Search
  • Follow NativePlanet
Share
» »కొచ్చిన్... అరేబియా సముద్రపు రాణి

కొచ్చిన్... అరేబియా సముద్రపు రాణి

భారత దేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేవు పట్టణమైన కొచ్చిన్ ఎర్నాకుళం జిల్లాలో(కేరళ రాష్ట్రం) ఉంది.అరేబియన్ సముద్రాన్ని తన ఒడిలో భాగంగా చేసుకున్న అద్భుతమైన నగరం!.ఇప్పటికి కూడా, ఈ నగరం ఎంతో మంది పర్యాటకులని ఆకర్షించే ముఖ్య పర్యాటక ప్రదేశంగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. విభిన్న మనుషుల అభిరుచులకు మరియు అవసరాలకు తగ్గట్టు ప్రాచిన మరియు పాశ్చాత్య కలయికల మిశ్రమమే ఈ నగరం. భారత దేశపు సంస్కృతి, పాశ్చాత్య ప్రభావాల మధురమైన కలయికగా కొచ్చిన్ నగరాన్ని చెప్పొచ్చు.

అత్యుత్తమ సాంస్కృతిక చరిత్ర

కొచ్చిన్, ప్రతి ఒక్కరికి ఎదో ఒక మధుర అనుభూతిని అందిస్తుంది. 14 వ శతాబ్దం లో కొచ్చిన్ నగరం ప్రాముఖ్యతలోకి వచ్చిందని చరిత్ర చెబుతుంది. అప్పటినుండి, చారిత్రక పుస్తకాలలో ఈ రేవు పట్టణం గురించి పర్యాటకులు ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఆహార పదార్ధాల వ్యాపారానికి, ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు మరియు మూలికల వ్యాపారంలో ఈ పట్టణం పేరెన్నిక కలది. యూదులు, చైనీయులు, గ్రీకులు, అరబ్బులు, పోర్చుగీసులు, మరియు రోమన్ వర్తకులు సుగంధ ద్రవ్యాలని కొనడానికి ఈ పట్టణానికి వచ్చేవారు. దాని ఫలితంగా, వివిధ సంస్కృతుల పద్ధతులు ఇక్కడి స్థానిక ప్రజల జీవన విధానంలో విలీనం అయ్యాయి.

ఇక భోజన ప్రియులకు అంటారా?

ఈ నగరంలో పనిచేసే తినుబండార కేంద్రాల సంఖ్య పర్యాటకులని ఆశ్చర్య పరిచే ఒక అంశం. ప్రతిఒక్కరికీ నోరూరించేలా అద్బుతమైన పదార్ధాలని ఇక్కడి రెస్టారెంట్లు మరియు హోటళ్ళు అందిస్తాయి. ప్రపంచంలోని ఏ మూల నుంచి మీరు వచ్చినా మీ దేశంలో లభించే స్థానిక వంటకాల రుచి కొచ్చి మీకు అందిస్తుంది. అదే కొచ్చి ప్రత్యేకత!. అయితే, కొచ్చి కి వచ్చి కేరళ వంటకాల రుచి చూడడానికి ప్రయత్నించకపోవటం అనేది మీ జీవితంలో ఆనందాన్ని కోల్పొతున్నట్లే!! శాఖాహార మరియు మాంసాహార రుచికరమైన పదార్ధాలను స్థానిక వంట మనుషులు నోరూరించే విధంగా రుచికరంగా తయారుచేస్తారు. మీరు కొచ్చిని సందర్శించినప్పుడు అరటి ఆకులో చుట్టిన చేపల వంటకాన్ని రుచి చూడడం మరచిపోకండి సుమా!!!

చేరాయి బీచ్

చేరాయి బీచ్

కొచ్చిన్ లో ఉన్న ప్రముఖ బీచ్ లలో చేరాయి బీచ్ ఒకటి. ఇది కొచ్చికీ 25 కి మీ ల దూరం లో ఉంది. వైపిన్ ద్వీపం లో ఈ బీచ్ ఉంది . మనోహరమైన సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి ఆనందించేందుకు ఈ బీచ్ కి ఏంతో మంది పర్యాటకులు మరియు స్థానికులు తరలివస్తారు. రోడ్డు మరియు సముద్ర మార్గం ద్వారా ఈ బీచ్ కి చేరుకోవచ్చు. అద్బుతమైన సీ ఫుడ్ ని అందించే ఎన్నో హోటల్లు మరియు రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయి. తాజా సీ ఫుడ్ ని అమ్మే చిన్న చిన్న కోట్లు చాలానే ఉన్నాయి. మీకు నచ్చిన చేపలు, రొయ్యలు లేదా పీతలు ఎంచుకుని మీకు నచ్చిన రెస్టారెంట్ లో వండటానికి ఆర్డర్ ఇచ్చి తిని ఆనందించే అవకాశం కూడా కలదు.

