Search
  • Follow NativePlanet
Share
» »ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని.

By Venkatakarunasri

హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. హంపి గురించిన కొన్ని వాస్తవాలు హంపి ప్రాచీన పట్టణమే కాదను. దీనిని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అనేవారని చరిత్ర చెపుతోంది. 13 నుండి 16 శతాబ్దాలవరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్దితిలో రాణించింది. కర్నాటకకు ఉత్తర భాగాన బెంగుళూరుకు 350 కిలో మీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరునుండి బస్సులు అనేకం. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు దీనిని దర్శిస్తారు. హంపి శిధిలాలు చూడాలంటే, స్ధానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకొని దనిపై తిరుగుతూ చూస్తే పూర్తిగా వాటిని ఆనందించినవారవుతారు. అసలు టూరిస్టులు హంపి ఎందుకు ఇష్టపడతారు. హంపి పట్టణం దాని శిధిలాలకంటే కూడా దాని మతపర చరిత్రకు ప్రాధాన్యత కలిగి ఉంది.

PC: Manoj kulal

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, ఆంజనేయాద్రి మొదలైనవి కలవు. కర్నాటకలోని ప్రధాన నదులలో ఒకటైన తుంగభద్ర ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఎంతో ఆనందింపజేస్తుంది. హంపి పట్టణంలోని దేవాలయాల నిర్మాణానికి గాను విజయనగర రాజులు అక్కడి సమీప కొండల రాళ్ళను చక్కగా చెక్కించి నిర్మించారు.

PC: Jayalakshmi Iyangar

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

దేవాలయాలు, సహజ అందచందాలే కాక అక్కడ అనేక సరస్సులు కూడా ఉన్నాయి. అందమైన భవనాలను నర్మించారు. ఈ పట్టణ నిర్మాణంలో విజయనాగర రాజుల ఎంతో నేర్పరితనం ప్రణాళిక కనపడతాయి. 13 నుండి 15 శతాబ్దాలలోనే ఈ పట్టణంలో అనేక నేటి ఆధునిక నీటి ప్రణాళికా విధానాలు ఆచరించారు.

PC:Rahulkrsna

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

పర్యాటకులకు ఈ పట్టణంలో చూడాలంటే 500 ప్రదేశాలకు పైగా ఉన్నాయి. వాటిలో సుమారు 100 ప్రదేశాలు పర్యాటకులను అమితంగా ప్రతి ఏటా ఆకర్షిస్తున్నాయి. విఠల దేవాలయం వద్ద గల రాతి రధం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విజయనగర రాజుల సాంప్రదాయాలను వెల్లడిస్తూంటుంది. దీనినే రాష్ట్ర టూరిజం శాఖ తన పర్యాటక చిహ్నంగా ఆమోదించింది.

PC:Satyabrata

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

నేటికి హంపి లో పురావస్తు శాఖ తన పరిశోధనలు సాగిస్తూనే ఉంది. ఇక్కడి పురావస్తు మ్యూజియం తప్పక చూడదగినది. తుంగభధ్రా నది ఒక వైపు, మూడు వైపుల కొడలు గల హంపి పట్టణాన్ని విజయనగర రాజులు ఎంతో ప్రణాళికగా తమ రాజ్య రాజధానిగా చేసుకొని పాలించారు. ఈ పట్టణాన్ని జయించటం శత్రురాజులకు అసంభవంగా భావించి వారు దీనిని ఎంపిక చేశారు.

PC:Satyabrata

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

నేడు ఈ కొండ ప్రాంతాలు, చక్కటి నదీ ప్రవాహం పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. దక్షిణ భారత దేశానికి వచ్చిన పర్యాటకులు హోయసల శిల్ప సంపదలకు ప్రధానమైన హంపి పట్టణాన్ని తప్పక దర్శించి తీరాల్సిందే.

