట్లు !

కొండ ప్రాంతం

కొండ ప్రాంతం

ఇదివరకే చెప్పినట్లు రామనగరం కొండ ప్రాంతం. ఇక్కడ సప్త గిరులు ఉన్నాయి. అవి - శివరామగిరి, సోమగిరి, క్రిష్ణగిరి, యతి రాజ గిరి, రేవణ్ణ సిద్దేశ్వర, సిడిల కల్లు మరియు జల సిద్దేశ్వర లుగా ఉన్నాయి.

చిత్ర కృప : Navaneeth KN

బర్డ్ వాచింగ్

బర్డ్ వాచింగ్

ఈ కొండ ప్రాంతం పసుపు పచ్చని కంఠం గల పక్షులకు, గద్దల వంటి అరుదైన పక్షులకు నివాసం అవటం వలన ప్రకృతి ప్రియులు ఇక్కడ పరవసిస్తారు.

చిత్ర కృప : Vaibhavcho

పర్వతారోహణ

పర్వతారోహణ

రామనగరం చుట్టుతూ కొండలు ఉండటంతో వలన, పర్వతారోహకులు స్వర్గం వలే అగుపిస్తుంది. ఇండియాలో 1960 నుండి ఇక్కడ పర్వతారోహణ జరుగుతుంది. కొండలలో రామదేవర బెట్ట, ఎస్ ఆర్ ఎస్ బెట్ట మరియు తెంగినకల బెట్ట ప్రధానమైనవి.

చిత్ర కృప : Abhishek Maji

పిరమిడ్ వాలీ

పిరమిడ్ వాలీ

కేవలం పర్వతారోహణే కాకుండా కాసింత ఆధ్యాత్మికం కోరుకొనేవారు కేబ్బెదొడ్డి గ్రామంలోని పిరమిడ్ వాలీ తప్పక సందర్శించాలి. ఇది 2003 లో స్థాపించబడి నేడు ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్ వాలీ లలో ఒకదానిగా ఖ్యాతి గాంచినది. ఒకేసారి 5000 మందికి వసతి సౌకర్యం కలిపించగలదు.

చిత్ర కృప : Natesh Ramasamy

చెన్నపట్న

చెన్నపట్న

బెంగళూరు కు 60 కి. మీ దూరంలో, రామనగరం కు 14 కి. మీ దూరంలో ఉన్న చెన్నపట్న చెక్కబొమ్మలకు మరియు లక్క బొమ్మలకు ప్రసిద్ధి. సంప్రదాయ మరియు అధునాతన పద్దతులను ఉపయోగించి ఈ బొమ్మలను తయారుచేస్తారు. సమీపంలోని అప్రమేయ స్వామి గుడి దర్శించదగినది.

చిత్ర కృప : Pratheepps

షాపింగ్

షాపింగ్

రామనగరం పట్టు వస్త్రాల వ్యాపారం జోరుగా ఉంటుంది. ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద పట్టు వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. షాపింగ్ చేయాలనుకునేవారు పట్టు, సిల్క్ దుస్తులను బేరం ఆడి కొనుక్కోవచ్చు.

రామనగర ఎలా చేరుకోవాలి ?

రామనగర ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : బెంగళూరు సమీప ఎయిర్ పోర్ట్. ఇక్కడి నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామనగరం వరకు క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించవచ్చు.

రైలు మార్గం : రామనగరం లో రైల్వే స్టేషన్ కలదు. కానీ, ప్రధాన నగరాలతో కలుపబడలేదు. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కనెక్ట్ చేయబడింది.

రోడ్డు మార్గం : బెంగళూరు, మైసూర్ నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు రామనగరం కు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Redolentreef

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X