అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

భైరవకోన గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు !

Written by: Venkata Karunasri Nalluru
Updated: Wednesday, April 12, 2017, 18:04 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

మైదుకూరు పట్టణానికి 30 కి.మీ. దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో భైరవకోన వుంది. ఈ ప్రాంతాన్ని భైరేణి లేదా భైరవకోన అంటారు. శివరాత్రికి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి.

ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు. ఆ శివాలయం చిన్నదైనా, పెద్దదైనా అక్కడికి వెళ్లిరావటానికి భక్తులు పరవశించిపోతుంటారు. అలాంటి శివాలయాలలో ఒకటి భైరవకోనలో కలదు. శివాలయమే కాదు, పార్వతీదేవి ఆలయం, దేవీదేవతల శిలారూపాలు, గ్రానైట్ శిలలతో చెక్కబడ్డ శివలింగాలు, ఆకాశగంగ ను తలపించేలా జలపాతం, చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి ఇవన్నీ కూడా యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

భైరేణి లేదా భైరవకోన

1. భైరవకోన చరిత్ర

పూర్వం అహోబిలం దగ్గర నల్లమల కొండలలో ప్రవహించే భవనాశి నది ఉప్పొంగడం ప్రారంభించింది. దీనితో అహోబిల నరసింహస్వామి ఈ ప్రళయాన్ని ఆపమని భైరవాన్ని కోరాడు. వెంటనే అసితాంగ భైరవుడు భవనాశి నదికి తన తలను నరికి నదిలో తర్పణం చేయటంతో ముప్పు తప్పింది. అసితాంగ భైరవుడు నరసింహస్వామి ఆజ్ఞను పాటించి మల్లేశ్వరి సమేతంగా భైరవకోనలో శిలారూపంలో వెలిశాడు. అప్పటి నుండి భక్తులు మొండి భైరవుడిగా పిలుస్తున్నారు.

PC: Ck984923

2. భైరవకోన ఎక్కడ వుంది

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలో, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో భైరవకోన వుంది. కొత్తపల్లి గ్రామం నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భైరవకోన క్షేత్రం కలదు.
PC:youtube

3. శివాలయం

భైరవకోనలో క్రీ.శ. 9 వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ శివాలయం కలదు. ఈ శివాలయాన్ని పల్లవరాజులు అద్భుతంగా నిర్మించారు. కొండల్ని గుహాలయాలుగా మార్చటం అలనాటి కాలంలో ఒక గొప్ప కళ. ఈ గుహల గోడలపై అనేక పల్లవుల కాలం నాటి శిల్పకళలను చూడవచ్చును.
PC:youtube

4. స్థల పురాణం

కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు. ప్రహ్లాదుడు చనిపోయాక ఈ గుడిని పట్టించుకొనే నాధుడు లేక పొట్టకూటి కోసం భైరవుడు దారిదోపిడీలకు పాల్పడేవాడు. అందుకు ఆగ్రహించిన నృసింహస్వామి రాక్షసుడు అవ్వమని, తనకంటికి కనిపించకుండా భక్తులు తెచ్చినది ఏదైనా తన ప్రసాదంగా స్వీకరించమని, కలియుగానంతరం మరలా తనను సేవించవచ్చని చెబుతాడు. నాటి నుండి నేటివరకు భైరవుడు భైరవకోనలో పూజలు అందుకుంటున్నాడు.
PC:Dubbala Divya

5. ఇక్కడ చూడగల ఎనిమిది శివాలయాలు

నల్లమల అభయారణ్యంలో ఎక్కడ చూసిన దేవీదేవతలు శిల్పాలే దర్శనమిస్తుంటాయి. ఓ కొండ రాతిని తొలిచి అందులో ఎనిమిది శివాలయాలను చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. వీటన్నింటినీ ఒకేసారి దర్శించుకోవచ్చు.
PC: c

