Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తరకాశిలో వినాయకుడు జన్మించిన పుణ్య స్థలం !

ఉత్తరకాశిలో వినాయకుడు జన్మించిన పుణ్య స్థలం !

హిమాలయ పర్వతాల్లో దాగి ఉన్న ఒక సరస్సు ఒడ్డున పార్వతి దేవి వినాయకుణ్ణి జన్మనిచ్చింది. ఈ ప్రదేశానికి చేరాలంటే ముందు ఉత్తరకాశి చేరుకోవాలి.

By Mohammad

వినాయకుడు ... అంటే అందరికి గుర్తకొచ్చేది తొండం, ఏకదంతం, పెద్ద బొజ్జ, పొడవాటి చెవులు. వినాయకుణ్ణి విఘ్నేశ్వరుడు అని, గణనాథుడు అని పిలుస్తుంటారు. విఘ్నేశ్వరుడు, శివ - పార్వతుల పెద్ద కుమారుడు. గణనాథుడు నాలుగు చేతులు కలిగి ఉంటాడు. ఒక చేతిలో పాశం, మరో చేతిలో అంకుశం, ఇంకో చేతిలో లడ్డు లేదా ఘంటం మరియు మరో చేయి అభయహస్తం కలిగి ఉంటుంది.

వదిలేస్తే వినాయకుని గురించి ఇంకా చెబుతుంటారు గానీ ఆపండి. సరెలే ఇన్ని విషయాలు తెలుసు గానీ, వినాయకుడు ఎక్కడ పుట్టాడో ఎవరికైనా తెలుసా ?? వినాయకుడు పుట్టిన ప్రదేశం చాలా ముందికి తెలీదు. మిమ్మల్ని ఎన్నో విఘ్నల నుండి కాపాడిన విఘ్నేశ్వరుడు గురించి మీకు తెలుసుకోవాలని లేదూ ..! మరి ఇంకెందుకు ఆలస్యం, ఉత్తర భారతదేశానికి ప్రయానమవుదాం పదండి.

ఇది కూడా చదవండి : పవిత్ర పుణ్య యాత్ర ... యమునోత్రి !

ఇది కూడా చదవండి : గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఉన్నాయని ఎప్పుడో చిన్నప్పుడు మూడో తరగతి టెక్స్ట్ బుక్ లో సోషియల్ స్టడీస్ లో చదువుకున్నాం. ఇప్పుడూ కూడా ఉత్తరాన అదే ఉందనుకోండి మారలేదు. హిమాలయ పర్వతాలు దగ్గర నుండి చూడాలంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందే. ఈ హిమాలయ పర్వతాల్లో దాగి ఉన్న ఒక సరస్సు ఒడ్డున పార్వతి దేవి వినాయకుణ్ణి జన్మనిచ్చింది. ఈ ప్రదేశానికి చేరాలంటే ముందు ఉత్తరకాశి చేరుకోవాలి. ఈ ఉత్తరకాశి లో కూడా కొన్ని సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కూడా చూస్తూ వినాయకుని జన్మ స్థలానికి చేరుకొనే ఘట్టం మాటల్లో చెప్పలేనిది.

ఉత్తరకాశి ఎలా చేరుకోవాలి ??

ఉత్తరకాశి ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం

ఉత్తరకాశి కి, 183 కి.మీ. దూరంలో ఉన్న డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం సమీపంలోని విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి సాధారణ విమానాలు ద్వారా న్యూఢిల్లీ ఇందిరా మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనుసంధానించబడింది. యాత్రికుల ఉత్తరకాశి చేరుకోవడానికి జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు. మన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల నుండి ఢిల్లీ చేరుకొని, అక్కడి నుండి ఉత్తర కాశి చేరుకోవచ్చు.

రైలు మార్గం

రుషికేష్, హరిద్వార్ రైల్వే స్టేషన్లు ఉత్తరకాశి కి దగ్గరగా ఉంటాయి . ఈ రెండు రైల్వే స్టేషన్లు ముంబై, ఢిల్లీ, హౌరా, లక్నో వంటి ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడింది. మన రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల నుండి కూడా రైళ్లు ఇక్కడికి వెళుతుంటాయి.

