Search
  • Follow NativePlanet
Share
» »ఉద్వాడ - పార్శీల కేంద్రం !

ఉద్వాడ - పార్శీల కేంద్రం !

By Mohammad

ఉద్వాడ, పార్సీ లేదా భారతీయ జొరాస్ట్రీయన్ లకు ఒక ముఖ్య కేంద్రం. ఉద్వాడ అనే 'ఒంటెలు తిరిగే మైదానం' అని అర్థం. జనావాసాలు లేని సమయంలో ఈ ప్రదేశంలో ఒంటెలు తిరిగేవి. క్రీ శ 10 వ శతాబ్దంలో ప్రస్తుత ఇరాన్ నుండి పర్షియన్లు లేదా పార్సీ లు వల్సాడ్ గుండా భారతదేశానికి వచ్చి ఈ ప్రదేశాన్ని, సమీపంలో సంజన్ రేవు ను స్థాపించారు.

ఇది కూడా చదవండి : వల్సాడ్ లోని అందమైన పర్యాటక ప్రదేశాలు !

అతాష్ బెహ్రమ్

ఉద్వాడ ప్రధాన ఆకర్షణ ఇరాన్ నుండి తీసుకొచ్చిన పవిత్ర అగ్ని. దీనినే అతాష్ బెహ్రమ్ అంటారు. వారి విశ్వాసం ప్రకారం ఇది వారికి పవిత్ర మైన అగ్ని. మహమ్మద్ బీన్ తుగ్లక్ దాడులకు భీతిల్లి పోయిన వీరు సంజన్ ను వీడినందుకు గుర్తుగా అతాష్ బెహ్రమ్ అనే కట్టడాన్ని స్థాపించారు.

అతాష్ బెహ్రమ్

అతాష్ బెహ్రమ్

చిత్ర కృప : gujarattourism

అతాష్ బెహ్రమ్ ప్రపంచములోని తొమ్మిది అతాష్ బెహ్రమ్ లలో ఒకటి. ఇందులో నిరంతరం మండుతున్న పురాతన ఆలయ అగ్ని ఉన్నది. దీనిని క్రీ . శ 1742 వ సంవత్సరంలో నిర్మించారు. తొమ్మిది అతాష్ బెహ్రమ్ లలో ఎనిమిది భారతదేశంలో ఉన్నాయి. మిగితా ఒక్కటి ఇరాన్ లో ఉన్నది. జొరాస్ట్రియన్ లు ఈ ఆలయాలను పవిత్ర స్థలాలుగా పరిగణిస్తారు.

జొరాస్ట్రియన్ వారసత్వ మ్యూజియం

ఉద్వాడ లో జొరాస్ట్రియన్ ల వారసత్వ మ్యూజియం కలదు. మ్యూజియంలో ఆసక్తికరమైన కళాఖండాలను, చారిత్రక వస్తువులను, శిల్పాలను ప్రదర్శిస్తారు. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతున్నది. సందర్శన సమయం ఉదయం 9: 30 నిమిషాల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరుస్తారు.

జొరాస్ట్రియన్ వారసత్వ మ్యూజియం

జొరాస్ట్రియన్ వారసత్వ మ్యూజియం

చిత్ర కృప : arZan sam wadia

ఉద్వాడ బీచ్

ఉద్వాడ బీచ్ పర్యాటకులకు చక్కటి విహార స్థలం. గరుకు నేలలు, గోధుమ రంగు ఇసుకతో బీచ్ ఎంతో అందంగా కనిపిస్తుంది. స్థానికులు సాయంత్రం వేళ బీచ్ వద్దకు వచ్చి సేదతీరి వెళుతుంటారు. మధ్య మధ్య లో పల్లీలు, బఠాణీలు తింటూ కాలక్షేపం చేస్తుంటారు. ఉద్వాడ లో ఇక్కడికి చేరుకోవటం సులభం. మత్స్య కారులు సముద్రంలో కి వెళ్లి చేపలు పట్టడం నిత్యం జరిగే కార్యక్రమం. అందువల్లనే ఏమో ఈ ప్రాంతాన్ని 'మత్స్యకారుల గ్రామం' అని పిలుస్తుంటారు. సముద్రం ఒడ్డున కూర్చొని సూర్యాస్తమ దృశ్యాలను గమనించవచ్చు

ఉద్వాడ బీచ్ వద్ద అద్భుత సూర్యాస్తమం

ఉద్వాడ బీచ్ వద్ద అద్భుత సూర్యాస్తమం

చిత్ర కృప : LuvMyK-X

ఉద్వాడ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

ఉద్వాడ కు సమీపాన 113 కిలోమీటర్ల దూరంలో సూరత్ విమానాశ్రయం కలదు. సూరత్ కు దేశం నలుమూల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లో ప్రయాణించి ఉద్వాడ చేరుకోవచ్చు.

రైలు మార్గం

ఉద్వాడ లో రైల్వే స్టేషన్ కలదు. ఇది ఊరి నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ముంబై, గుజరాత్ లోని ఇతర నగరాలతో సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. ముంబై నుండి సౌరాష్ట్ర ఎక్స్ ప్రెస్, ఫిరోజ్పూర్ జనతా ఎక్స్ ప్రెస్ మరియు గుజరాత్ ఎక్స్ ప్రెస్ లు ఎక్కి ఉద్వాడ చేరుకోవచ్చు.

ఉద్వాడ రైల్వే స్టేషన్

ఉద్వాడ రైల్వే స్టేషన్

చిత్ర కృప : Ankit Shah

బస్సు / రోడ్డు మార్గం

ముంబై నుండి మరియు అహ్మదాబాద్ నుండి ఉద్వాడ వరకు/మీదుగా ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు నడుస్తాయి. అలాగే రాష్ట్రంలోని మిగితా పట్టణాల నుండి, ప్రదేశాల నుండి కూడా ఉద్వాడ కు బస్సులు లభిస్తాయి. ముంబై నుండి 182 కిలోమీటర్ల దూరంలో, అహ్మదాబాద్ నుండి 264 కిలోమీటర్ల దూరంలో ఉద్వాడ కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X