Photo Courtesy: Soman

ఫోర్టు కొచ్చి

ఫోర్టు కొచ్చి

కొచ్చి లోని అంతర్గత ప్రాంతం ఫోర్టు కొచ్చి. చరిత్ర, కళ , ఆహారం మరియు ఆధ్యాత్మిక పరంగా ఈ ప్రదేశం పర్యాటకులకి ఏంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కాలినడకన లేదా సైకిల్ లేదా ద్విచక్ర వాహనాల ద్వారా ఈ ప్రదేశాన్ని అత్యుత్తమంగా అన్వేషించవచ్చు, ఆస్వాదించవచ్చండోయ్! సైకిల్లు లేదా ద్విచక్ర వాహనాలు ఇక్కడ అద్దెకి లభిస్తాయి. మ్యూజియంలు, ప్యాలెస్ లు, ఆరాధన ప్రాంతాలు, హిందువుల కోవెలలు, చర్చిలు, హెరిటేజ్ భవనాలు, ఆర్టు గ్యాలెరీలు, పార్కులు, బీచ్, ఆయుర్వేదిక్ మసాజులు, రహదారి పక్కన ఉండే కాఫీ షాపులు మరియు స్మ్రుతి చిహ్నముల వంటి విశేషాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. చక్కని పర్యాటక అనుభూతి కొరకు స్థానిక ప్రజలు పర్యాటకులకి హోంస్టే సౌకర్యం కూడా కలిగిస్తారు.

Photo Courtesy: Manucherian

ఫోర్టు కొచ్చి బీచ్

ఫోర్టు కొచ్చి బీచ్

కొచ్చి బీచ్ ని ఫోర్టు కొచ్చి బీచ్ అని కూడా అంటారు. ఇసుక తీరంలో, విరామ సమయంలో ఆహ్లాదంగా గడపడానికి అనువైన ప్రదేశం కొచ్చి బీచ్. ప్రధాన నగరమైన కొచ్చి కి 12 కి మీ ల దూరంలో ఈ బీచ్ ఉంది. బీచ్ మరియు ప్రశాంతమైన పరిసర ప్రాంతాలు సందర్శకులకి మధురానుభూతుల్ని కలిగిస్తాయి.సమీపంలో ఉన్న ఫోర్టు ఈ బీచ్ కి ఉన్న ప్రధాన ఆకర్షణ. సంవత్సరానికి ఒక సారి సముద్ర తీరం లో జరిగే కొచ్చి బీచ్ ఫెస్టివల్సు కి వేదిక ఈ కొచ్చి బీచ్. వందలకొద్దీ పర్యాటకులని అలాగే స్థానికులనీ ఆకర్షించే కొచ్చి బీచ్ ఫెస్టివల్సు ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో జరుగుతాయి. హాలిడే కోసం లేదా నీళ్ళలో ఆడే ఆటల కోసం విచ్చేసే వారికి సాయంత్రం పూట ఈ బీచ్ అనువైన ప్రదేశం.

