Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బస్సుల్లో కాక సొంత వాహనాల్లో లేదా బైక్ ల మీద ఫ్రెండ్స్ తో లేదా ఉద్యోగ సహచరులతో నృత్యగ్రామ్ వెళితే ట్రిప్ ఎంతగానో ఎంజాయ్ చేయవచ్చు.

By Venkatakarunasri

బస్సుల్లో కాక సొంత వాహనాల్లో లేదా బైక్ ల మీద ఫ్రెండ్స్ తో లేదా ఉద్యోగ సహచరులతో నృత్యగ్రామ్ వెళితే ట్రిప్ ఎంతగానో ఎంజాయ్ చేయవచ్చు. మీరు బస్సులోనే వెళితే డైరెక్ట్ నృత్యగ్రామ్ వెళతారు అదే బైక్ ఉండే ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగి ఆకర్షణీయ ప్రదేశాలను తిలకించవచ్చు. బెంగళూరు నుండి నృత్య గ్రామ్ వెళ్ళే దారిలో కనిపించే ఆకర్షణీయ ప్రదేశాలను గమనిస్తే

ఉదయం నుండి సాయంత్రం వరకు తీరికలేకుండా శ్రమ పడుతున్నారా ? ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుంది ..! ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటున్నారా ? లేదా వారాంతంలో ఏదైనా సినిమాకో, షికారు కో వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా ? మీలాంటి వారికోసమే 'నృత్యగ్రామ్' ఉన్నది. నృత్యగ్రామ్ పరిసరాలు ఎంతో కళాత్మకంగా, అద్భుతంగా, చూడముచ్చటగా ఉంటాయి. ఆల్రెడీ చూసేసిన వారికి కూడా ఇది ఒక కొత్త ప్రదేశంగానే కనిపిస్తుంది. ఏదేమైనా 'నృత్యగ్రామ్' గ్రామం తప్పక చూడవలసిన ప్రదేశం. బెంగళూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో, హీసర ఘట్ట గ్రామానికి చేరువలో ఈ గ్రామం ఉన్నది. బెంగళూరు నుండి ప్రతి ఒక్కరూ సులభంగా నృత్యగ్రామ్ చేరుకోవచ్చు. ఆవిధమైన రవాణా సౌకర్యాలు నగరం నుండి కల్పిస్తున్నారు.

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

నృత్యగ్రామ్ ఎలా చేరుకోవాలి ?

నృత్యగ్రామ్ సమీపాన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (45 కి.మీ) కలదు. రైళ్ళలో వచ్చే వారు 30 కి.మీ ల దూరంలో ఉన్న బెంగళూరు రైల్వే స్టేషన్ లేదా యశ్వంతపూర్ రైల్వే జంక్షన్ లలో దిగి, మెజెస్టిక్ వచ్చి బస్సు ఎక్కవచ్చు. మెజెస్టిక్ నుండి నృత్యగ్రామ్ కు ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు(డీలక్ష్ మరియు లగ్జరీ బస్సులు) అందుబాటులో ఉంటాయి. గంట లేదా గంటన్నార ప్రయాణ సమయంగా ఉంటుంది.

చిత్ర కృప : Alagu

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

నృత్య గ్రామ్ ఎప్పుడు వెళ్ళాలి ?

సోమవారం మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో నృత్యగ్రామ్ మూసేస్తారు. సోమవారం తప్పనిచ్చి మిగితా రోజుల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుస్తారు.

చిత్ర కృప : Tim Schapker

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బెంగళూరు నగరంలో చూసిన ప్రదేశాలనే చూసి చూసి విసిగెత్తిపొయిన వారికి నృత్యగ్రామ్ టూర్ చక్కటి వినిదాన్ని పంచుతుంది. ఈ డ్రైవ్ లో మీరు నెమలి స్యాంక్చురీ, హీసరఘట్ట సరస్సు ను చూడవచ్చు.

చిత్ర కృప : Shalini Satish

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బెంగళూరు వాతావరణానికి అలవాటుపడ్డ వారికి ఈ టూర్ రిలాక్స్ ఇస్తుంది. దారి పొడవునా వైన్ యార్డ్ లు, పక్షులు, అడవులు , పచ్చని పంటపొలాలు, నార పట్టుకొని బయలు దేరే రైతులు, ఎద్దుల బండీ లు .. మొత్తంగా కోనసీమ వాతావరణం తలపిస్తుంది.

చిత్ర కృప : Art of Bicycle Trips

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బయల్ కెరె మరియు హీసరఘట్ట, బెంగళూరు నగరానికి వాయువ్య భాగంలో ఉంటాయి. బయల్ కెరె యశ్వంతాపూర్ కు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యశ్వంతపూర్ సర్కిల్ కు వెళ్లి అక్కడి నుంచి మతికెరె వైపు ప్రయానించండి.

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

పాత BEL ఫ్లై ఓవర్ మీదుగా ప్రయాణిస్తూ ముందుకు వెళితే జలహ్హలి (తూర్పు), వినాయక్ నగర్, దొడ్డ బయల్ కెరె వస్తుంది. బయల్ కెరె కు హీసరఘట్ట కు మధ్య దూరం 15 కిలోమీటర్లు.