రోడ్డు మార్గం

ఉత్తరకాశికి డెహ్రాడూన్, రుషికేష్, హరిద్వార్ మరియు ముస్సోరీ వంటి నగరాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ మరియు డెహ్రాడూన్ వంటి పెద్ద నగరాల నుండి ఉత్తరకాశి కి ప్రైవేట్ బస్సులు, వాహనాలు సైతం అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Animesh Hazra

ఆలయాలు పట్టణం

ఆలయాలు పట్టణం

ఉత్తరకాశి సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తున ఉన్నది. ఈ ప్రదేశంలో ఆలయాలు కోకొల్లలు అంటే ఎక్కువగా ఉన్నాయని అర్థం. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం హిందువులకు ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రదేశానికి గంగోత్రి, యమునోత్రి పుణ్య క్షేత్రాలు దగ్గర్లో ఉన్నాయి.

చిత్ర కృప : Eric Lon

విశ్వనాథ ఆలయం, ఉత్తరకాశి

విశ్వనాథ ఆలయం, ఉత్తరకాశి

ఉత్తరకాశి లో ఉన్న ఆలయాల్లో ప్రముఖ ఆలయం విశ్వనాథ ఆలయం. ఈ ఆలయం శివునికి అంకితమివ్వబడింది. ఈ సన్నిధిలో భక్తులు నిత్యం మంత్రాలు పఠిస్తుంటారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ శివుని ఆయుధం త్రిశూలం. ఇది 26 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది.

చిత్ర కృప : arvind_gairola

మణికర్ణిక ఘాట్, ఉత్తరకాశి

మణికర్ణిక ఘాట్, ఉత్తరకాశి

మణికర్ణిక ఘాట్ , ఉత్తరకాశి లో ముఖ్యమైన మత సంబంధ కేంద్రం. పురాణం ప్రకారం, ఉత్తరకాశి పట్టణం గొప్ప ఋషి జడా భారతమాత పశ్చాత్తప్తుడు అయిన ప్రదేశం. ఈ ప్రదేశం గురించి హిందూ మత పుస్తకం స్కంధ పురాణంలో కేదార్ ఖండ్ లో వివరించబడింది.

చిత్ర కృప : Sengupta2009

గంగోత్రి, ఉత్తరకాశి

గంగోత్రి, ఉత్తరకాశి

గంగోత్రి ఉత్తరకాశి లో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీటర్ల ఎత్తున హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నది. ఈ ప్రాంతం మంచు పర్వతాలు, హిమానీనదాలు, పొడవైన గట్లు, లోతైన సన్నని త్రోవలు, ఊర్ధ్వ శిఖరాలు మరియు సన్నని లోయలు కలిగి ఉంది.

చిత్ర కృప : Dan Earle

భగీరథి శిల, గంగోత్రి, ఉత్తరకాశి

భగీరథి శిల, గంగోత్రి, ఉత్తరకాశి

భగీరథి శిల అనేది గంగోత్రి యొక్క ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఈ రాతిశిల మీదే భగీరథ మహారాజు గంగా మాత గురించి తపస్సు చేశాడని పురాణాలు చెపుతున్నాయి.

చిత్ర కృప : rolling on

దయార బుగ్యల్, ఉత్తరకాశి

దయార బుగ్యల్, ఉత్తరకాశి

దయార బుగ్యల్ అనే ప్రదేశం ఉత్తరకాశి లో సముద్రమట్టానికి 3048 మీటర్ల ఎత్తున ఉన్నది. భట్వారీ గా పిలువబడే ఈ ప్రాంతం ఉత్తరకాశి - గంగోత్రి రోడ్డు మీద ఉన్నది. ఇది ఒక గడ్డి మైదానం. ఇక్కడికి వాహనాల్లో చేరుకోవచ్చు లేకుంటే బసరు గ్రామం నుండి 8 కి. మీ. ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా చేరుకోవచ్చు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చే యాత్రికులు మార్గ మధ్యలో శేశనాగ్ ఆలయాన్ని చూడవచ్చు.