Photo Courtesy: Challiyan

మంగళ వనం బర్డు సాంచురి

మంగళ వనం బర్డు సాంచురి

పక్షి ప్రేమికులకి, పక్షుల మీద పరిశోధనలు చేసేవారికి మరియు పర్యాటకులని ఆకట్టుకునే ప్రదేశం మంగళ వనం బర్డు సాంచురి. ఈ బర్డు సాంచురి ఎర్నాకుళం లో ఉన్న హై కోర్టు భవనం పక్కనే ఉంది. వివిధ రకాల పక్షులు మనకి ఈ సాంచురి లో తారసపడతాయి.అరుదైన వలస వచ్చిన పక్షులు మరియు స్థానిక పక్షులను మనం ఇక్కడ గమనించవచ్చు. వివిధ రకాల అరుదైన పక్షుల వల్లే కాకుండా ఈ సాంచురి లో ఉన్న ఎన్నో రకాల ప్రత్యేకమైన మొక్కలు మరియు జంతువుల వల్ల కూడా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఎప్పుడూ తడిగా పట్టులా ఉండే ఆకుపచ్చని నేల, అరుదైన జాతి పక్షులు మరియు చెట్ల వల్ల దీనిని ఎర్నాకుళం యొక్క ఆకుపచ్చని శ్వాసకోస గా పరిగణించవచ్చు. అరుదైన వలస పక్షులని చూడడానికి జనవరి నుండి మార్చి ప్రారంభం వరకు ఈ సాంచురిని సందర్శించేందుకు అనువైన సమయం.

Photo Courtesy: Lee2008

శాంతా క్రూజ్ కేథడ్రల్ బసిలికా

శాంతా క్రూజ్ కేథడ్రల్ బసిలికా

కొచ్చి పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా శాంతా క్రూజ్ కేథడ్రల్ బసిలికా ని చెప్పుకోవచ్చును. ఎందుకంటే భారత దేశంలోని మొట్ట మొదటి చర్చిలలో ఒకటిగా ఉంది. దేశం లో ఉన్న ఎనిమిది బాసిలికా లలో ఇది ఒకటి. భారత పురావస్తు శాఖ వారు ఈ చర్చి మరియు ఈ హెరిటేజ్ భవనం యొక్క వాస్తవికతను కాపాడడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాథలిక్ భవనాలని కూల్చి వేసిన డచ్ వారి చేతిలోంచి రక్షింపబడిన కొన్ని భవనాలలో ఈ భవనం కూడా ఉంది. ఈ భవనం లో ఉన్న కాన్వాస్ చిత్రాలు మరియు గోడలపై చిత్రింపబడిన చిత్రాలు క్రీస్తు పుట్టుక మరియు మరణానికి సంబంధించిన కథలు వివరిస్తాయి. చివరి సప్పర్ గురించి వివరించబడిన చిత్రం ఈ చర్చి కి ప్రధాన ఆకర్షణ.

Photo Courtesy: Jamshedgill

వెల్లింగ్టన్ ఐలాండ్

వెల్లింగ్టన్ ఐలాండ్

కొచ్చి నగరంలోకి వచ్చే ఒక ప్రాంతం వెల్లింగ్టన్ ఐలాండ్. నేడు ఈ ద్వీపం కొచ్చిసరస్సు లోని భూభాగం మీద నెలకొని ఉంది. సరస్సులో కొంత భాగాన్ని ఇసుకతో నింపి ఈ ఐలాండ్ ని సృష్టించడానికి ఏంతో కృషి చేసారు. ఈ ప్రాంతం కొచ్చిలో ని ఓడరేవులో చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశం అవ్వటం వల్ల ప్రాముఖ్యత సంతరించుకుంది.కొచ్చి, భారత సైన్యానికి నావికాదళ స్థావరం అవడం కూడా వెల్లింగ్టన్ ఐలాండ్ ప్రాముఖ్యతను పెంచుతుంది. ఈ ఐలాండ్ 1936 లో వెంబనంద్ సరస్సు పై నిర్మించారు. తాజ్ మలబార్ వంటి ప్రసిద్డ్డ మైన హోటల్లు ఎన్నో వెల్లింగ్టన్ ఐలాండ్ లో ఉన్నాయి. ద్వీపంలోని సుందరమైన ప్రాంతంలో సముద్రం ముఖద్వారం వద్ద నిర్మించిన స్విమ్మింగ్ పూల్ సౌలభ్యం ఈ హోటల్లో ఉంది.

Photo Courtesy: Ranjithsiji

సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి

సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి

1503 లో నిర్మించబడిన సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి భారత దేశంలో మొట్టమొదటి యూరోపెయన్ చర్చి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామా కి ఈ చర్చి కి ఒక సంబంధం ఉంది. వాస్కోడి గామా ఈ చర్చి లో నే తన తుది శ్వాస విడిచారు. 14 సం. తర్వాత ఇతని శరీరాన్ని లిస్బన్ కి పంపించారు. ఈ చర్చి ని మొదట్లో చెక్కతో తయారు చేశారు. 1506 లో ఫ్రాన్సిస్కన్ పకీరులచే ఈ చర్చి రాతి సున్నంతో, ఇటుకలతో పునర్నిర్మాణం చేప్పట్టారు.

