Search
  • Follow NativePlanet
Share
» »బిక్కవోలు - అద్భుత శిల్పకళ ఆలయాలు !

బిక్కవోలు - అద్భుత శిల్పకళ ఆలయాలు !

By Mohammad

బిక్కవోలు తూర్పు చాళుక్యుల కాలంలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వారనేక మందిరాలను కట్టించారు. ఇక్కడ ఆలయాలన్నీ చక్కని శిల్పకళలతో వర్ధిల్లుతున్నాయి. బిరుదంకితుడనే పేరు గల రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. అతని పేరు మీదే ఈ ప్రాంతాన్ని బిరుదాంకితవోలు గా కాలక్రమేనా బిక్కవోలు గా పిలువబడుతున్నది.

బిక్కవోలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. గోదావరి నది పరవళ్ళు తొక్కే తూర్పు గోదావరి జిల్లలో పచ్చని పంటపొలాలతో ఈ ప్రాంతం అలరారుతున్నది. ఇదొక మండలం. పురాతన జైన శివాలయాలకు, వాటి శిల్ప సంపదకు బిక్కవోలు ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఇక్కడ గల కొన్ని ఆలయాలను సందర్శిస్తే .. !

ఇది కూడా చదవండి : రాజమండ్రి - పర్యాటక ప్రదేశాలు !

శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం

శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం

గోలింగేశ్వర ఆలయం లో చెప్పుకోదగ్గవి గోడలపై చెక్కిన రచనలు. ఇవి ఆలయంలోని గర్భగుడి లో ఉంటాయి. శివ పార్వతుల శిల్పం, కూర్చొని ఉన్న వినాయకుని ప్రతిమ రెండూ శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకలు. ఈ రెండూ ముఖ మండపంలో ఉంటాయి. ఆలయ విమానం ఖజురహో, ఓడిశా శైలిని గుర్తుకు తెస్తుంది.

చిత్ర కృప : ramareddy vogireddy

శ్రీ రాజరాజ ఆలయం

శ్రీ రాజరాజ ఆలయం

శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించారు. మూడు పక్కలా ఉన్న గుళ్ళలో (విగ్రహ మందిరం) ఒక చోట వినాయకుడు, మరోచోట నెమలిపై కూర్చొని ఉన్నకార్తికేయుడు ఉన్నారు. అక్కడే ఇంకో చోట మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు మరియు శ్రీరాజరాజేశ్వరీ సమేతులైన శివలింగాకృతి ఉన్నాయి. ఆలయ శిల్పకళ చూడదగ్గది.

చిత్ర కృప : Adityamadhav83

శ్రీ చంద్రశేఖర స్వామి

శ్రీ చంద్రశేఖర స్వామి

శ్రీ చంద్ర శేఖరస్వామి ఆలయాన్ని కూడా తూర్పు చాళుక్యులు నిర్మించారు. శివలింగానికి నాలుగు ప్రక్కలా అందమైన చంద్రశేఖరస్వామి, బాల త్రిపురసుందరి శిల్పాలున్నాయి. ఇవి యాత్రికులు తప్పక చూడదగినవి.

చిత్ర కృప : Adityamadhav83

ఏకశిలా గణేశుడు

ఏకశిలా గణేశుడు

ఏకశిలా అంటే ఒకే శిల అని అర్థం. 11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది. కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి. ప్రస్తుతం ఇది చెన్నై మ్యూజియంలో ఉన్నది.

చిత్ర కృప : ramareddy vogireddy

మొదటి శివాలయం

మొదటి శివాలయం

బిక్కవోలు శివారులలో ఉన్న శివాలయం మిగిలిన శివాలయాలలాగానే మూడు పక్కల గుళ్ళతో, మకర తోరణాలంకరణతో ఉంది. ఈ శిల్పాలలో ఒక నటరాజమూర్తి చతురభంగిమలో ఉంటాడు. ఇక్కడ కనిపించే మరొక విశేషం - శివుడు లకులీశునిగా దర్శనమిస్తాడు.

చిత్ర కృప : ramareddy vogireddy

రెండవ శివాలయం

రెండవ శివాలయం

పంట పొలాలలలో ఉన్న పెద్ద ఆలయం 2 వ శిలాలయం. ద్వారానికిరువైపులా ద్వారపాలకులు, గుమ్మంపైన లక్ష్మీదేవి విగ్రహాలు తప్ప ఈ ఆలయంలో శిల్పాలు లేకుండా సాదాగా ఉంటుంది.ఆలయం విమానం పల్లవుల కాలపు నిర్మాణశైలిని పోలిఉంటుంది.

చిత్ర కృప : Adityamadhav83

మూడవ శివాలయం

మూడవ శివాలయం

ఈ ఆలయం ద్వారానికిరువైపులా గంగ, యమున నదీదేవతల విగ్రహాలున్నాయి. మందిరం పై భాగంలో మైదునం వంటి పలు భంగిమలు చెక్కబడి ఉన్నాయి. సూర్య, విష్ణు విగ్రహాలు గోలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాలను పోలి ఉంటాయి.

చిత్ర కృప : ramareddy vogireddy

బిక్కవోలు ఎలా చేరుకోవాలి ?

బిక్కవోలు ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

బిక్కవోలు కు సమీపాన 39 కి. మీ ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం (దీనినే మధురపూడి విమానాశ్రయం అంటారు) కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి బిక్కవోలు సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం

బిక్కవోలు లో రైల్వే స్టేషన్ కలదు. కాకినాడ, రాజమండ్రి నుండి రైళ్ళు వస్తుంటాయి అయినప్పటికీ బిక్కవోలు కి 10 కి.మీ ల దూరంలో ఉన్న సామర్ల కోట రైల్వే జంక్షన్ యాత్రికులకు సూచించదగినది. వైజాగ్, విజయవాడ, గుంటూరు, చెన్నై నుండి స్టేషన్ మీదుగా తరచూ రైళ్ళు నడుస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం

రాజమండ్రి, కాకినాడ (31 కి.మీ) నుండి బిక్కవోలు కు తరచూ ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X