చిత్ర కృప : Vijay Uniyal

ఏకాదశ రుద్ర ఆలయం, గంగోత్రి, ఉత్తర కాశి

ఏకాదశ రుద్ర ఆలయం, గంగోత్రి, ఉత్తర కాశి

ఏకాదశ రుద్ర ఆలయం గంగోత్రి లోని భగీరథి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ జరిగే పూజ ఎంతో ప్రశస్తిగాంచినది. శివుని 11 రుద్రాలకు జరిగే పూజ ఏకాదశ రుద్రాభిషేకం పూజ గా ఖ్యాతికెక్కింది.

చిత్ర కృప : Loupiote

గంగోత్రి ఆలయం, గంగోత్రి, ఉత్తరకాశి

గంగోత్రి ఆలయం, గంగోత్రి, ఉత్తరకాశి

గంగోత్రి టెంపుల్ భగీరథి నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3200 మీ. ల ఎత్తున కలదు. ఈ టెంపుల్ లో గంగా మాత విగ్రహం వుంటుంది. చలికాలంలో ఈ టెంపుల్ అధిక మంచు కారణంగా మూసివేస్తారు. ఆలయానికి సమీపం లో అనేక ఆశ్రమాలు కలవు. వీటిలో యాత్రికులు బస చేయవచ్చు.

చిత్ర కృప : Flash Back 007

గ్యానేశ్వర్ ఆలయం, గంగోత్రి, ఉత్తరకాశి

గ్యానేశ్వర్ ఆలయం, గంగోత్రి, ఉత్తరకాశి

గ్యానేశ్వర దేవాలయం కూడా భగీరథి నది ఒడ్డున ఉన్నది. ఈ దేవాలయం లో చాలా మంది భక్తులు తమ వారి క్షేమం కోసం వచ్చి పూజలు, యగ్ఞాలు, వ్రతాలు చేస్తుంటారు.

చిత్ర కృప : 10 Year Itch (Madhu Nair)

నీటిలో మునిగి ఉన్న శివలింగం, గంగోత్రి, ఉత్తరకాశి

నీటిలో మునిగి ఉన్న శివలింగం, గంగోత్రి, ఉత్తరకాశి

నీటిలో మునిగి ఉన్న శివలింగం, గంగోత్రి యొక్క పవిత్ర పర్యాటక ఆకర్షణ. ఈ సహజ శివలింగాన్ని, శీతాకాలంలో నీటి మట్టం తగ్గటంవలన, ఆ కాలంలో మాత్రమే చూడగలం. దీనిని జలమగ్న శివలింగం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ ప్రదేశంలోనే గంగను తన శిఖలో బంధించాడని చెపుతారు.

చిత్ర కృప : Ran Chakrabarti

పాండవ గుఫా, గంగోత్రి, ఉత్తరకాశి

పాండవ గుఫా, గంగోత్రి, ఉత్తరకాశి

పాండవ గుఫా మహాభారత కాలం నాటిది. గొప్ప శివ భక్తులైన పాండవులు ఈ గుహలోనే ధ్యానం చేసేవారని పురాణాలలో పేర్కొన్నారు. గంగోత్రి నుండి యాత్రికులు ఇక్కడికి ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే చేరుకుంటారు. ట్రెక్కింగ్ మార్గం ఒకటిన్నారా కిలోమీటరు ఉంటుంది.

చిత్ర కృప : Chavo Fraser

సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్, గంగోత్రి, ఉత్తరకాశి

సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్, గంగోత్రి, ఉత్తరకాశి

సూర్య కుండ్ మరియు గౌరీ కుండ్ అనేవి గంగోత్రి లో ఉన్న రెండు చెరువుల పేర్లు. ఇవి ప్రధాన గంగోత్రి ఆలయానికి చేరువలో ఉన్నాయి. యాత్రికులు ఈ చెరువుల్లో ప్రవహిస్తున్న నీటి సవ్వడులను వింటూ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.

