అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

భారతదేశంలోని ఏడు వింతల రహస్యాలు మీకు తెలుసా ?

Written by: Venkatakarunasri
Updated: Friday, May 5, 2017, 14:38 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ప్రపంచంలో 7 వింతలు వున్నట్టుగానే ఇండియాలో కూడా 7 వండర్స్ వున్నాయి. మన ఇండియాలోని ప్రజలే టైమ్స్ ఆఫ్ ఇండియా 2007లో జూలై 21 నుండి జులై 31 వరకు ఇండియాలో 7 వండర్స్ ని సెలెక్ట్ చేయమని ఒక ఇరవై మానవనిర్మిత కట్టడాలు మరియు సహజసిద్ధంగా ఏర్పడిన కట్టడాలని ఒక లిస్ట్ క్రింద రెడీ చేసి ఆ 20 లిస్ట్ నే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ చేసింది.

ఈ 20 లిస్ట్ లో ఇండియాలోని పురాతనకట్టడాలతో పాటు మధ్యయుగాకాలం నాటి వండర్స్ కూడా వున్నాయి. ఈ విధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ 20 ప్రదేశాల లిస్ట్ పైన పోలింగ్ పెట్టినప్పుడు అందులో ద బెస్ట్ సెవెన్ గా కొన్ని నిలుచున్నాయి. వాటిలో ఏకశిలా విగ్రహం నుంచి ఒక సమాధి మరియు ఒక యూనివర్శిటీ కూడా వున్నాయి.

Latest: పూరి జగన్నాధ స్వామి ఆలయంలోని మిస్టరీలు ఏంటో మీకు తెలుసా ?

యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండలు !

 

కాకపోతే ఈ ఏడింట్లో రెండు తప్ప మిగతావన్నీ చిన్నచిన్న విలేజస్ లో వున్నాయి. 2007 లో సెలెక్ట్ చేయబడిన ఆ సెవెన్ వండర్స్ ఏమిటో ఒకసారి చూద్దామా !

రాత్రిపూట ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడుతుంది !

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. శ్రావణ బెలగోళ లేదా గోమఠేశ్వర విగ్రహం

శ్రావణ బెలగోళ అని పిలవబడే ఈ ప్రదేశం కర్ణాటకలోని హసన్ జిల్లాలో వుంది. ఈ గోమఠేశ్వర విగ్రహాన్నే జైన సన్యాసి అయిన బాహుబలి పేరుతో కూడా పిలుస్తారు. ఈ విగ్రహం క్రింది నుండి మీది వరకు మొత్తం ఒకే ఒక శిలతో అంటే ఏకశిలతో విగ్రహాన్ని తయారుచేసారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ లో అంతుచిక్కని 'బాహుబలి విగ్రహం' రహస్యం !

PC: Abhishek Jain

 

2. శ్రావణ బెలగోళ లేదా గోమఠేశ్వర విగ్రహం

గంగారాజైన రాచమల్లకు మంత్రి అయిన చాముండరాయ క్రీ.శ. 983 ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగోళ పట్టణం దగ్గరలో గల చంద్రగిరి కొండపైన ఈ విగ్రహాన్ని కట్టారు. ఈ కొండపైనున్న విగ్రహం దగ్గరకు వెళ్ళాలంటే సుమారుగా 620 మెట్లను ఎక్కాలి.

జైన మందిరాలు - జీవన విధాన ప్రతి బింబాలు!

PC:Dinesh Vijayakumar

3. శ్రావణ బెలగోళ లేదా గోమఠేశ్వర విగ్రహం

ఒక తెల్లటి గ్రానైట్ రాయి పైన ఈ విగ్రహాన్ని తయారుచేసారు. ఒక గొప్ప మతసంబంధమైన సంకేతంగాను ఈ విగ్రహం గుర్తింపు సాధించింది. జైన మతంలో మొట్ట మొదటగా పుట్టుక మరియు మరణం అనే చక్ర బంధం నుండి విముక్తి పొందిన వాడుగా బాహుబలిని జైనులు విశ్వసిస్తారు.

సకలేశ్ పూర్ కు వారాన్తపు విహారం!!

PC:Nithin bolar k

4. శ్రావణ బెలగోళ లేదా గోమఠేశ్వర విగ్రహం

ఈ విగ్రహం ఒక తామర పుష్పంపై నిలిచి వుంటుంది. ఈ విగ్రహానికి తొడల దగ్గర నుంచి పై భాగం వరకు ఎటువంటి ఆధారం లేకుండా చక్కగా విగ్రహాన్ని ఆ రోజుల్లో రూపొందించారు. ఏది 60 అడుగుల పొడవుతో వుంటుంది.

PC:Dineshkannambadi

5. శ్రావణ బెలగోళ లేదా గోమఠేశ్వర విగ్రహం

చంద్రగిరి కోట నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతం ఒక అందమైన దృశ్యంగా కనిపిస్తుంది. ప్రతి 12 సం.ల కొకసారి వేలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకొని మహా మస్తకాభిషేకం నిర్వహిస్తారు.

