అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంచే.. ఉబ్బ‌ల‌మ‌డుగు

Written by: Venkata Karunasri Nalluru
Updated: Tuesday, March 14, 2017, 14:20 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఉబ్బల మడుగు జలపాతం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా లో బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో సిద్ధుల కోన అనే అడవిలో ఉంది. ఇది శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు.

ఉబ్బలమడుగు.. ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి పరిచయం అవుతోన్న ఓ సుందర జలపాతం. ఈ అటవీ ప్రాంతంలోని పచ్చని తివాచీలా కనిపించే లోయలు.. వినసొంపైన జలపాతాల సవ్వడులు ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తాయి. అక్కడికి కాలినడకన సాగే ప్రయాణంలో వినిపించే పక్షుల కిలకిలారావాలు ఆత్మీయ ఆహ్వానాలు. 'తడ జలపాతం'గా కూడా పిలుచుకునే ఆ ప్రకృతి సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతం.

చిత్తూరు జిల్లాలో బుచ్చినాయుని కండ్రిగ, వరదయ్య పాలెం మండలాల సరిహాద్దు ప్రాంతంలో ఉబ్బలమడుగు జలపాతం కలదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్ధులకొన అని పిలువబడే అడవిలో ఈ సుందర జలపాతం కలదు. తిరుపతి నుండి ఈ జలపాతం 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ జలపాతాన్నే తడ జలపాతం అని కూడా పిలుస్తారు. వరదయ్యపాలెం నుండి ఉబ్బలమడుగు కు రోడ్డు సౌకర్యం కలదు. అందుకే పర్యాటకులు కూడా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.

సందర్శించవలసిన సమయం : అక్టోబర్ నుండి ఫిబ్రవరి

1. ఉబ్బల మడుగు జలపాతం - ఒక సుందర ప్రదేశం

ఉబ్బల మడుగు సుందర ప్రదేశమే కాకుండా... ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టలమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలరావాలు ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం కలిగివుంటుంది. ఉబ్బల మడుగు జలపాతం శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్దుల కోన అని పిలువ బడే అడవిలో వున్నది. ఇది ప్రధాన వర్షాకాల సమయంలో అనగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతం జలకళతో కళకళలాడుతూ ఉంటుంది.

PC: Deepak kumar

 

2. ఉబ్బల మడుగు ట్రెక్కింగ్

ఉబ్బలమడుగు జలపాతానికి చేరుకోవాలంటే 10 కి. మీ. లు నడవాలి. అడవి అంతా అందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి అలసట కనపడకుండా చేస్తాయి. రోడ్డు మొత్తం మట్టితో ఉన్నప్పటికీ చిన్న చిన్న కొలనులు అక్కడక్కడ దర్శనం ఇస్తుంటాయి. కొలనులో దిగి ఈత కొట్టవచ్చు. ఫోటోలు తీసుకోవచ్చును. నీళ్ల మీద నిర్మించిన వంతెన ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
PC: Deepak kumar

3. జలపాతం సందడి

ఈ జలపాతం చూస్తే మనల్ని మనం మరిచిపోవాల్సిందే! చిన్నపాటి సెలయేర్లు, పక్షుల కిలకిలరాగాలు, ప్రశాంత ప్రకృతిని దాటుకుంటూ అలానే ముందుకు వెళితే గలగల శబ్దాలు చేస్తూ పై నుండి కింద పడే సుందర జలపాతం దర్శనం ఇస్తుంది. దాన్ని చూస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ జలపాతం కింద తనివితీరా జలకాలు ఆడవచ్చు.
PC: Deepak kumar

4. వందేళ్ల చరిత్ర కల్గిన సిద్దేశ్వర ఆలయం

సిద్దేశ్వర ఆలయం పురాతనమైనది. ఈ ఆలయం జలపాతం ప్రక్కనే కలదు. ఇక్కడికి వచ్చే చాలా మంది పర్యాటకులు ఆలయాన్ని దర్శించుకొని, ఆ తరువాత జలపాతం వద్దకు చేరుకుంటారు.
PC: sabiths Follow

5. వసతి సౌకర్యాలు

ఉబ్బలమడుగు పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి వసతి సౌకర్యాలూ ఉండవని గ్రహించాలి. ఓ రోజుకు సరిపడా ఆహారం, నీరు వెంట తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. తిరుగు ప్రయాణం చీకటి పడకముందే మొదలుపెట్టడం చాలా ముఖ్యం.
PC: McKay Savage

6. వెంట తీసుకెళ్లవలసిన ముఖ్యమైన వస్తువులు

నీళ్ల బాటిల్, తినుబండారాలు, బిస్కట్లు, లంచ్ పొట్లాలు (పులిహోర, చపాతీలు, రొట్టెలు తీసుకొని వెళ్ళటం ఉత్తమం), ఒక జత బట్టలు, టవాలు (ఈత కొడితే) వెంట తీసుకెళ్లడం ఉత్తమం.
PC: McKay Savage

7. మహాశివరాత్రి రోజున ఉబ్బలమడుగు ప్రాంతం

ఉత్సవాలు, పండగలు మహాశివరాత్రి రోజున ఉబ్బలమడుగు ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. కుటుంబంతో సహా ఇక్కడకు చేరుకొనే స్థానికులు ఇక్కడే టెంట్లు వేసుకొని వంటావార్పు కానిచ్చేస్తారు. ఆ సమయంలో దుకాణాలు సైతం ఇక్కడ వెలుస్తాయి.