చిత్ర కృప : Himanshu Joshi

గంజ్ఞాని, గంగోత్రి, ఉత్తరకాశి

గంజ్ఞాని, గంగోత్రి, ఉత్తరకాశి

గంజ్ఞాని, గంగోత్రి లో ధ్యానం కు అనువైన ఆధ్యాత్మిక స్థలం. అందమైన పర్వతాలు, ఆహ్లాదకర వాతావరణం ఇక్కడి ప్రదేశ అందాల్ని మరింతగా పెంచాయి. సాధారణంగా ఇక్కడి రిషికుండ్ అనే నీటి కొలనులో స్నానాలు చేసిన తర్వాత గంగోత్రి ఆలయాన్ని సందర్శిస్తుంటారు భక్తులు.

చిత్ర కృప : Piyush Kumar

యమునోత్రి, ఉత్తరకాశి

యమునోత్రి, ఉత్తరకాశి

గంగోత్రి, యమునోత్రి రెండూ కూడా ఒకదానికొకటి 50 కి. మీ. దూరంలో ఉంటాయి. ఈ ప్రదేశంలోనే పవిత్ర యమునా నది పుట్టింది. సముద్రమట్టానికి 3293 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉన్నది. సాదారణంగా యమునోత్రి చేరుకోవాలంటే భక్తులు కాస్త అవస్థలు పడక తప్పదు. మార్గం అంతా కూడా అడవులతో నిండి ఉండి, ఎత్తుపల్లాలుగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలంటే ఒకరోజు పడుతుంది. గాడిదలు, గుర్రాలు వంటి వాటి మీద ప్రయాణించి భక్తులు యమునోత్రిని సందర్శిస్తుంటారు.

చిత్ర కృప : Loupiote

సూర్యకుండ్, యమునోత్రి, ఉత్తరకాశి

సూర్యకుండ్, యమునోత్రి, ఉత్తరకాశి

సూర్యకుండ్ యమునోత్రి సమీపంలోని ఒక వేడి నీటి బుగ్గ. ఈ స్ప్రింగ్ యొక్క వేడి నీరు ఆలయ ప్రసాదం తయారు చేసేందుకు అవసరమైన రైస్ మరియు ఆలు(ఉర్లగడ్డ)లు ఉడికించేందుకు ఉపయోగిస్తారు. మాత యమునోత్రి కి ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత దానిని భక్తులకు ప్రసాదం గా పంపిణీ చేస్తారు.

చిత్ర కృప : Loupiote

యమునోత్రి ఆలయం, యమునోత్రి, ఉత్తరకాశి

యమునోత్రి ఆలయం, యమునోత్రి, ఉత్తరకాశి

యమునోత్రి టెంపుల్ సముద్రమట్టానికి 3235 మీ.ల ఎత్తున కలదు. ఇక్కడ యమునా దేవి విగ్రహం వుంటుంది. దీనితో పాటు హిందూ దేముడు యమ ధర్మరాజు విగ్రహం కూడా వుంటుంది. ఇది చార్ ధామ్ గా చెప్పబడే నాలుగు టెంపుల్స్ లో ఒకటి. ఈ టెంపుల్ ద్వారాలు 'అక్షయ తృతీయ' నాడు మాత్రమే తెరుస్తారు.

చిత్ర కృప : Himanshu Dutt

బర్కోట్, యమునోత్రి, ఉత్తరకాశి

బర్కోట్, యమునోత్రి, ఉత్తరకాశి

బర్కొట్ ప్రదేశం, సముద్రమట్టానికి సుమారు 1220 మీ. ల ఎత్తులో, యమునోత్రి కి 4 కి.మీ.ల దూరంలో కలదు. పర్యాటకులు ఇక్కడ నుండి బందర్ పూంచ్ పర్వతశిఖరాలతో పాటు యమునా నది, పచ్చటి ప్రదేశాలు, ఆపిల్ తోటలు చూడవచ్చు. యమునోత్రి వెళ్ళే వారికి ఇది ఒక పర్యాటక మజిలీగా వుంటుంది.

చిత్ర కృప : RameshSharma1

దివ్యశిల, యమునోత్రి, ఉత్తరకాశి

దివ్యశిల, యమునోత్రి, ఉత్తరకాశి

యమునోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న దివ్యశిల అనేది ఒక రాతిస్తంభం. ఈ దివ్య శిల ను భగవంతుని వెలుగు గా చెబుతారు. యమునోత్రి ఆలయానికి వెళ్ళేవారు ముందుగా ఈ దివ్య శిల ను పూజించి లోనికి వెళతారు.