Photo Courtesy: Drajay1976

బోల్ ఘట్టి ప్యాలెస్

బోల్ ఘట్టి ప్యాలెస్

కొచ్చి కి ఒక వైపున ఉండే బోల్ ఘట్టి ద్వీపం లో బోల్ ఘట్టి ప్యాలెస్ నెలకొని ఉంది. 1744 లో డచ్ వారు దీనిని రూపొందించారు.ప్యాలెస్ నిర్మాణం తర్వాత చుట్టూ పెంచిన పచ్చని తోటలు మరియు లాన్ ఈ ప్యాలెస్ కి పరిపూర్ణత కలిగించాయి. పర్యాటకులు ప్యాలెస్ కిటికీల నుండి రమణీయ ప్రకృతి దృశ్యాలు, మృదువుగా ప్రవహించే అరేబియన్ సముద్ర అందాలు తిలకిస్తూ ఆహ్లాదంగా గడపొచ్చు.విలాసవంతమైన హోటల్ మరియు రిసార్టు గా ఈ ప్యాలెస్ ప్రస్తుతం పర్యాటకులని ఆకర్షిస్తోంది.ఆయుర్వేదిక్ మసాజు కేంద్రాలు, గోల్ఫు కోర్సు లు మరియు స్విమ్మింగ్ పూల్ సౌలభ్యాలు ఈ ప్యాలెస్ లో కలవు.

Photo Courtesy: Ranjithsiji

చైనీస్ ఫిషింగ్ నెట్ లు

చైనీస్ ఫిషింగ్ నెట్ లు

చైనా నుండి చైనీస్ ఫిషింగ్ నెట్ లు వాడకం ఉద్భవించింది. అందుకే వీటికి ఈ పేరు. జెంగ్ హి అనే చైనీస్ పర్యాటకుడు వీటిని కొచ్చిలో మొట్ట మొదటగా ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఉండే అన్ని చైనీస్ నెట్ లు లో ఉన్న ఏకైక పోలిక ఏంటంటే, ఇవన్ని సగానికి పైగా గాలిలో ఉయల వలే వేలాడదీయబడి ఉంటాయి. వెదురు లేదా టేకు కలపలతో చేసిన స్థంబాలకు ఈ వలలు వేలాడదీయబడి ఉంటాయి. ఈ ఫిషింగ్ నెట్ లని ఉపయోగించి చేపలు పట్టడానికి కనీసం ఆరుగురు వ్యక్తులు అవసరం. వీటితో చేపలు పట్టేందుకు సరదాగా పర్యాటకులు కూడా ఉత్సాహం కనపరుస్తారు. కేవలం ఈ చైనీస్ ఫిషింగ్ నెట్ లకి ఆకర్షించబడి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారంటే అతిశయోక్తి కలగక మానదు!

Photo Courtesy: Brian Snelson

ఎర్నాకుళ తప్పన్ దేవాలయం

ఎర్నాకుళ తప్పన్ దేవాలయం

ఎర్నాకుళ తప్పన్ దేవాలయం ఒక శివ దేవాలయం. గుడి పడమటి దిశగా తిరిగి ఉంటుంది. కేరళ శిల్ప శైలిలో నిర్మించారు. జనవరి, ఫిబ్రవరి నెలలలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలలో చక్కగా అలంకరించిన ఏనుగులను వినియోగిస్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా యాత్రికులు వస్తారు. రోడ్డు మార్గంలో ఈ దేవాలయం తేలికగా చేరవచ్చు.

