Search
  • Follow NativePlanet
Share
» »విరాట్ నగర్ - మహాభారతం జరిగిన చోటు !!

విరాట్ నగర్ - మహాభారతం జరిగిన చోటు !!

విరాట్ నగర్ లో ప్రధాన ఆకర్షణలు ఇక్కడ ఉన్న గుహలు. వీటిలో పాండవులు కొంత కాలం తలదాచుకున్నట్లు చెబుతారు స్థానికులు. ఈ గుహలే కాక ఇక్కడ భీం కి దుంగారి మరియు పాండు హిల్ వంటి అనేక ప్రసిద్ధ ఆకర్షణలు ఉన్నాయి.

By Super Admin

ఈ శివుని గుడి విశిష్టత వింటే వెంటనే వెళ్లి దర్శించుకుంటారు !ఈ శివుని గుడి విశిష్టత వింటే వెంటనే వెళ్లి దర్శించుకుంటారు !

ఈ గ్రామంలో పాము కరిచినా ప్రాణం పోదు? సైన్స్ కి అంతుచిక్కని రహస్యం !ఈ గ్రామంలో పాము కరిచినా ప్రాణం పోదు? సైన్స్ కి అంతుచిక్కని రహస్యం !

విరాట్ నగర్, రాజస్థాన్ రాష్ట్రంలోని పురాణేతిహాసాలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం ఆ రాష్ట్ర రాజధాని జైపూర్ కు 89 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ప్రదేశాన్ని చాలా మంది బైరాత్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రదేశం గురించి మహాభారతంలో పేర్కొనబడింది. దీనిని విరాటుడు అనే రాజు కనుగొన్నాడని, పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని చెబుతారు.

విరాట్ నగర్ లో ప్రధాన ఆకర్షణలు

విరాట్ నగర్ లో ప్రధాన ఆకర్షణలు ఇక్కడ ఉన్న గుహలు. వీటిలో పాండవులు కొంత కాలం తలదాచుకున్నట్లు చెబుతారు స్థానికులు. ఈ గుహలే కాక ఇక్కడ భీం కి దుంగారి మరియు పాండు హిల్ వంటి అనేక ప్రసిద్ధ ఆకర్షణలు ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడ బౌద్ధ ఆరామాలు, దేవాలయాలు, మ్యూజియాలు, జైన మందిరాలు మొదలగునవి చూడవచ్చు.

ఇది కూడా చదవండి : అల్వార్ లో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

భీం కి దుంగారి

భీం కి దుంగారి

భీం కి దుంగారి ఒక పెద్ద గుహ. ఇక్కడ పాండవులు తమ అజ్ఞాత వాసం గడిపారని, ఈ గుహాలలోనే కొంత కాలం నివసించారని చెబుతారు. పాండవులలో ఒకరైనా భీముడు పేరు మీద ఈ గుహలు ఆ పేరొచ్చింది. భీముడు విరాటుడు రాజుకు వంటవాడిగా అజ్ఞాత వాసం గడిపాడు.

చిత్రకృప : Giridharmamidi

అశోకా శిలాలేఖ్

అశోకా శిలాలేఖ్

అశోకా శిలాలేఖ్ అనేది అశోకుడు వేయించిన శాశనం. దీనిని మౌర్య చక్రవర్తి అశోకుడు రాయించాడు. దీని చుట్టుప్రక్కల అనేక సుందర దృశ్యాలను చూడవచ్చు. మెయిన్ రోడ్డు కు 100 మీటర్ల దూరంలో ఈ శిలాలేఖ్ కలదు.

చిత్రకృప : Rafatalam100

బీజక్ కి పహారి

బీజక్ కి పహారి

బీజక్ కి పహారి లో బౌద్ధ ఆరామాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఇదివరకు 8 వరకు ఆరామాలు ఉండేవని, ప్రస్తుతం రెండే ఉన్నాయని చెబుతారు. అశోకుడు వీటిని నిర్మించినట్లు అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఎంట్రెన్స్ లో బ్రహ్మలిపి లో ఉన్న శాశనాలను పర్యాటకులు చూడవచ్చు.

చిత్రకృప : Raonaresh

జైన్ నాసియా

జైన్ నాసియా

జైన్ నాసియా అనేది ఒక ఉద్యానవనం. ఇది మొఘల్ గేట్ కు ఎదురుగా కలదు. పిల్లలు ఆడుకొనేందుకు ఇక్కడ ఒక ఆట స్థలం కలదు. సాయంత్రం పూట స్థానికులు కుటుంబసభ్యులతో వచ్చి సేదతీరుతుంటారు.

చిత్రకృప : viratnagar

జైన దేవాలయం

జైన దేవాలయం

జైన దేవాలయం ఇక్కడి అతికొద్ది ఆకర్షణలో ప్రధానమైనది. దేవాలయం ఎంట్రెన్స్ లో స్తంభాల పోర్టికో చక్కని చెక్కడాలతో కనపడుతుంది. ఇందులో జైన మత శాశనాలు, ఇతర మత శాశనాలు చూడవచ్చు. జైన తీర్థాంకుల విగ్రహాలను చూడవచ్చు.

చిత్రకృప : Giridharmamidi

గణేష్ గిరి ఆలయం

గణేష్ గిరి ఆలయం

గణేష్ గిరి ని విరాట్ నగర్ ను సందర్శించే హిందూ భక్తులు తప్పక దర్శించాలి. సంవత్సరం పొడవునా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. సమీపంలో చిన్న మ్యూజియం చూడవచ్చు. ఇందులో 170 శిల్పశైలి కధనాలు వివరించబడ్డాయి.

చిత్రకృప : viratnagar

మొఘల్ గేట్

మొఘల్ గేట్

ఇదొక స్మారక చిహ్నం. దీనిని తాజ్ మహల్ కు నకలు అని కూడా అభివర్ణిస్తుంటారు. సంవత్సరం పొడవునా ఈ పబ్లిక్ ప్రదేశాన్ని విరాట్ నగర్ ను సందర్శించే ప్రతి పర్యాటకుడు చూడాల్సిందే !!

చిత్రకృప : Raonaresh

విరాట్ నగర్ ఎలా చేరుకోవాలి ?

విరాట్ నగర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం : విరాట్ నగర్ కు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ నుండి ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి. జైపూర్ నుండి విరాట్ నగర్ కేవలం 89 కిలోమీటర్ల దూరంలో కలదు.

రైలు మార్గం : విరాట్ నగర్ కు సమీపాన జైపూర్ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి. అక్కడ దిగి టాక్సీ లో ప్రయాణించి విరాట్ నగర్ చేరుకోవచ్చు.

వాయు మార్గం : విరాట్ నగర్ కు సమీపాన జైపూర్ ఎయిర్ పోర్ట్ కలదు.ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి విరాట్ నగర్ చేరుకోవచ్చు.

చిత్రకృప : viratnagar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X