PC:SINHA

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

విరూపాక్షదేవాలయంలో శివుడు మాత పంపా దేవి ఉంటారు. ఈ దేవాలయం 9 అంతస్తులు కల 50 మీటర్ల ఎత్తు గోపురం కలిగి ఉంది. హేమకూట హిల్ క్రింది భాగంలో తుంగభద్ర నది దక్షిణ ఒడ్డున కలదు. ఈ దేవాలయం దక్షిణ భారత దేశ ద్రవిడ శిల్ఫశైలి కలిగి ఉంటుంది. దీనిని ఇటుకలు, మోర్టార్ లతో నిర్మించారు. దీనినే పంపాపతి దేవాలయం అని కూడా అంటారు.

PC:Ajayreddykalavalli

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

దీనికి గర్భగుడి, ముఖ మంటపం, మూడు వెనుక గదులు, స్తంభాల హాలు కలవు. విరూపాక్ష దేవాలయం చూసిన తర్వాత పర్యాటకులు అది 7వ శతాబ్దంకు చెందిందని దాని పై చెక్కడాలు 9వ మరియు 11వ శతాబ్దాలనాటివని కనుగొంటారు. మొదట ఈ దేవాలయంలో కొన్ని విగ్రహాలు మాత్రమే ఉండేవి.

PC:The atulgupta

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

తర్వాత మరికొన్ని ప్రతిష్టించారు. క్రీ.శ. 1510 లో క్రిష్ణదేవరాయలు రంగ మండపాన్ని నిర్మించారు. దీనిలో స్తంభాలు, గుడి వంటగది, దీపపు స్తంభాలు, టవర్లు మరియు ఇతర పుణ్య క్షేత్రాలు తర్వాత ఏర్పరచారు. విరూపాక్ష దేవాలయ ప్రధాన ఆకర్షణలు, చెక్కిన జంతువుల బొమ్మలు, హిందూ పురాణాలను చూపే పెయింటింగులు.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

మన నాగరిక యుగంలో ప్రతీ మనిషికి చాలా ఆవశ్యకమైన మానవనిర్మిత సాధనం కేమెరా. మానసికవుల్లాసానికి,సత్య నిరూపణకు మనకి అందుబాటులో వున్న ఏకైక వస్తువు కేమెరా. అలా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎంత చెప్పినాతక్కువే. ఉదాకు న్యాయనిర్ణేత సమయంలో దోషులను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఘనత సిసికెమెరాస్ ది అనటంలో ఎలాంటి సంశయంలేదు.

PC:Rugvedrane17

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

అలాంటి ఛాయా చిత్రకళకు ఆధారభూతమైన ఛాయాచిత్రగ్రాహిణి కేమెరాకు వాడే పిన్ హోల్ కేమెరాటెక్నిక్ ను కనిపెట్టిన ఘనత మన హైందవసాంప్రదాయాన్ని పాటించే పురాతన శాస్త్రవేత్తలదని తెలిసిన తరుణంలో సంభ్రమాశ్చర్యాలతో నోళ్ళువెళ్ళబెట్టడం మనవంతవుతుంది.

PC:Kenyh Cevarom

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

పాశ్చాత్యులు ఈ ప్రక్రియను పిన్ హోల్ కేమెరా టెక్నిక్ గా వర్ణిస్తారు. పిన్ హోల్ కేమెరాకు కేమెరా అప్స్క్యూరా అనే ఇంకొక పేరు కూడా వుందండి. దీన్ని అర్థం చేసుకోవటం చాలా సులువు. మీ చేతిని తీక్షణంగా చూస్తే చెయ్యి మాత్రమే మీకు కనిపిస్తుంది.మామూలుగా చూస్తే దాని చుట్టుప్రక్కల ప్రాంతం కూడా కనిపిస్తుంది.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

దీనినే దృశ్యలోతు విశేషణము.డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని అంటారు. ప్రిన్స్పుల్స్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చాలా ముఖ్యమైనది డెప్త్ ఆఫ్ ఫీల్స్ ఆ సారాన్ని మనవాళ్ళు విరూపాక్షదేవాలయంలో అమర్చి ఆ ఆలయానికి అదొక ముఖ్యాకర్షణ సమస్త సహజాలక్షణం అంటే అట్రాక్షన్ ఆఫ్ ఎంటైటీగా అభివర్ణిస్తారు.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

