అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

మీరెప్పుడైనా ఇక్కడ స్టే చేశారా ?

Written by: Venkatakarunasri
Published: Monday, July 17, 2017, 10:41 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ప్రయాణాలు చేసేముందు పర్యాటకులు ముందుజాగ్రత్త చర్యగా హోటళ్ళను ఆన్లైన్ లో గానీ లేదా ఫోన్ చేసిగానీ బుక్ చేసుకుంటారు.
కొన్నికొన్ని సార్లు మనకు ఆ హోటల్ గదులు అక్కడికి వెళ్ళినతర్వాతగానీ తెలీదు డిసప్పాయింట్ చేస్తాయని.
అలా ఉండకూడదనే మీ నేటివ్ ప్లానెట్ కొన్ని పర్యాటక ప్రదేశాలలో బస చేయటానికి అనుకూలమైన వసతి సదుపాయాల సమాచారాన్ని అందిస్తున్నది.

ప్రయాణాలు చేసేముందు పర్యాటకులు ముందుజాగ్రత్త చర్యగా హోటళ్ళను ఆన్లైన్ లో గానీ లేదా ఫోన్ చేసిగానీ బుక్ చేసుకుంటారు. కొన్నికొన్ని సార్లు మనకు ఆ హోటల్ గదులు అక్కడికి వెళ్ళినతర్వాతగానీ తెలీదు డిసప్పాయింట్ చేస్తాయని. అలా ఉండకూడదనే మీ నేటివ్ ప్లానెట్ కొన్ని పర్యాటక ప్రదేశాలలో బస చేయటానికి అనుకూలమైన వసతి సదుపాయాల సమాచారాన్ని అందిస్తున్నది. హోటళ్ళు ప్రయాణాలు చేసేవారికి విడిదిగా, రిఫ్రెష్ రూములుగా ఉపయోగపడుతుంటాయి. ఒకవేళ మీరు గనక ఆ ప్రదేశాలలో ఉన్నట్లయితే ఇక్కడ బస చేయవచ్చు.

1. శామ్-ఈ -సార్హద్ విలేజ్ రిసార్ట్, హోత్క

శామ్-ఈ -సార్హద్ విలేజ్ రిసార్ట్, గుజరాత్ రాష్ట్రంలోని హోత్క గ్రామంలో ఉన్నది. ఇక్కడ స్టే చేస్తే, గుజరాత్ గ్రామీణ వాతావరణాన్ని అనుభవించవచ్చు.

చిత్రకృప : hodka

 

2. శామ్-ఈ -సార్హద్ విలేజ్ రిసార్ట్, హోత్క

ప్రాజెక్టు లో భాగంగా రిసార్ట్ వివిధరకాల వసతులను అందిస్తున్నది. వాటిలో ఎకో ఫ్రెండ్లీ టెంట్స్, ఫ్యామిలీ కాటేజీలు, సూట్ భున్గాస్ లు కొన్ని. భున్గాస్ అనేవి అక్కడి బన్ని ప్రాంతంలో ఉండే గుడిసెలను పోలి ఉంటాయి.

ప్రారంభం - అక్టోబర్ - మర్చి

రాత్రి ఖర్చు : రూ. 3400 రూపాయల నుండి ప్రారంభం

వెబ్సైటు : http://www.hodka.in/

చిత్రకృప : AnjanaChandan

3. హౌస్ బోట్, కేరళ

కేరళ అంటే గుర్తొచ్చేది హౌస్ బోట్స్. హౌస్ బోట్ ల వసతి అన్ని వర్గాల పర్యాటకులను ఆకర్షిస్తుంది. బ్యాక్ వాటర్స్ అలల మీద పడవలో షికారు గుర్తుండిపోయే పర్యటన.

చిత్రకృప : Utpal Nath

 

4. హౌస్ బోట్, కేరళ

పడవలో ప్రయాణిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు గమనించవచ్చు.

రాత్రి ఖర్చు - రూ. 6000 - 7000 రూపాయల నుండి ప్రారంభం

చిత్రకృప :Shameer Thajudeen

 

 

5. జోస్టల్, జైసల్మీర్

జోస్టల్ హోటల్, జైసల్మీర్ లోని గాడిసర్ సరస్సు ఒడ్డున కలదు. ఇక్కడికి ప్రపంచ దేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు.