చిత్ర కృప : Loupiote

ఖర్సాలి, యమునోత్రి, ఉత్తరకాశి

ఖర్సాలి, యమునోత్రి, ఉత్తరకాశి

ఖర్సాలి, యమునోత్రి కి కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామం.ఇక్కడి దృశ్యాలకు ఇది ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అనేక జలపాతాలు, వేడి నీటి బుగ్గలు, పచ్చటి మైదానాలు కలవు. ఇక్కడ కల మూడు అంతస్తుల శివ టెంపుల్ ను కూడా భక్తులు సందర్శిస్తారు.

చిత్ర కృప : Hrishi Chandanpurkar

హనుమాన్ చట్టి, యమునోత్రి, ఉత్తరకాశి

హనుమాన్ చట్టి, యమునోత్రి, ఉత్తరకాశి

హనుమాన్ చట్టి సముద్ర మట్టానికి 2400 మీ. ల ఎత్తున ఉన్నది. ఇది సరిగ్గా గంగ మరియు యమునా నది కలిసే ప్రాంతం లో కలదు. గతంలో ఇది ట్రెక్కింగ్ పాయింట్ గా వుండేది. యమునోత్రి కి ఇది 13 కి.మీ.ల దూరంలో ఉంది. గతం తో పోలిస్తే ఇప్పుడు సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

చిత్ర కృప : telugu native planet

గోముఖ్, ఉత్తరకాశి

గోముఖ్, ఉత్తరకాశి

గోముఖ్, గంగోత్రి హీమానీనదం యొక్క చివరి భాగం. ఈ ప్రదేశంలోనే భగీరథి నది ఉద్భవించినది. ఈ స్థలంలో కష్టసాధ్యమైన ట్రెక్కింగ్ ప్రదేశం శివలింగ శిఖరం ఉన్నది. మంచుచే కప్పబడ్డ శిఖరాలు సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. హీమానీనదం యొక్క చివరి భాగం ఆవు నోరు ని పోలి ఉంటుంది కనుకనే ఈ స్థలానికి గోముఖ్ అని పేరు.

చిత్ర కృప : Piotr Gaborek

భగీరథి నది, గోముఖ్, ఉత్తరకాశి

భగీరథి నది, గోముఖ్, ఉత్తరకాశి

గంగా నది యొక్క ముఖ్య ఉపనది అయిన భగీరథి నది, గోముఖ్ వద్ద పుట్టినది. ఇది హిందువులు పవిత్రంగా భావించే నదుల్లో ఒకటి. పురాణాల ప్రకారం, ఈ రాజు కపిల మహర్షి శాపం నుండి తన 60,000 పినతండ్రులను విడుదల చేసేందుకు స్వర్గం నుండి గంగా నదిని తీసుకువచ్చాడు. నది యొక్క మూలం సముద్రమట్టానికి 3892 మీటర్ల ఎత్తులో ఉంది.

చిత్ర కృప : Shantanu Roy Biswas

గంగోత్రి హీమానీనదం, గోముఖ్, ఉత్తరకాశి

గంగోత్రి హీమానీనదం, గోముఖ్, ఉత్తరకాశి

గంగోత్రి హిమానీనదం హిమాలయ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద హీమానీనదం. ఈ హిమానీనదం కఠినమైన అధిరోహణ మార్గాలకు ప్రసిద్ధి చెందినది. చౌఖంబా శిఖరం క్రింద ఉన్న ఒక వలయం నుండి వెలువడే ఈ హిమానీనదం వాయువ్య దిశగా ప్రవహిస్తూ చివరికి ఆవు నోరు పోలిన ఆకృతి ఏర్పాటు వద్ద ఆగిపోతుంది. అందుకే గోముఖ్ అన్న పేరు వచ్చింది.

