అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

వారణాసి : ఆధ్యాత్మిక రాజధానికి ఒక తీర్థ యాత్ర !

Posted by:
Updated: Monday, March 24, 2014, 14:44 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

కాశి లేదా బెనారస్ పట్టణం పరమశివుడు మెచ్చిన పవిత్ర ప్రదేశం. ప్రపంచంలో ఇది ఒక అతి ప్రాచీన నగరం. ఇక్కడ మానవాళి ఎన్నో యుగాల నుండి నివసిస్తోందని చెపుతారు. భారత దేశంలోని గొప్ప మరియు అతి పవిత్ర నది అయిన గంగా నది వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. ఈ కారణంగా కూడా ఈ పట్టణం ఎంతో ప్రసిద్ధి చెందినది. అయితే, హిందూ మతంలో ఏడు పవిత్ర నగరాలలో చెప్పబడే ఈ కాశీ పట్టణం అన్నిటి కంటే గొప్పదిగా కూడా చెపుతారు.

హిందూ సాంప్రదాయాలను ఆచరించేందుకు గాను ఇక్కడకు వచ్చి కొంత కాలం వుండి వాటిని నేర్చుకుంటారు. సనాతన హిందూ ధర్మంలో ఈ పట్టణం లో మరణం పొందితే నేరుగా స్వర్గానికి వేళతారనే పూర్తి నమ్మకం కూడా హిందువులకు కలదు. మరణించిన కుటుంబ సభ్యులకు, బంధువులకు గంగా నది ఒడ్డున కర్మలు ఆచరిస్తే వారి ఆత్మలకు శాంతి చేకూరు తుందని వారికి స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని కూడా హిందువులు భావిస్తారు. నేటికీ ఈ ప్రదేశంలో సనాతన హిందూ ధర్మ ఆచార వ్యవహారాలూ ప్రతి నిత్యం ఇక్కడ జరుగుతూ వుంటాయి.

ఇంత ప్రఖ్యాతికల ఈ వారణాసి పట్టణంలో ప్రసిద్ధి చెందిన అనేక మంది ఆధ్యాత్మిక గురువులు, కవులు, వ్యాసకర్తలు,కళాకారులూ , తమ జీవన అంతిమ సమయంలో కాశీ లో నివాసం వుండేవారు. నేటికీ ఈ ఆచారం మేరకు అనేక మంది తమ చివరి జీవిత కాలం ఇక్కడ గడుపుతూనే వున్నారు. కాశి పట్టణంలో అనేక దేవాలయాలు కలవు. వాటిలో పరమ శివుడి విశ్వనాధ దేవాలయం అన్నిటికంటే మొదటి స్థానంలో భక్తులు సందర్శిస్తారు. ఆ తరువాత మాత్రమే, మాత అన్నపూర్ణా దేవి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు.

వాయు, రైలు, రోడ్డు మార్గాలలో వారణాసి చేరవచ్చు. ఈ పట్టణానికి సుమారు 26 కి. మీ. ల దూరంలో వారణాసి ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు విమానాలు నడుస్తాయి. దేశంలోని వివిధ పట్టణాలనుండి, రైలు మరియు రోడ్డు మార్గాలు కూడా తరచుగా ఈ ప్రదేశానికి చేరేలా వుంటాయి.

వారణాసి

పవిత్రమైన గంగా నదిని పూజించే దృశ్యం. దీనిని గంగా హారతి అంటారు. ఇది ప్రతి రోజూ సాయంత్రం వేళ కన్నుల విందుగా జరుగుతుంది.

ఫోటో క్రెడిట్ : Arian Zwegers

వారణాసి

గంగ లో స్నానం తుంగ పానం అన్ని పాపాలనూ పోగోడతాయనే నమ్మకంతో యాత్రికులు గంగా ఘాట్ కు వచ్చిన దృశ్య ఫోటో క్రెడిట్ : Davi1974d

 

 

వారణాసి

బోటు లలో వివిధ ఘాట్ లను సందర్శిస్తున్న యాత్రికులు

ఫోటో క్రెడిట్ : FlickreviewR

వారణాసి

బహుశ...ఈ రకమైన దృశ్యం ఎక్కడా చూడబోము.  దహన క్రియకు గాను ఘాట్ లో వేచి వున్న శవాలు.

ఫోటో క్రెడిట్ :   Mandy

వారణాసి

 అక్కడక్కడ ఇటువంటి ఘాట్ లలో మరణించిన వారి  దహన క్రియలు జరుగుతూ నే వుంటాయి. కాని ప్రత్యేకించి మణి కర్ణికా ఘాట్ ఈ శవ దహనాలకు ప్రసిద్ధి. ఫోటో క్రెడిట్:   Arian Zwegers

 

 

వారణాసి

వారణాసి లోని అహల్యా ఘాట్ లో ఒక దృశ్యం

ఫోటో క్రెడిట్ :Ken Wieland

 

 

వారణాసి

ఇక్కడ జరిగేది అంతా పురాతన సాంప్రదాయక తీరు తేన్నులే అయినా...ఆధునిక సెల్ ఫోన్ లు సైతం అత్యవసరమే..