సాంకేతికపరమైన ఈ విశేషణాన్ని సాధారణభాషలోకి విశేషించటం, వివరించటం చాలా కష్టమైన పని.కానీ కొన్ని ఉదాహరణలద్వారా వాటిని మనం అర్థంచేసుకునే ప్రయత్న చేద్దాం.ఇది ఆవశ్యకమైనది.
ఎందుకంటే సాంకేతికంగా పురోగతిసాధించిన దేశంగా మనల్ని పాశ్చ్యాత్యులు ఎప్పటికి గుర్తించారు.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

దానికి కారణం చారిత్రకవిలువలను మనం తక్కువ దృష్టితో చూట్టం అనేది చాలా బాధాకరమైన విషయం.అందుకే ప్రప్రధమంగా మన వైశిష్ట్యాన్ని మనకు తెలియజెప్పే ఈ శివాలయం గురించి తెలుసుకోవటం హిందూ సనాతనధర్మం పాటించే వారిగా కాకుండా భారతీయులుగా కూడా చాలా ఆవశ్యకం.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

విరూపాక్ష సన్నిధానాన్ని సందర్శించే సమయంలో అక్కడికి వెళ్ళినవారికి మైమరపించేవిషయం ఒక్కటి దర్శనమిస్తుంది.అదే విరూపాక్షమందిర గోపుర బిలదర్శిని. ఇన్వర్టెడ్ ఇమేజస్ ఆఫ్ టెంపుల్ టవర్. 7వ శతాబ్దంలో హంపి తదితర ప్రాంతాన్ని పాలించిన చాళుక్యరాజుల సమయ వ్యవధిలో పునాదిరాయి వేసి నిర్మించిన చిన్న గుడిని ఒక మహాశైవక్షేత్రంగా మార్చిన ఘనత మూరురాయరగండుడు అని సంబోధించే శ్రీకృష్ణ దేవరాయల వంశానికి చెందిన ప్రౌడదేవరాయలదని పురాతత్వశాస్త్రవేత్తల పరిశోధనలో మనకి తెలుస్తోంది.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

విశ్వవిఖ్యాత సైకతశిల్పిగా పేరొందిన లక్కనచేత నిర్మించబడిందని చరిత్రచెబుతోంది. అసలేంటి.ఈ పిన్ హోల్ కేమెరా టెక్నిక్ అదేంటో తెలుసుకుందాం. కాంతిని ఒక రంధ్రంలో నుండి ప్రసరింపచేసి ఇంకోవైపు వచ్చే కాంతిస్వరూపాన్ని చూపించటమే పిన్ హోల్ కెమెరాయొక్క ముఖ్యవుద్దేశ్యం

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

అలా కాంతితేజాలను కాంతి ప్రభావిత గుడ్డముక్క క్లాత్ ఫిల్మ్ మీద ప్రసరింపచేయటమే పిన్ హోల్ టెక్నిక్.రానురాను సాంకేతిక విప్లవం వల్ల జరిగిన మార్పులను ఫైబర్ ఫిల్మ్ గా మార్చుకోగాలిగారు పాశ్చాత్యశాస్త్రవేత్తలు.చివరకు డిజిటల్ ని ఇంప్రింటెడ్ ఇమేజ్ ఫైల్స్ గా ఛాయాచిత్రాలను నేటి కాలంలో వినియోగించుకుంటున్నాం.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఎలాంటి చిత్రానికైనా చాలా ఆవష్యకమైనవి రెండే.1. వెలుగు ఇంకొకటి నీడ.అలా వెలుగు నీడల సంపూర్ణ నిష్పత్తి ఫొటోగ్రాఫిక్ ఇమేజ్ స్టెబ్లైజేషన్ & ఎ బేలన్స్ద్ రిషియోని క్రమబద్దీకరించటమే పిన్ హోల్ కేమెరా యొక్క ముఖ్యకార్యం.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

