Search
  • Follow NativePlanet
Share
» »వరంగల్ - చరిత్ర కల భూమి !

వరంగల్ - చరిత్ర కల భూమి !

వరంగల్ ప్రదేశం తెలంగాణా రాష్ట్రంలో ఒక జిల్లా. పురాతన కాలంలో వరంగల్ ను ఓరుగల్లు లేదా ఒంటి కొండ అని పిలిచే వారు. దీనికి కారణం ఒకే రాతిలో వున్న కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. ఇది కాకతీయుల రాజ్యానికి రాజధానిగా వుండేది. ఈ ప్రాంతం అంతా అనేక శిధిలాలు కలవు. వరంగల్ లో చూసేందుకు అనేక ప్రదేశాలు కలవు. వాటిలో వరంగల్ కోట ప్రధానమైనది. ఈ కోట గురించి మార్కో పోలో తన ట్రావెల్ డైరీ లో కూడా పేర్కొన్నాడు. పాకాల సరస్సు, వేయి స్తంభాల దేవాలయం, రాక్ గార్డెన్ వంటివి కూడా ఇక్కడ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షనలే.

వరంగల్ ఎలా చేరాలి ?

వరంగల్ ఎలా చేరాలి ?

విమాన ప్రయాణం

వరంగల్ కు సమీప విమానాశ్రయం హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారు 163 కి. మీ. ల దూరంలో కలదు. ఇండియా లోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడ నుండి విమానాలు నడుస్తాయి.
ట్రైన్ ప్రయాణం
వరంగల్ లో రైలు స్టేషన్ కలదు. ఇక్కడ నుండి ప్రధాన నగరాలకు రైలు సేవలు కలవు. ఇతర రాష్ట్రాలైన కర్నాటక, చెన్నై, ముంబై , న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల రైళ్ళు కూడా వరంగల్ జంక్షన్ నుండి ప్రయాణిస్తాయి.
రోడ్డు ప్రయాణం :
తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బస్సు లు, ఇతర ప్రైవేటు వాహనాలు వరంగల్ కు తరచుగా లభిస్తాయి.
Photo Courtesy: ShashiBellamkonda

పాకాల సరస్సు

పాకాల సరస్సు

వరంగల్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణ పాకాల సరస్సు. ఇది ఒక కృత్రిమ సరస్సు ఇది ఒక సాన్క్చురి లో నిర్మించారు. సుమారు 30 చ. కి. మీ. ల విస్తీర్ణం కలిగి వుంటుంది. ఈ సరస్సు వద్ద ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా వుంటాయి. ఆహ్లాదకర వాతావరణం కనుక టూరిస్ట్ లు పూర్తి ఆనందం అనుభవిస్తారు. దీని చుట్టూ దట్టమైన అడవులు కలవు. స్థానికులకు ఈ సరస్సు ఒకపిక్నిక్ ప్రదేశం. వన్య జంతు ప్రియులకు ఇది ఒక స్వర్గం వలే వుంటుంది. వివిధ రకాల జంతువులను ఇక్కడ చూడవచ్చు.
Photo Courtesy: Alosh Bennett

వేయి స్తంభాల గుడి

వేయి స్తంభాల గుడి

వరంగల్ లోని వేయి స్తంభాల గుడి చారిత్రక ప్రసిద్ధి పొందినది. ఈ టెంపుల్ లో ప్రధాన దైవాలు, విష్ణు మూర్తి, శివుడు మరియు సూర్య భగవానుడు. అనేక చెక్కడాలు కల వేయి స్తంభాలు ఈ గుడిలో వుండటం వలన దీనికి వేయి స్తంభాల గుడి అని పేరు వచ్చింది. ఈ దేవాలయ శిల్ప శైలి వర్ణనాతీతం. పర్యాటకులు తమ జీవిత కాలంలో ఒక్కసారి అయినా చూసి ఆనందించాల్సిందే.
Photo Courtesy: Gopal Veeranala

వరంగల్ కోట

వరంగల్ కోట

వరంగల్ లో కల వరంగల్ కోట పర్యాటకులు తప్పక చూడ దాగిన ఆకర్షణ. దీనికి గల విశిష్టమైన నిర్మాణ శైలి దక్షిణ భారత దేశ చరిత్రలో ప్రధమ స్థానం ఆక్రమించినది. ప్రస్తుతం ఇది కొంత మేర శిదిలమైనప్పటికి ఆకర్షణీయంగా వుంటుంది. ఇప్పటికి కోట లోపలి భాగాలు అందంగానే వుంటాయి.

Photo Courtesy: Nirde102

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్ వరంగల్ కోటకు సమీపంలో కలదు. ఈ గార్డెన్ లో మీరు లేడి, జిరాఫీ, సింహం మొదలైన జంతువుల బొమ్మలు చూడవచ్చు. ఇవి జీవం ఉట్టి పడేలా వుంటాయి. శిల్పుల నిర్మాణ శైలికి ఆశ్చర్యం పొందుతారు. ఇక్కడ కల తోటలలో పర్యాటకులు కొంత సేపు విశ్రాంతి పొందవచ్చు.

Photo Courtesy: Ashwini Arunkumar

భద్రకాళి టెంపుల్

భద్రకాళి టెంపుల్

వరంగల్ లోని భద్రకాళి టెంపుల్ పురాతనమైన ఆలయాలలో ఒకటి. ఈ టెంపుల్ భద్రకాళి సరస్సు ఒడ్డున కలదు. భద్రకాళి మాత విగ్రహం చక్కని అలంకరణతో, వివిధ ఆయుధాలతో ఆమె కు గల ఎనిమిది చేతులతో దర్శనం ఇస్తుంది. ఈ టెంపుల్ చుట్టూ వివిధ రాతి నిర్మాణాలు అందంగా కనపడుతాయి. Photo Courtesy: Sai Kanth Sharma Kondaveeti

పద్మాక్షి టెంపుల్

పద్మాక్షి టెంపుల్

పద్మాక్షి దేవాలయంలో మాత పద్మాక్షి కొలువై వుంటుంది. ఇది ఒక పురాతన దేవాలం. 12 వ శతాబ్దం నాటిదిగా చెప్పబడుతుంది. దేవాలయ ప్రవేశంలో నాలుగు కోణాల ఒక గ్రానైట్ స్థంభం కలదు. దీనిని అనకొండ స్థంభం అంటారు. ఈ స్తంభంపై అనేక అందమైన చెక్కడాలు, శాసనాలు కలవు. ఇటువంటి స్థంభ నిర్మాణ నైపుణ్యానికి పనితనానికి ఆశ్చర్యపడక తప్పదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X