Photo Courtesy: Aruna

హిల్ ప్యాలెస్ మ్యూజియం

హిల్ ప్యాలెస్ మ్యూజియం

రాష్ట్రంలో ని అతి పెద్ద పురావస్తు మ్యూజీయంగా ఈ హిల్ ప్యాలెస్ కి విలక్షణమైన స్థానం ఉంది. కొచ్చి లోని ఒక ప్రాంతమైన త్రిపునితుర లో ఈ ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ ని 1865 లో నిర్మించిన తర్వాత కొచ్చి ని పరిపాలించిన రాజులు పరిపాలన కార్యాలయంగా ఉపయోగించేవారు. ఈ కాంప్లెక్సు లో ఒక పురావస్తు మ్యూజియం, పిల్లల పార్కు, జింకల పార్కు, ప్రీ హిస్టారిక్ పార్కు మరియు చారిత్రక మ్యూజియం ఉన్నాయి. వీటితో పాటు, కొన్ని అరుదైన సుగంధ ద్రవ్యాల మొక్కలు మరియు మూళికలు ఈ కాంపౌండ్ లో పెంచుతున్నారు.

Photo Courtesy: Gokulvarmank

జ్యూ టౌన్

జ్యూ టౌన్

జ్యూ టౌన్ తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం. అంతే కాదు, భారత దేశం లో మిగతా నగరాలలో కన్నా ఎక్కువగా యూదులు ఇక్కడ నివసించడం వల్ల కొచ్చి నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.డచ్ ప్యాలెస్, పరదేశి సినాగోగ్యు గా ప్రసిద్ది చెందిన యూదుల పురాతన ప్రార్ధనా మందిరం జ్యూ టౌన్ లో ని ప్రధాన ఆకర్షణలు. ఈ టౌన్షిప్ వీధులలోని షాపులలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వ్యాపారం సాగుతుంది. ఒకప్పటి యూదుల వైభవానికి ప్రతినిధిగా వీధులలో వలస భవనాలపై ఇప్పటికీ జ్యూయిష్ పేర్లు కనబడుతాయి. ఈ నగరంలోని షాపులలో అద్భుతమైన ఆభరణాలు, ప్రాచిన కళాఖండాలు వంటివి ఎన్నో లభిస్తాయి. షాపింగ్ చేయడానికి అనువైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు.

Photo Courtesy: Wouter Hagens

మెరైన్ డ్రైవ్

మెరైన్ డ్రైవ్

ముంబై లో ఉండే డ్రైవ్ ఆధారంగా కొచ్చి లో మెరైన్ డ్రైవ్ ని నిర్మించారు. కొచ్చి లో ని బ్యాక్ వాటర్ అందాలని పరిపూర్ణంగా వీక్షించేందుకు అవకాశం మెరైన్ డ్రైవ్ ద్వారా లభిస్తుంది. సముద్రపు అందాలని కాలుష్యరహిత వీక్షణ ద్వారా అందించడం వల్ల ఈ ప్రదేశం పర్యాటకులకి మరియు స్థానికులకి ఏంతో ఇష్టమైన ప్రదేశం.ఆదివారం సాయంత్రాలు సూర్యాస్తమయాన్ని చూసి ఆనందించడం కోసం ఏంతో మంది ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తారు. ఈ మెరైన్ డ్రైవ్ కి ఆర్ధికపరంగా కూడా ప్రాముఖ్యత ఉంది. అనూహ్యమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతి కోసం ఎన్నో మాల్సు ఈ మెరైన్ డ్రైవ్ కి సమీపంలో ఉన్నాయి. వివిధ రకాల వంటకాల రుచులని అందించే ఫాస్టు ఫుడ్ సెంటర్ లు కూడా దారి పొడవునా కనిపిస్తాయి.మెరైన్ డ్రైవ్ కి అతి సమీపంలో ఉన్న ఎం జి రోడ్ లో ఎన్నో మంచి రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనది కయీస్ బిర్యానీ సెంటర్. ఇక్కడి బిర్యాని రుచి చూడకపోతే కొచ్చి సందర్శన పరిపూర్ణం కానట్టే!!. మటన్ కర్రీ తో చికెన్ బిర్యానీ ని ఆర్డర్ చేసి తినండి. ఒక అనుభూతిని మిస్ కాకుండా ఉంటారు.