ఫోటో క్రెడిట్ : Yosarian

 

 

వారణాసి

గంగ నది  ఘాట్ లో కర్మలు ఆచరిస్తున్న ఒక కుటుంబ సభ్యలు
ఫోటో క్రెడిట్: Arian Zwegers

 

 

వారణాసి

గంగా నదిలో తర్పణలు విడుస్తున్న దంపతులు

ఫోటో క్రెడిట్: Jorge Royan

 

 

వారణాసి

శివాలా ఘాట్ లో పుణ్య స్నానాలు చేస్తున్న యాత్రికులు

ఫోటో క్రెడిట్ : Antoine Taveneaux

 

 

వారణాసి

గంగా నదీ తీరం వెంబడి గల వివిధ ఘాట్ లు

 

ఫోటో క్రెడిట్:  Ekabhishek

వారణాసి

ఉదయం వేళలో వారణాసిలో కనపడే దృశ్యాలు

ఫోటో క్రెడిట్:   Tomer T

వారణాసి

వారణాసి లోని గంగా నదిలో గేదె లకూ (పుణ్య) స్నానాలు చేయిస్తున్న ఒక దృశ్యం

ఫోటో క్రెడిట్:  Arian Zwegers

 

 

వారణాసి

వారణాసిలోని దరభంగా పాలస్ ఘాట్ ప్రదేశం

ఫోటో క్రెడిట్:  McKay Savage

 

 

వారణాసి

పుణ్య స్నానాల కొరకు వారణాసి లోని మరొక ప్రదేశం అసి ఘాట్

ఫోటో క్రెడిట్:   Nandanupadhyay

 

 

వారణాసి

యాత్రికులు అధికంగా స్నానాలు, కర్మలూ ఆచరించే దశాశ్వమేద ఘాట్

ఫోటో క్రెడిట్:  Ilya Mauter

 

 

వారణాసి

వారణాసిలోని లలితా ఘాట్ లో ఒక దృశ్యం

ఫోటో క్రెడిట్:   Ilya Mauter

 

 

వారణాసి

గంగా తీరంలో కల మరొక ప్రదేశం మున్షి ఘాట్

ఫోటో క్రెడిట్:   Marcin Białek

 

 

వారణాసి

వారణాసిలోని సింధియా ఘాట్ ఒక దూర దృశ్యం

ఫోటో క్రెడిట్: Ilya Mauter

 

 

వారణాసి

వారణాసిలోని తులసి ఘాట్

ఫోటో క్రెడిట్: Nandanupadhyay

వారణాసి

గంగా నది ఒడ్డున బట్టలు ఉతుకుతూ వున్న చాకలి వారు

ఫోటో క్రెడిట్:   Dennis Jarvis

 

 

వారణాసి

వారణాసిలోని ధోభి ఘాట్

ఫోటో క్రెడిట్ :   ampersandyslexia

 

 

వారణాసి

నాగ నధ్యా అనే ఒక ఉత్సవం నిర్వహిస్తారు. కృష్ణుడు కదంబ వ్రుక్షంపై నిలుచుని వుండటం చూడవచ్చు.

ఫోటో క్రెడిట్:   Nandanupadhyay

 

 

వారణాసి

గుజరాత్ ముఖ్య మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కాశీ విస్వనాదుడిని దర్శించ టం చూడవచ్చు.

ఫోటో క్రెడిట్:   Vibhijain

వారణాసి

వారణాసిలోని బుద్ధుడి ధర్మ స్తూపం. బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని ఇక్కడే చేసాడని చెపుతారు

ఫోటో క్రెడిట్ :   Ken Wieland

 

 

వారణాసి

వారణాసిలోని మార్కెట్ లో మనుషులు, ఆవులు కలసి తిరిగే దృశ్యం

ఫోటో క్రెడిట్:   Jorge Royan

 

 

వారణాసి

వారనాసిలో రాగి, ఇత్తడి వస్తువులు విక్రయించు ఒక దుకాణం

ఫోటో క్రెడిట్:   Jorge Royan

 

 

వారణాసి

వావ్...బెనారస్ పాన్ ...తినే వారికే తెలుస్తుంది దాని రుచి ....!

ఫోటో క్రెడిట్:  Jorge Royan

 

 

వారణాసి

భారత దేశపు సాంప్రదాయ నగలను మక్కువతో ఎంపిక చేస్తున్న విదేశీ మహిళలు

ఫోటో క్రెడిట్:   Jorge Royan

 

 

వారణాసి

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బెనారస్ సిల్క్ చీరలు

ఫోటో క్రెడిట్:   Jorge Royan

 

 

వారణాసి

వారణాసి లోని ఒక ఘాట్ లో ఒక నాగా సాధువు కాళ్ళకు మొక్కుతున్న మహిళా.

వారణాసి

సిద్ధ పురుషులుగా చెప్పబడే నాగా సాధువులు

వారణాసి

నాగా సాధువులు, గొప్ప శివ భక్తులు అవడం వలన, శివుడికి ఇష్టమైన వారణాసిలో కనపడతారు.

ఫోటో క్రెడిట్:   Ekabhishek

 

 

వారణాసి

గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తున్న ఒక మహిళా.

వారణాసి

భగవంతుడి పూజ కొరకు మాలను సిద్ధం చేస్తున్న ఒక చిన్న బాలిక

ఫోటో క్రెడిట్:   Jorge Royan

 

 

వారణాసి

కాసీ రాజ్య రాజు బోటు విహారం చూడవచ్చ్చు. వీరు కాశి రాజ వంశీకులు

ఫోటో క్రెడిట్:  Nandanupadhyay

 

 

వారణాసి

గంగా నదికి అడ్డంగా నిర్మిస్తున్న ఒక బ్రిడ్జి

 

వారణాసి

శివ లింగాన్ని భక్తి తో అర్చిస్తున్న ఒక విదేశీయుడు

వారణాసి

వారణాసిలో స్థానికంగా తయారు చేస్తున్న ఫ్యాన్ లు 

ఫోటో క్రెడిట్ :  Jorge Royan

 

 

వారణాసి

గంగా నదీ తీరంలో కనపడే మనోహరమైన సూర్యాస్తమయ దృశ్యం

ఫోటో క్రెడిట్:   orvalrochefort

 

 

Please Wait while comments are loading...