PC:Anks.manuja

 

6. హరమందిర్ సాహెబ్

భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు !అదే గోల్డెన్ టెంపుల్. స్వర్ణ దేవాలయం. ఇది పంజాబ్ లోని అమృత్ సర్ నగరంలో వుంది. ఇది సంస్కృతిపరంగా సిక్కులకు అత్యంత పుణ్యక్షేత్రంగా వుండటంతో పాటు పురాతనమైన సిక్కు గురుద్వర్ గా వుంటుంది.

భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు !

PC:Asajaysharma13

 

7. అమృతసరోవర్

సిక్కుల నాల్గవ గురువైన గురురాందాస్ ద్వారా ఇది ప్రారంభించబడింది. గురురాం దాస్ క్రీ.శ. 1577లో ఒక చెరువును త్రవ్వించాడు. కాలగమనంలో ఆ చెరువు అమృతసర్ లేదా అమృతసరోవర్ గా పేరు సంపాదించింది.

అమృతసర్ స్వర్ణ దేవాలయ దర్శనం !

PC:Shashwat Nagpal

 

8. ప్రార్ధనలు

ఇక్కడ ప్రార్ధనలు నిర్వహించటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. గోల్డెన్ టెంపుల్ లో వుండే గోడలన్నీ వీటిని వెండి మరియు బంగారంతో పొదగటం జరిగింది.

అమ్రిత్సర్ స్వర్ణ దేవాలయం - ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ !

PC:Giridhar Appaji Nag Y

9. తాజ్ మహల్

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వుంది. తాజ్ మహల్ మొఘల్ సామ్రాజ్య నిర్మాణానికి చెందిన ఒక ఉత్కృష్ట నిర్మాణం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాణి ముంతాజ్ కు స్మృతి చిహ్నంగా దీనిని నిర్మించాడు.

తాజ్ మహల్ గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా?

PC:Sumit Sarswat

10. ఇస్లామిక్

ఇస్లామిక్ లాంటి చిత్రకళలతో దీనిని నిర్మిచాడు. 1983 లోన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తాజ్ మహల్ ఎంపికకావటంతో పాటు భారతదేశంలోని ముస్లిం కళకు సంబంధించిన ఆభరణం గాను మరియు విశ్వవ్యాప్తంగా మెచ్చుకోబడిన ప్రపంచ వారసత్వ సంపదలలో భాగమైన అద్భుత కళాఖండంగాను దీన్ని చెప్తారు.

అందాల తాజ్ ...అన్నీ చిత్రాలే !

PC:Yakuza ravi

 

11. తెల్లటి పాలరాయి

ఈ తాజ్ మహల్ ని 1648 ప్రాంతంలో పూర్తిగా నిర్మించారు. తాజ్ మహల్ కి సంబంధించి ప్రధాన ఆకర్షణ అంతా తెల్లటి పాలరాయితో నిర్మించిన సమాధిలోనే దాగివుంది. ప్రధాన గదిలోని ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ శవపేటికలు నిజమయినవి కాదు. వారి నిజమయిన సమాధులు అంతకంటే దిగువున వున్నాయి.

తాజ్ మహల్ గురించి ఆశ్చర్యపరిచే నిజాలు !!

PC:Yakuza ravi

 

12. లోపలి భాగం

వెలుపలి భాగంలో అలంకారానికి ఉపయోగించిన తెల్లపాల రాయిని మాత్రం రాజస్థాన్ నుంచి తెప్పించారు. లోపలి భాగంలో పోదిగేందుకు ఉపయోగించిన రాళ్ళను భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో సహా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించారు.

ఇండియాలోని 8 అద్భుత హనీ మూన్ ప్రదేశాలు !

PC:Bhaskaranaidu

 

13. హంపి

ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామంలో వుంది. ప్రాచీన భారతదేశ వాస్తు కళకు సంబంధించిన దాదాపు ప్రతి వైభవం ఇక్కడ 14 వ శతాబ్దపు శిథిలాలలో భద్రంగా వుంది. కోటలు, దేవాలయాలు, విపణి కేంద్రాలు, నిఘా స్తూపాలు, గుర్రపు శాలలు, స్నానఘట్టాలు మరియు ఏకరాతి శిల్పాలు వంటి ఇక్కడ పెద్ద పరిమాణంలో వున్నాయి.

రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు !

14. హంపి నగరం

ఇవన్నీ కలిపి ఇది ఆ కాలంలో ఎంత ప్రతిష్ట జేస్తుందో తెలుస్తూనే వుంది. అందుకే హంపి శిధిలాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా వర్ధిల్లుతున్నాయి. విజయనగర వాస్తు కళను కళ్ళముందుంచే ఈ శిథిలాలు చాళుక్య, హోయసల, చోళ సామ్రాజ్యాల రూపంలో సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హంపి నగరం విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని.