PC: McKay Savage

8. ఎలా చేరుకోవాలి?

ఇక్కడికి చేరుకునేందుకు ముందుగా వరదయ్యపాలెం వెళ్ళాలి. ఈ ప్రాంతానికి దగ్గర ఉన్న రైల్వేస్టేషన్‌ తడ. అయితే ఇక్కడ అన్ని ట్రైన్లూ ఆగవు. వరదయ్యపాలెం అక్కంపేటకు 11, సూళ్లూరుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఆటోలు లేదా సొంత వాహనాలలో ఉబ్బలమడుగు ఎంట్రెన్స్‌ వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి నడకమార్గంలోనే వెళ్లాలి. తిరుపతి ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. వరదయ్యపాలెం నుండి ఆటోలు లేదా సొంత వాహనాలలో ఉబ్బలమడుగు ఎంట్రెన్స్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుండి ఇక నడకమార్గమే!
PC: deva Follow

9. వేసవి తాపం

వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు పర్యాటకులు ఉబ్బలమడుగు ఫాల్స్‌కు క్యూకడుతున్నారు. ఆంధ్రా నుంచే కాకుండా తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రతిరోజు పర్యాటకులు ఉబ్బలమడుగుకు చేరుకుంటున్నారు.
PC: McKay Savage

10. ఆదివారం రోజు పర్యాటకుల సందడి

ఎండ వేడిమిగా ఎక్కువగా ఉండడంతో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన తలకోన, ఉబ్బలమడుగు, సదాశివకోన, కైలానకోనలు పర్యాటకులతో సందడిగా మారాయి. ఆదివారాలైతే మరింత మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నారు.
PC: McKay Savage

11. జలపాతం సవ్వడులు

అలా జలపాతానికి చేరువయ్యేకొలదీ మనకు తెలియకుండానే ఆ నీటి సవ్వడుల అనుభూతులను పొందుతాం. చుట్టూ పక్షుల కిలకిలరావాలు, ప్రశాంతమైన ప్రకృతి సోయగాల నడుమ కొండకోనలు దాటుకుంటూ వచ్చే జలపాతం దర్శనమిస్తుంది.

PC: McKay Savage

 

12. ఎన్నో రకాల పక్షులు

ఆ జలపాతం చిన్నగా ఉందని కంగారు పడకండి. అక్కడ ఎన్నో రకాల పక్షులు కనిపిస్తాయి. ప్రధానంగా పిచ్చుకలు. పిచ్చుకలా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఆ పిచ్చుకలు అంతరించిపోతున్నాయని మనకు తెలుసు. మనం ఆ పిచ్చుకల కిచకిచలు విని ఎన్నిరోజులు అయివుంటుందో కదా.
PC: McKay Savage

13. డైటింగ్‌ చేస్తున్న పిచ్చుకలు

పిచ్చుకలు బొద్దుగా భలే ముద్దొస్తాయి. అడవిలో పెరగడం వల్ల ఆహారం కొరత ఉండదని వీటిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇటీవల మన జనవాసాలలోనూ పిచ్చుకలు అక్కడక్కడా కనిపిస్తున్నా, అవి డైటింగ్‌ చేస్తున్న పిచ్చుకల్లా ఉంటాయి.
PC: McKay Savage

14. ప్రకృతి ఒడి

జలపాతం విషయానికి వస్తే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ తనివితీరా జలకాలాడొచ్చు. ఈ జలపాతాన్ని సందర్శించేవారికి ప్రకృతి ఒడిలో సేద దీరిన అనుభూతి కలుగుతుంది.
PC: McKay Savage

15. కొత్త అనుభూతి

దట్టమైన వృక్షాల మధ్య నుంచి ప్రవహించే స్వచ్ఛమైన నీరు పరవళ్ళు తొక్కుతూ కనిపించే ఆ సుందర దృశ్యం సందర్శకులను ఆకర్షిస్తుంది. అడవిలో తారసపడే ప్రకృతి అందాలు పర్యాటకుల మనస్సును కట్టిపడేస్తాయి. దట్టమైన అడవిని ఆనుకుని సహజమైన జలపాతం సవ్వడులు సందర్శకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
PC: Jagadeesh SJ

English summary

Ubbalamadugu or Tada Waterfalls In Andhra Pradesh

Ubbalamadugu Falls (also called Tada Falls) is a waterfall located to the North of Sricity in the Chittoor district of India. It is coming under the Buchinaidu kandriga & Varadaiahpalem mandals. The falls are located 92 kilometers (50 mi) from Chennai and 45 kilometers (22 mi) from Srikalahasti.
Please Wait while comments are loading...