Search
  • Follow NativePlanet
Share
» »సరస్వతిదేవి కొరకు అసాధారణ ఆలయం

సరస్వతిదేవి కొరకు అసాధారణ ఆలయం

కుతుబ్ షాహీ, మొఘలుల మరియు నిజాముల పాలనలో హైదరాబాద్ కు గొప్ప చరిత్రక ఉంది. ఈ నగరంలో అనేక చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ నుండి వారాంతంలో వచ్చే శెలవులలో చూడవచ్చును.

By Venkata Karunasri Nalluru

హిందూమతంలో దేవుళ్ళు, దేవతల జాబితాలు ఎక్కువ. వాటిలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ (శివ) ప్రధాన దేవతలుగా ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే శివుడు మరియు విష్ణువును ప్రధానంగా పూజిస్తారు; భారతదేశంలో వారికి అనేక వేల దేవాలయాలు ఉన్నాయి.

జ్ఞాన సరస్వతి ఆలయం

Saraswati Temple at Basara

Photo Courtesy: RameshSharma

త్రిమూర్తుల భార్యలలో పార్వతి మరియు లక్ష్మికి అనేక దేవాలయాలు ఉన్నాయి. మొత్తం భారతదేశంలో బ్రహ్మ దేవాలయాలు అరుదు. బ్రహ్మ భార్య అయిన సరస్వతికి కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి.

తెలంగాణలో ఆదిలాబాద్ లోని బాసర లో సరస్వతిదేవికి ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం పేరు "జ్ఞాన సరస్వతీ ఆలయం", ఈ దేవాలయంలో జ్ఞాన సరస్వతీదేవి కొలువై వుంటుంది.

జ్ఞాన సరస్వతి ఆలయం

Idol of Saraswati

Photo Courtesy: Bhaskaranaidu

స్థానిక ఇతిహాసం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసమహర్షి తన విద్యార్ధులతో పాటు ప్రశాంతత కోసం ఈ ప్రదేశానికి వచ్చారని తెలుస్తుంది. ఈ ప్రాంతం యొక్క ప్రశాంతతను మెచ్చిన వారు కొన్ని రోజులు ఇక్కడ బస చేసి కొన్ని గంటలపాటు ఇక్కడ ధ్యానం చేసేవారు. మొదట్లో ఈ ప్రాంతాన్ని 'వాసర' అని పిలిచేవారు.

ఈ ప్రాంతంలో మరాఠీ భాష ప్రభావితమైన కారణంగా కాలక్రమేణా బాసరగా మారింది. చారిత్రాత్మకంగా, జ్ఞాన సరస్వతి ఆలయం "బిజియలుడు" అనే రాజు నిర్మించాడని చెబుతారు. ఈ మూడు ఆలయాలు మంజీర, గోదావరి నదుల కూడలి ఒడ్డున నిర్మించారు.

హిందూ సంప్రదాయం ప్రకారం పిల్లలతో బియ్యం గల ఒక పళ్ళెంలో ప్రథమంగా "అక్షరాభ్యాసం" చేయిస్తారు. ఈ సంప్రదాయంలో మొదటగా గణేషుని మరియు సరస్వతి దేవిని పూజిస్తారు. ఇది పిల్లల జీవితంలో మంచి జ్ఞానం మరియు విద్యను సాధించటానికి తోడ్పడుతుంది. జ్ఞాన సరస్వతి యొక్క ఆలయం బాసరలో ఈ సంప్రదాయాన్ని అనాదిగా ఆచరిస్తున్నారు.

జ్ఞాన సరస్వతి ఆలయం

Basara Town

పుణ్యక్షేత్రమైన బాసరకు ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుండి బాసరకు సుమారు 210 కి.మీ.

బస్సు ద్వారా: హైదరాబాద్ నుండి బాసర చేరటానికి గవర్నమెంట్ బస్సులు అందుబాటులో వున్నాయి.

రైలు ద్వారా: బాసర రైల్వే స్టేషన్ జ్ఞాన సరస్వతీ దేవాలయంకు దగ్గరలో వుంది.

హైదరాబాద్ నుండి అనేక రైళ్ళు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి.

ఈ ఆలయాన్ని చేరుకోవడానికి పర్యాటకులు బాసర రైల్వే స్టేషన్ నుండి 2.4కి.మీ.షేర్ ఆటోలో ప్రయాణం చేయవచ్చు.

జ్ఞాన సరస్వతి ఆలయం తెలంగాణలోని అసాధారణ దేవాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఆసక్తికరమైన ఆలయంను దర్శించి జ్ఞాన దేవత యొక్క ఆశీస్సులు పొందండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X