చిత్ర కృప : Zoltan Acs

నందనవనం మరియు తపోవనం, గోముఖ్, ఉత్తరకాశి

నందనవనం మరియు తపోవనం, గోముఖ్, ఉత్తరకాశి

నందనవనం మరియు తపోవనం, గంగోత్రి హిమానీనదానికి మరియు గంగోత్రికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బండరాళ్ళ మధ్య దూకడం, హిమానీనదాల యాత్ర మరియు రాతి అధిరోహణ వంటి సాహస చర్యలతో కూడిన ప్రసిద్ధ పర్వతారోహణ స్థలం .యాత్రికులు నందనవనం నుండి ట్రెక్కింగ్ చేసుకుంటూ రాతి భూభాగం గుండా వెళ్లి చివరికి తపోవనం యొక్క పచ్చికబయల్లో తేలుతారు.

చిత్ర కృప : Vikas

హర్ కి డూన్, ఉత్తరకాశి

హర్ కి డూన్, ఉత్తరకాశి

హర్ కి డూన్ సముద్ర మట్టానికి 3556 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక సుందరమైన లోయ. ఇది హిమాలయాల్లో పర్వతారోహణలలో ఒకటిగా చెప్పబడుతుంది మరియు పర్వతం చుట్టూ అందమైన పైన్ అడవులు కలవు. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు మరియు పక్షులను గమనించే వారికీ ఒక ఆకర్షణీయ ప్రదేశంగా ఉంది.

చిత్ర కృప : Soumya Ganguly

మనేరి, ఉత్తరకాశి

మనేరి, ఉత్తరకాశి

మనేరి ఉత్తరకాశి నుండి 2 కి. మీ. ప్రయాణం దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ భగీరథి నది పై నిర్మించిన ఆనకట్ట ప్రముఖ ఆకర్షణగా ఉన్నది.

చిత్ర కృప : shiva1o8

భైరవుని ఆలయం, ఉత్తరకాశి

భైరవుని ఆలయం, ఉత్తరకాశి

భైరవుని ఆలయం, ఉత్తరకాశి యొక్క చౌక్ ప్రాంతంలో ఉంది. హుయాన్ త్సాంగ్ అనే చైనీస్ యాత్రికుడు క్రి.శ.629 లో భారతదేశం లో పర్యటించి ఈ స్థలానికి బ్రహ్మపుర అనే పేరు పెట్టాడు. హిందూ మత పుస్తకమైన స్కంధ పురాణంలో ఈ ప్రదేశం గురించి పేర్కొనటం జరిగింది.

చిత్ర కృప : Catherine Pompeo

 కర్ణ దేవత ఆలయం, ఉత్తరకాశి

కర్ణ దేవత ఆలయం, ఉత్తరకాశి

కర్ణ దేవత ఆలయం ఉత్తరకాశిలో సర్నుల్ విలేజ్ లో ఉంది. యాత్రికులు ఈ గ్రామం చేరుకోవడానికి నెట్వర్ నుండి 1.5 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఇక్కడికి భక్తులు తరచూ వస్తుంటారు.

చిత్ర కృప : Catherine Pompeo

కపిల్ ముని ఆశ్రమం, ఉత్తరకాశి

కపిల్ ముని ఆశ్రమం, ఉత్తరకాశి

కపిల్ ముని ఆశ్రమం సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ స్థలాన్ని ధ్యాన యోగి కపిల్ మునికి అంకితం చేసారు. తన ప్రార్థనలుకు తృప్తిచెంది, శివుడు మహర్షికి ఆశీర్వాదం ఇచ్చారు. ఇక్కడ శివలింగాన్ని సైతం ప్రతిష్టించారు. అంతే కాకుండా, ప్రయాణికులు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ ఆలయంను ను కూడా పనిలోపనిగా సందర్శించవచ్చు.

చిత్ర కృప : Ama Vivek

ఫోకు దేవత ఆలయం, ఉత్తరకాశి

ఫోకు దేవత ఆలయం, ఉత్తరకాశి

ఫోకు దేవతా ఆలయం యమునా నదికి ఉపనదైన టన్నుల నది పక్కన ఉంది. ఈ ప్రాంతంలో కర్ణ మందిర్ మరియు దుర్యోధన మందిర్ అనే రెండు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. మొత్తం గ్రామం చుట్టూ అందమైన దేవదారు, చీర్ మరియు చెట్లు ఉన్నాయి. లోయ నుండి ఒక సన్నని మార్గం గుండా ఇనుప వంతెన ద్వారా ఫోకు దేవతా ఆలయం ను చేరుకోవచ్చు.