6. ఒకేచోట ముగ్గురుమూర్తులు

ఎనిమిది గుహలలో ఒకటి ఉత్తరముఖంగా (మొదటిది), మిగిలిన ఏడు గుహలు తూర్పుముఖంగా ఉంటాయి.
PC: youtube

7. మొదటిగుహ

తలపాగా ధరించిన ద్వారపాలకులు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. ఉత్తరముఖంగా ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది.
PC: youtube

8. రెండవ గుహ నుండి ఏడవ గుహ వరకు

రెండవ గుహ నుండి ఏడవ గుహ వరకు ఆలయాలన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. గర్భగుడి అన్నింటిలో గ్రానైట్ తో చెక్కబడిన శివలింగాలను ప్రతిష్టించారు.
PC: youtube

9. భైరవకోన క్షేత్రంలో అమ్మవారి గుడి

ఇక్కడ అమ్మవారి గుడిని క్రొత్తగా నిర్మించారు. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహం మాత్రం పురాతనమైనది. ఈ గుడి అడవిలో ఉన్నందున ప్రతిరోజూ కాకుండా, శుక్రవారం అర్చిస్తారు. పండుగలు, పర్వదినాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు.
PC: youtube

10. జలపాతం

నింగిని తాకేలా వృక్షాలు, పక్షులకిలకిలారావాలు, ఆహ్లాదభరితవాతావరణం తప్పక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. భైరవకోన లో కొండల మధ్య నుంచి దూకే జలపాతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ జలపాతం కింద పిల్లలు, పెద్దలు తడుస్తూ ఆనందించవచ్చు.
PC: YVSREDDY

11. పొలి

భక్తులు ప్రతి గురువారం, ఆదివారం వేసవికాలంలో భైరవకోనకు వెళ్తూ వుంటారు. ఈ ఆలయంలోని కొండమట్టిని "పొలి"అంటారు. ఈ ఆలయానికి సమీపంలోని కొండమట్టిని భక్తులు తీసుకువచ్చి పొలాలకు చల్లుకుంటారు.
PC: SDATTAREDDY

12. పౌర్ణమి అందాలు

ప్రతి సంవత్సరం కార్తీకపౌర్ణమి రోజున చంద్రబింబం, అక్కడి ఆలయాలనికి మూడు అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి, దుర్గాదేవి విగ్రహం పై పడుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆ రోజున అధికంగా తరలివస్తుంటారు.
PC: Santoshtherock

13. ఆలయ నిర్మాణం

ఆలయాల్లో గర్భగుడి, వరండాలు, స్తంభాలు అన్నీ కూడా కొండ రాయితోనే మలచడం విశేషం. శివలింగాలను మాత్రేమే గ్రానైట్ రాయితో చెక్కి ప్రతిష్టించారు.
PC: Svrohith9

14. వాతావరణం

ఈ నల్లమల అడవులలో సంవత్సరం పొడుగునా వెచ్చని మరియు వేడిమి వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం 90 సె.మీ. నైఋతీ-ఋతుపవనాలపై ఆధారపడిన అడవులు. శీతాకాలంలో చల్లగానూ పొడిగాను, సరాసరి ఉష్ణోగ్రత 25 సె.గ్రే.ను కలిగి ఉన్నాయి.
PC: Dubbala Divya

15. ఎలా వెళ్ళాలి

ప్రకాశం నుండి ప్రతిరోజూ నిర్దిష్ట సమయంలో 'భైరవకోన' కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. ప్రకాశం నుండి భైరవకోన కోన 70 కిలోమీటర్ల దూరంలో కలదు. కొత్తపల్లి, అంబవరం గ్రామాల నుండి కూడా భైరవకోనకు ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ జీపులు, ఆటోలు దొరుకుతాయి.
PC: google maps

English summary

Unknown Secrets of the BhairavaKona

Bhairavakona is a very beautiful place in Andhra Pradesh. It is famous for 8 cave temples constructed in 9 th century by Pallavas.
Please Wait while comments are loading...