సాంకేతికపరంగా దీనిని రెక్టిలైనర్ ప్రోపగేషన్ ఆఫ్ లైట్ గా అభివర్ణిస్తారు. అదే మనకు విరూపాక్షదేవాలయంలోని వింతగా అక్కడి వారు చెప్తారు. అలా ఘనప్రాచూర్యం పొందిన ఆ దేవాలయం తాలూకు మాయని దైవలీలగా చెప్పటం ఆధ్యాత్మిక పరంగా సరైందికావచ్చు.కాని ఆ ప్రక్రియలోని శాష్ట్రీయతగురించి అందరికి తెలపటం కూడా ఒక ముఖ్యబాధ్యత అని గమనించాలి.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

హిందూసనాతన ధర్మంయొక్క శాస్త్రప్రవీణ్యం 15వ శతాబ్దంలో కనిపెట్టిన ఈ ప్రక్రియను ఆధారంచేసుకున్న కెమెరాలను మనం ఈరోజు దేశ విదేశాలనుండి వేలు,లక్షలు పోసి కొంటున్నాంఅని మనం గ్రహించాలి.కాంతి ప్రసరించే దూరాన్ని బట్టి అది అవతల వైపు వచ్చే చిత్రంయొక్క క్లారిటీఆధార పడి వుంటుంది. అలాంటి నిష్పత్తిని మానవులు తమ కళ్ళతో చేయటం కష్టమైంది కనుక ప్రైం & జూంలెన్స్ లను కనిపెట్టారు ఇప్పటి సైంటిస్ట్ లు.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

చివరిగా మనకు తెలియాల్సిన విషయంఏంటంటే 15వ దశాబ్దంలో అత్యంత చాకచక్యంగా బ్లూప్రింట్ ఫర్ ఫోటోగ్రాఫికల్ టెక్నిక్ ను అందించిన మన వాళ్ళ ఘనతగురించి ప్రపంచానికి తెలీకపోవటం దురదృష్టకరం.పురాతన లిపుల్లో ఒకటైన చైనాభాషలోని కేమెరా యొక్క ఆవిర్భావం జరగబడిందని ప్రాచూర్యంలో వుంది.కానీ ఇంతటి అమూల్యమైన సంపదను అందించిన భారతీయులకు కీర్తిదక్కకపోవటం చాలా విచారకరం.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఈ సారి విరూపాక్ష సన్నిధానం దర్శానానికి వెళితే స్వయంగా వీక్షించి లోకంమొత్తానికి మన ఘనతను చాటిచెప్పాల్సిందిగా ప్రార్థన.మీ కెమేరాల్లో,స్మార్ట్ ఫోన్లో, ఫోటోలు దిగే సమయంలో విరూపాక్ష దేవాలయ మహోన్నత చరిత్రను గుర్తించి ఇంతటి ప్రతిభాపాటవాలకు నెలవైన ఈ దేశాన్ని ఇంతటి మహోన్నత దేశాన్ని తన చల్లనిచూపుతో కాపాడుతున్న నీలకంటుడ్ని తప్పకుండా గుర్తుచేసుకోండి.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

హంపి పట్టణాన్ని చేరటం ఎలా?

రోడ్డు ప్రయాణం

హంపి పట్టణం రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు ద్వారా అనుసంధానించబడి ఉంది. ప్రభుత్వ బస్సులు మరియు ప్రయివేటు వాహనాలు విరివిగా దొరుకుతాయి.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

రైలు ప్రయాణం

హంపికి రైలు స్టేషన్ లేదు. హోస్పేట్ రైలు స్టేషన్ సుమారు 13 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడినుండి బెంగుళూరు, హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాలకు వెళ్ళవచ్చు. ఈ స్టేషన్ నుండి టాక్సీలు, క్యాబ్ లలో హంపి చేరవచ్చు.

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

విమాన ప్రయాణం

హంపికి దగ్గరి విమానాశ్రయం బెళ్ళారి విమానాశ్రయం. సుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. హంపి నుండి 350 కి.మీ. దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది దేశీయంగాను అంతర్జాతీయంగాను అనేక విమానాలు నడుపుతోంది.

ఇది కూడా చదవండి:

<strong>ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !</strong>ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

<strong>పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !</strong>పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

<strong>సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!</strong>సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X