Photo Courtesy: Attokaran

మట్టన్చేరి ప్యాలెస్

మట్టన్చేరి ప్యాలెస్

ఫోర్టు కొచ్చి లో ఉన్న మట్టన్చేరి ప్యాలెస్ ని డచ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. కొచ్చిని ఇల్లుగా చేసుకున్న విభిన్న సంస్కృతుల సంపన్న కలయిక ని ఈ ప్యాలెస్ ప్రతిబింబిస్తుంది. పోర్చుగీసులచే క్రీ.శ. 1555 లో ఈ ప్యాలెస్ నిర్మింపబడినది . ప్రస్తుతం కేరళ సంస్కృతిని,కళలని ప్రదర్శించే మ్యూజియం గా ఈ ప్యాలెస్ ని భావించవచ్చు. ప్యాలెస్ గోడలపైన చిత్రింపబడిన చిత్రాలు హిందూ దేవుళ్ళ మరియు దేవతల పౌరాణిక కథలను వర్ణించేవిగా ఉంటాయి.

Photo Courtesy: Mark Hills

సెయింట్ మేరీ కేథడ్రాల్ బసిలికా

సెయింట్ మేరీ కేథడ్రాల్ బసిలికా

కేరళలో ఉన్న అతి పురాతన చర్చిలలో సెయింట్ మేరీ కేథడ్రల్ బసిలికా ఒకటి. క్రీ.శ. 112 లో ఈ చర్చి ని కట్టారు. అయితే 20 వ శతాబ్దంలో మార్ లూయిస్ పజ్హేపరంబిల్ మార్గదర్శకత్వం తో ఈ చర్చిని పునర్నిర్మించారు. 1974 మార్చి 20 న ఈ కేథడ్రాల్ కి బసిలికా హోదాని పోప్ పాల్ VI కల్పించారు. మేరీ భక్తులు ఎందరికో ఈ ప్రాంతం గొప్పదైన ఆధ్యాత్మిక ప్రాంతం.రోమన్ బసిలికా శైలి లో ఈ కేథడ్రల్ ని నిర్మించారు. తరతరాల నిర్మాణకళ చరిత్రలో ఇది ఒక అద్భుతం. చర్చి ని సందర్శించడానికి వచ్చిన వారు, కొవ్వొత్తులు వెలిగించడానికి అనుమతి ఉంది. ఎర్నాకుళం కి సమీపంలో ఉండడం వల్ల ఈ చర్చి కి రోడ్డు మార్గం ద్వారా సులభం గా చేరుకొనవచ్చును.

Photo Courtesy: Matt

విమానాశ్రయం

విమానాశ్రయం

కొచ్చిన్ లో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం ఉంది. ముంబాయి, చండీఘడ్, ఢిల్లీ, హైదరాబాదు బెంగళూర్ వంటి ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఇక్కడ నుండి నిరంతరం విమానాలు ఉన్నాయి.

Photo Courtesy: Sangfroid

రైలు స్టేషన్

రైలు స్టేషన్

కొచ్చిన్ కి ఎర్నాకులం జంక్షన్ ప్రధాన రైలు స్టేషన్.ఇక్కడి నుంచి ప్రధాన నగరాలకు రైలు సదుపాయం కలదు.

Photo Courtesy: Sreejithk2000

రోడ్డు మార్గం

రోడ్డు మార్గం

కొచ్చిన్ కు రోడ్డు మార్గం ఎంతో సులువైనది. ప్రభుత్వ బస్సులు తరచుగా దొరుకుతాయి. బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం మరియు హైదరాబాద్ నగరాలనుండి కూడా బస్సులు కలవు.

Photo Courtesy: Rash9745

ఆహ్లాదకరమైన ప్రకృతి

ఆహ్లాదకరమైన ప్రకృతి

మనోహరమైన కొచ్చి వాతావరణం ఈ పట్టణాన్ని సందర్శించేందుకు ఎప్పుడైనా అనువైనది. కానీ, మే నెలలో ఎండలు, ఆగష్టు, సెప్టెంబర్ ల లో ఋతుపవనాలు మీకు కొంచెం ఆశాభంగం కలిగించవచ్చు. కాబట్టి, జనవరి నుండి ఏప్రిల్ వరకు మళ్లీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కేరళ ని సందర్శించేందుకు అనువైన సమయం,సందర్భం కూడానూ..

Photo Courtesy: Sanif

వసతి సదుపాయం

వసతికి ఎటువంటి ఇబ్బందులూ లేనందువల్ల మీ బడ్జెట్ కి తగిన విధంగా హోటల్లు మీరు ఎంచుకోవచ్చు. కొచ్చి లో ఇటివల కాలంలో స్థానిక ప్రజల జీవన విధానం తెలుసుకునేందుకు హోంస్టేస్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X