చిత్రకృప : zostel

 

6. జోస్టల్, జైసల్మీర్

ఎడారి నగరం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ పరిఢవిల్లుతాయి.

రాత్రి ఖర్చు : రూ. 1200 రూపాయల నుండి ప్రారంభం

వెబ్సైటు : http://www.zostel.com/

చిత్రకృప :user:Flicka

 

7. గుహంతర కేవ్ రిసార్ట్, బెంగళూరు

బెంగళూరు లోని గుహంతర కేవ్ రిసార్ట్, భారతదేశంలోని మొట్టమొదటి కేవ్ రిసార్ట్. ఈ రిసార్ట్ ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఉత్తమ సేవలను కల్పిస్తున్నది.

చిత్రకృప : guhantara

 

8. గుహంతర కేవ్ రిసార్ట్, బెంగళూరు

బార్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, హెర్బల్ గార్డెన్, స్పా మరియు ఫన్ గేమ్స్ తో పాటు అడ్వెంచర్ క్రీడలు మొదలుగునవి రిసార్ట్ వారు అందిస్తున్నారు.

చిత్రకృప :wikimedia.org

 

9. ట్రీ హౌస్ రిసార్ట్, జైపూర్

నేచర్ మీద ఆసక్తిగలవారు జైపూర్ లోని ట్రీ హోసూరు రిసార్ట్ లో ఉండవచ్చు. ఇక్కడ వసతులు ఫైవ్ స్టార్ హోటల్ కు తగ్గకుండా ఉంటాయి.

చిత్రకృప : guhantara

 

10. ట్రీ హౌస్ రిసార్ట్, జైపూర్

బార్ మరియు పబ్, బిజినెస్ సెంటర్, కాఫీ షాప్, జిమ్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్ తో పాటు ఫన్, అడ్వెంచర్ ఆటలు వంటి ఇతర వసతులు కూడా రిసార్ట్ అందిస్తున్నది.

చిత్రకృప :treehouseresort

 

11. హేమిస్ మొనాస్టరీ, లడఖ్

హేమిస్ మొనాస్టరీ జమ్మూ రాష్ట్రంలోని లడఖ్ లో కలదు. ఇది టిబెట్ బుద్దులు నివశిస్తారు. మన హిందువులకు వేద పాఠశాలలు ఎలాగో బుద్ధులకు ఈ మొనాస్టరీ లు అలాగన్నమాట. టిబెట్ నిర్మాణశైలిలో నిర్మించబడిన ఈ మొనాస్టరీలో బౌద్ధ సన్యాసుల సంస్కృతి, వారి జీవన విధానాలు తారసపడతాయి. మొనాస్టరీ మతపెద్దల అనుమతితో హేమిస్ మొనాస్టరీ లో స్టే చేయవచ్చు.

చిత్రకృప : hamon jp

 

రూట్ ఇన్స్టిట్యూట్, బోధ

గయ బోధ గయ ను సందర్శించే పర్యాటకులు రూట్ ఇన్స్టిట్యూట్ లో స్టే చేయవచ్చు. యోగా, మెడిటేషన్ వంటి రోజువారీ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తుంటారు. కాంక్రీట్ గోడల మధ్య బస చెయ్యటం కంటే ఇలా ఒకరోజు ఇటువంటి ప్రాంతాలలో స్టే చేస్తే మీ బాధలు, రుగ్మతలను మరిచిపోతారు. తగిన విశ్రాంతిని పొందవచ్చు.

రాత్రి ఖర్చు : రూ. 250 రూపాయల నుండి ప్రారంభం

రాత్రి ఖర్చు : రూ. 250 రూపాయల నుండి ప్రారంభం

వెబ్సైటు : http://www.rootinstitute.ngo/

భారతదేశంలో పైన పేర్కొన్నవి కొన్ని మాత్రమే. ఇటువంటివి మన దేశంలో చాలానే ఉన్నాయి. కనుక, పర్యాటకులు ఆ ప్రదేశాలలో సందర్శించేటప్పుడు పైన సూచించిన హోటళ్ళలో స్టే చేయండి. హ్యాపీ జర్నీ... !!

చిత్రకృప : Ineb-2553

 

English summary

Unusual Places You Can stay While Travelling

Here are some unique and unusual places and you can stay while travelling across India.
Please Wait while comments are loading...