అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

Written by: Venkata Karunasri Nalluru
Updated: Wednesday, June 7, 2017, 15:26 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఈ గ్రామంలో 75 ఇళ్లుంటే 45 మంది IAS !

తెలంగాణ ఖజురహో ఎక్కడ వుందో మీకు తెలుసా?

గొలగమూడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రము. ఇది నెల్లూరు నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవము. ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివశించి మహాసమాధి చెందారు. ఆయనను వెంకయ్య స్వామి అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి. ఈ గ్రామములో శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం ఉన్నది.

ఇది కూడా చదవండి: నెల్లూరు ...దేవాలయాలు, ప్రకృతి దృశ్యాలు !

పుణ్యక్షేత్రము గొలగమూడి

1. వెంకయ్యస్వామి ఆలయం

వెంకయ్య ఆలయం చుట్టూ విశాలమైన ప్రాకారం నిర్మించారు. ప్రాకారం యొక్క ముఖద్వారం వద్ద నిల్చొని చూసినచో గర్భగుడిలోని వెంకయ్య స్వామి విగ్రహం స్పష్టంగా కన్పించును. గర్భగుడి పైన గోపురనిర్మాణమున్నది.

చిత్రకృప: official website

2. గర్భగుడి

గర్భగుడి చుట్టు స్ధంబాలమీద స్లాబు కట్టారు. ముఖద్వారానికి ఎడమపక్కన ధుని (అగ్ని గుండం) ఉంది. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ధునిలో ఎండుకొబ్బరికాయ, నవధాన్యాలు, ధూపద్రవ్యాలు 3 లేదా 6 లేదా 9 సార్లు ధుని చుట్టు ప్రదక్షిణచేసి ఇందులో వేయుదురు. ఆ తరువాత భక్తులు క్యూలో వెళ్లి వెంకయ్య దర్సనం చేసుకుంటారు.

చిత్రకృప: official website

3. పాలరాతి విగ్రహం

గర్భగుడిలోని వెంకయ్యస్వామి విగ్రహాన్ని పాలరాతితో చేసారు. గర్భగుడికి గోడకు వెంకయ్యగారి రెండు చిత్ర పటాలను వెలాడతీసారు. తంబురా మీటుతున్నట్లుగా చిత్రపటాలున్నాయి. గర్భగుడి ద్వారానికి ఎదురుగా జ్యోతి వెలుగుతుంటుంది. జ్యోతి పక్కన వెండి పాదుక ఉంది. భక్తులు జ్యోతికి నమస్కరించి, పాదుకను తాకి, వెంకయ్యగారి దర్శనం చేసుకొని నమస్కరిస్తారు.

చిత్రకృప: official website

4. ప్రసాదం

పుజారి తీర్థం ఇచ్చిన తరువాత, వుడికించిన శనగలను ప్రసాదంగా యిస్తారు. వెంకయ్య స్వామి స్వామిని దర్శించుకున్న భక్తులు తమకోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు.

చిత్రకృప: official website

5. భక్తులు

మరుసటిరోజు స్వామి దర్శనం చేసుకుని తిరుగు ముఖం పడతారు. అలాగే అంతకు ముందు స్వామి వారిని దర్శనం వలన కోరికలు తీరినవారుకూడ మళ్ళీ వచ్చి యిక్కడ రాత్రి నిదురచేస్తారు. భక్తులు రాత్రి వసించుటకై బయలు ప్రదేశం ఉంది. భక్తులు శయనించుటకై చాపలు యిచ్చట అద్దెకు లభించును.

చిత్రకృప: official website

6. శనివారం

శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని రాత్రి యిచ్చటనే గడిపి వెళ్ళెదరు.

ఒకే కొండ మీద 1000కి పైగా దేవాలయాలు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ?

చిత్రకృప: official website

7. సర్వ దర్శనం

సర్వ దర్శనం : ఉదయం: 6:30 నుండి 11:00 వరకు
మధ్యాహ్నం: 12:00 నుండి 2:00 వరకు
సాయంకాలం: 4:00 నుండి 6:30 వరకు
రాత్రి: 7:30 నుండి 8:30 వరకు స్వామి వారిని దర్శించవచ్చు.

ఇది కూడా చదవండి: మహా మహిమాన్విత శక్తి పీఠము జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంలోని రహస్యాలు !

చిత్రకృప: official website

8. సేవలు

ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు.

ఆరాధనోత్సవాలు : ప్రతి ఏడాది ఆగస్టు 18 - 24 వరకు ఆరాధనోత్సవాలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

నిజంగానే ఎల్లోరా గుహలు ఎలియన్స్ చేత నిర్మింపబడిందా? షాకింగ్ నిజాలు !

చిత్రకృప:YVSREDDY

9. ప్రసాదము

లడ్డు (100 గ్రా., 150 గ్రా.) - రూ. 10/-, రూ. 15/- మరియు పులిహోర - రూ. 3/-, తలనీలాల టికెట్టు - రూ. 5 రూపాయలు

ఇది కూడా చదవండి: మతసామరస్యానికి ప్రతీక .. రొట్టెల పండగ !

చిత్రకృప: official website

10. ధర్మదాన కార్యక్రమాలు

దేవస్థానం వారు నిత్యాన్నదానం, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి విద్యాలయము, భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆలయం, హాస్టల్, గోశాల, వృద్ధాశ్రమం నడుపుచున్నది.

ఇది కూడా చదవండి: నెల్లూరులో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !

చిత్రకృప : Palagiri

11. ఆశ్రయం సమీపంలో సందర్శనీయ ప్రదేశాలు

సుబ్రమణ్యస్వామి పుట్ట, వీరాంజనేయస్వామి మందిరం, స్వామివారి కోనేరు, నవగ్రహ మందిరం, స్వామివారి కుటీరం, రామాలయం చూడదగ్గవి.

ఇది కూడా చదవండి: ప్రకృతిలో మమేకమైన చిత్తూర్ సోయగాలు !!

చిత్రకృప: official website

12. వసతి సౌకర్యాలు

ఆశ్రమం వద్ద వసతి గొలగమూడిలో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ, నాన్ -ఏసీ గదులు, సూట్ రూములు అద్దెకు దొరుకుతాయి. ముందస్తు బుకింగ్ సాదుపాయమూ కలదు. నాన్ ఏసీ అద్దె - రూ. 100/-, రూ. 150/-, ఏసీ అద్దె - రూ. 400/-, సూట్ రూమ్ అద్దె - రూ.600/-

ఇది కూడా చదవండి: నేలపట్టు పక్షి అభయారణ్యం, నెల్లూరు !!

13. వెంకయ్యస్వామి ఆలయానికి ఎలా చేరుకోవచ్చు

వెంకటాచలం రైల్వే స్టేషన్ గొలగమూడికి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి ప్రభుత్వ బస్సులలో లేదా ఆటోలలో లేదా టాక్సీలలో ఎక్కి గొలగమూడికి చేరుకోవచ్చు (లేదా) నెల్లూరు చేరుకొని అక్కడి నుంచి బస్సుల్లో ఎక్కి గొలగమూడి వెళ్ళవచ్చు. నెల్లూరు నుండి గొలగమూడికి ప్రతి అరగంటకు బస్సులు కలవు.

ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్ బీచ్ లు ... వారంతపు విహారాలు!!

చిత్రకృప:Palagiri

English summary

Unkown Facts About Sri Venkaiah Swamy

Sri Venkaiah Swamy was born to Smt Sompalli pitchamma and Sri Penchalaiah as their eldest son at Nagulavellatur, a village in Nellore district.
Please Wait while comments are loading...