హంపి బడవ శివలింగం - ప్రపంచంలో అతి పెద్ద శివలింగాలలో ఒకటి !

15. ప్రతీకలు

ఇక్కడ మీకిప్పటికీ కళ్యాణమండపం, రాజగోపురం, వసంతమండపం వంటివి ఆనాటి శిల్ప కళా వైభవానికి ప్రతీకలుగా నిలుస్తూనే వున్నాయి.

రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు !

16. కోణార్క్ టెంపుల్

ఇది ఒడిశాలోని ఒక చిన్న పట్టణంలో వుంది. నల్ల గ్రానైట్ తో నిర్మింపబడిన ఈ కోణార్క్ దేవాలయాన్ని నల్ల గోపురం అని కూడా అంటారు. తూర్పు గంగారాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవ దీనిని నిర్మించాడు. ఈ ఆలయం కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షించబడుతుంది.

తాజ్ మహల్ ను పోలిన 6 కట్టడాలు !

17. సూర్యకిరణాలు

ఈ ఆలయం మొత్తం రథం ఆకారంలో వుంటుంది. 25 చక్రాలు, 7 గుర్రాలతో రథాన్ని లాగుతున్నట్లు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కొక్క చక్రం 3.3 మీ వ్యాసంతో వుంటుంది. కేవలం సూర్యభగవానుని కోసం నిర్మితమైన ఈ గుడి సూర్యభాగవానునికే అంకితం చేయబడినది. ప్రతిరోజూ సూర్యకిరణాలు ఈ ఆలయ ముఖ ద్వారాన్ని తాకుతూనే వుంటాయి.

కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ !

కోణార్క్ సూర్యదేవాలయం - అద్భుతాలకు నిలయం !!

18. నలంద

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం. ఇది బీహార్లోని పాట్నాలో వుంది. క్రీ.శ.427 నుంచి క్రీ.శ. 1197 వరకు పాక్షికంగా హాల సామ్రాజ్యం ఆధిపత్యంగా బౌద్ధకేంద్రంగా వర్ధిల్లింది. లిబ్బి రూపచరిత్రలో పేర్కొనబడిన గొప్ప విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఇది పిలవబడుతోంది.

భారత దేశ పర్యటన - పది ప్రదేశాలు !

నలందా - జ్ఞానాన్ని ఇచ్చే భూమి !!

19.వసతి సౌకర్యాలు

విద్యార్ధుల కోసం ఇక్కడ సత్రాలున్నాయి. ఇవి 1000కి పైగా విద్యార్ధులకు మరియు 2000 లకు పైగా అధ్యాపకులకు వసతి సౌకర్యాలు కల్పించగలవు. ఒక అత్యుత్తమ గోడ మరియు ద్వారంతో వుండే ఈ విశ్వవిద్యాలయం వాస్తు కళకు ఒక మచ్చు తునకగా భావించబడుతుంది.

నలంద - లెర్నింగ్ భూమి!!

20. ఖజురహో

ఇది మధ్యప్రదేశ్ లో ఒక వూర్లో వుంది. ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో. ఆగ్రా - ఖజురహో 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇండో- ఆర్యన్ శిల్పకళకు అద్దం పట్టే ఎన్నో కళాఖండాలను, శిల్పాలను మనము ఇక్కడే చూస్తాం.

ఖజురాహో డాన్స్ ఫెస్టివల్ ... డాన్స్ ...డాన్స్ ...డాన్స్ !

21. ప్రపంచం

దేవాలయ శిల్పకళకు, అపూర్వ కళాఖండాలకు ప్రపంచంలోనే గొప్ప ప్రదేశం ఖజురహో. ఈ దేవాలయాల సమూహాన్ని నిర్మించటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కాలానికే వదిలేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే .. ఉత్తర భారతాన్ని అతితక్కువ కాలం పాటు పాలించిన రాజవంశీయులలో ఒకరైన చండేలా రాజులు ... ఇంతటి అద్భుతమైన కళాఖండాలను ఎలా చెక్కారో అని !!

శృంగారతత్వాన్ని చాటి చెప్పే ఖజురహో శిల్పాలు !

22. శిల్పాలు

చండేలా రాజుల కాలంలో అనగా క్రీ.శ. 9 - 11 వ శతాబ్దంలో 85 ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం 25 దేవాలయాలే ఉండటం చరిత్రకారులకు, పర్యాటకులకు ఒకింత విస్మయానికి గురిచేసే అంశం. ఖజురహో దేవాలయాల మీద చెక్కిన శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథంలోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి.

ఖజురాహో దేవాలయాలు - ప్రేమకు ప్రతీకలు !

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

English summary

Unknown 7 Wonders of India !

The Times of India newspaper carried out a SMS poll, from 21 July to 31 July 2007, to vote for the seven greatest wonders of India, out of a list of 20 identified ancient or medieval sites for the purpose.
Please Wait while comments are loading...