చిత్ర కృప : Kiran Reddy

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బైక్ జర్నీ లో గుర్తొచ్చే అనుభవాలు

బయల్ కెరె నుండి హీసరఘట్ట కు వెళుతున్న మార్గంలో తమ్మరాసనహళ్లి, సిల్వెపుర అనే మరో రెండు గ్రామాలు కనపడతాయి. హీసరఘట్ట సరస్సు నుండి నృత్య గ్రామ్ వెళ్ళే అన్ని మార్గాలలో డైరెక్షన్స్ ఉంటాయి. అవి అనుసరిస్తూ సులభంగా చేరుకోవచ్చు .

చిత్ర కృప : Wendy North

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

ట్రావెల్ టిప్స్

ఉదయం 5 : 30 గంటల సమయంలో ప్రయాణం మొదలు పెడితే, 6:30 కల్లా బయల్ కెరె లోని బర్డ్ స్యాంక్చురీ చేరుకోవచ్చు. అటవీ అధికారుల అనుమతి తీసుకొని స్యాంక్చురీ లోని అనేక పక్షులను చూడవచ్చు. మీకు సమయం లేకపోతే బయటి వైపు నుండి కూడా ఒక లుక్ వేయవవచ్చు. అంతేకాదు ఇక్కడ నెమలి అరుపులను, పురివిప్పి నాట్యం చేసే దృశ్యాలను తిలకించవచ్చు.

చిత్ర కృప : Paul Williams

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

ఉదయం అల్పాహారం

అల్పాహారం వెంట తీసుకొని వెళ్తే ఏదైనా దారిలో చెట్టు నీడలో లేదా అరుగు మీద కూర్చొని తినవచ్చు. రోడ్ బాగానే ఉంటుంది కానీ సింగల్ రోడ్. ఎదురుగా వాహనాలు వస్తుంటాయి జాగ్రతా ..! తాజ్ కుటీర్ అనే హోటల్ ఈ మార్గంలో ఉన్న డీసెంట్ హోటల్.

చిత్ర కృప : Abhijith Rao

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

హెచ్ ఎం టి ఫ్యాక్టరీ

జలహళ్లి వద్ద హెచ్ ఎం టి ఫ్యాక్టరీ ఉన్నది. ఇక్కడ చేతి గడియారాలను తయారుచేస్తారు. బస్ స్టాప్ దగ్గర ఉన్న హెచ్ ఎం టి షో రూం లో క్లాసిక్ వాచ్ లను కొనుగోలు చేసుకోవచ్చు. వాచ్ చూసినప్పుడల్లా మీకు టూర్ సన్నివేశాలు కళ్ళముందర గుర్తుకువస్తాయి. పాత వాచ్ ల మీద 40 % డిస్కౌంట్ కూడా ఇస్తారు.

చిత్ర కృప : Matthew Wild

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

హీసరఘట్ట సరస్సు

హీసరఘట్ట సరస్సు ను తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. ఈ ప్రదేశంలో వివిధ జాతులకు చెందిన పక్షులు కింగ్ ఫిషన్, మైనా, పుర్పుల్ సన్ బర్డ్స్ మొదలైనవి విహరిస్తుంటాయి. ఎండా కాలంలో సరస్సు లో నీళ్ళు అంతగా కనిపించవు కానీ మాన్సూన్/ వర్షాకాలంలో నిండుగా కనిపిస్తాయి.

చిత్ర కృప : balakrishna menon

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

పంట పొలాలు

ఉదయాన్నే ఇంటిముందు కలాపిలు చల్లింటారు. ముగ్గులు వేసింటారు. గడ్డపార, నాగలి పట్టుకొని రైతులు పొలాలకు వెళుతుంటారు. ఎద్దులు, ఆవులు, పక్షులు ... మొత్తంగా అచ్చమైన పల్లెటూరు ను గుర్తుకుతెస్తాయి అక్కడి ప్రకృతి అందాలు.

చిత్ర కృప : frozen stills

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

ఆదర్శ్ టివి మరియు ఫిలిం ఇన్స్టిట్యూట్

హీసరఘట్ట నుండి నృత్యగ్రామ్ వెళ్ళే దారిలో ఆదర్శ్ టివి మరియు ఫిలిం ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది. దీనిని 1973 వ సంవత్సరంలో బి ఆర్ పి స్వామి నాగేంద్ర రావు సహకారంతో కట్టించారు. అది నటీనటులను తయారు చేసే ఒక వేదిక. యాక్టింగ్, ప్లే బ్యాక్ సింగింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ లు ఇక్కడ నేర్పిస్తారు.

చిత్ర కృప : adarshafilminstitute.com

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

నృత్యగ్రామ్

నృత్యగ్రామ్ గ్రామం ప్రసిద్ధ ఒడిస్సి నృత్యకారిణి ప్రతిమా బేడి చే స్ధాపించబడింది. ప్రాచీన గురుకుల సంప్రదాయ రీతిలో నృత్యాన్ని బోధించాలనే మంచి ఆలోచనతో ఆమె ఈ గ్రామాన్ని స్ధాపించింది.

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?

నృత్య గ్రామ్ డాన్స్ స్కూల్

నృత్యగ్రామ్ లో బోధించే నాట్యాలు భరత నాట్యం, కూచిపూడి, మణిపురి, కథాకళి వంటి భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. నాట్య తరగతులను వారానికి 6 రోజులపాటు ప్రతి రోజూ 8 గంటలు నేర్పిస్తారు. ఆదివారం పూట లోకల్ విలేజ్ పిల్లలకు స్పెషల్ తరగతులు నిర్వహిస్తారు.

చిత్ర కృప : Yogesh Balasubramanian

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X