చిత్ర కృప : rolling on

నచికేత తాల్, ఉత్తరకాశి

నచికేత తాల్, ఉత్తరకాశి

నచికేత తాల్, ఉత్తరకాశి నుండి 32 కి.మీ. దూరంలో ఉన్న ఒక అందమైన సరస్సు. ఈ సరస్సు చుట్టూ ఓక్, పైన్, మరియు రోడోడెండ్రాన్ చెట్లు ఉంటాయి. యాత్రికులు చౌరంగి ఖల్ నుండి 3 కి.మీ. ట్రెక్కింగ్ మార్గం ద్వారా నచికేత తాల్ ను చేరుకోవచ్చు.

చిత్ర కృప : Sunu Sasidharan

శని దేవాలయం, ఉత్తరకాశి

శని దేవాలయం, ఉత్తరకాశి

శని దేవాలయం ఉత్తరకాశి లోని ఖర్సలి గ్రామంలో ఉంది. పురాణాల ప్రకారం, ఈ ఆలయం హిందూ మత దేవత అయిన యమునా సోదరుడు శనికి అంకితం ఇవ్వబడింది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఐదు అంతస్తుల ఆలయం రాయి మరియు కలప ను ఉపయోగించి కట్టించినారు.

చిత్ర కృప : Cyberian_8

శక్తి ఆలయం, ఉత్తరకాశి

శక్తి ఆలయం, ఉత్తరకాశి

శక్తి ఆలయం, విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం లో 6 మీ.ల త్రిశూలము ప్రసిద్ధి చెందింది. దీనిని ఇనుము మరియు రాగి తో తయారు చేసారని నమ్ముతారు. పౌరాణిక కథలు ప్రకారం, ఈ త్రిశూల్ రాక్షసులను చంపడానికి హిందూ మత దేవతైన దుర్గాదేవిచే ఉపయోగించబడింది.

చిత్ర కృప : arvind_gairola

ధూర్యోధన మందిర్, ఉత్తరకాశి

ధూర్యోధన మందిర్, ఉత్తరకాశి

దుర్యోధన మందిర్ ఉత్తరకాశి లో ఉన్న సార్ గ్రామంలో నెలకొని ఉన్న ఒక అందమైన దేవాలయం. ఈ ఆలయాన్ని భక్తులు తరచూ వచ్చి సందర్శిస్తుంటారు.

చిత్ర కృప : rolling on

దోదితాల్, ఉత్తరకాశి

దోదితాల్, ఉత్తరకాశి

దోదితాల్ అనే ప్రాంతం సముద్ర మట్టానికి 3024 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇది ఒక మంచినీటి సరస్సు. అందమైన ఈ సరస్సు చుట్టూ ఎంతో పచ్చదనం కనపడుతుంది. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే గొప్ప సాహసం చేయక తప్పదు. ఇక్కడే పార్వతి దేవి విఘ్నేశ్వరుణ్ణి జన్మనిచ్చింది. ఈ ప్రదేశం చూడటానికి చాలా కోమలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడే ఒక విఘ్నేశ్వర ఆలయం కూడా ఉంది.

చిత్ర కృప : Shandy Banerjee

దోదితాల్, ఉత్తరకాశి

దోదితాల్, ఉత్తరకాశి

దోదితాల్ సరస్సు చుట్టూ మంచు పర్వతాలతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు, తలకి టోపీలు, చేతికి గ్లౌజ్ లు తొడుక్కోవాలి. సహాయకునిగా ఒక గైడ్ ను కూడా తీసుకోవచ్చు. కానీ ఆయాసం, ఆస్తమా ఉన్న వ్యక్తులైతే ఈ ట్రెక్కింగ్ చేయకపోవడం మంచిది. ఒకవేళ వెళితే మందులు, ఆహారం తీసుకొని ప్రయాణించాలి.

చిత్ర కృప : Animesh Hazra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X