Search
  • Follow NativePlanet
Share
» »వేసవి తాపం - ఊటీ పరిష్కారం !

వేసవి తాపం - ఊటీ పరిష్కారం !

గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?గుడి మధ్యలో స్తంభం దానంతట అదే తిరిగే దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

వేసవి వచ్చిందంటే చాలు, చల్లని ప్రదేశాలకు ఎక్కడికైనా వెంటనే వెళ్లి పోవాలని అనిపిస్తుంది. ఆ ప్రదేశాలను గుర్తు చేసుకునేట పుడు ముందుగా గుర్తు వచ్చేది చల్లని ఊటీ. నీలగిరి కొండలలో కల ఈ హిల్ స్టేషన్ పూర్తి పేరు ఉటకమాండ్ కాగా దానిని తగ్గించి ముద్దుగా అందరూ ఊటీ అని పిలుస్తారు. బెంగుళూరు నగరానికి ఊటీ 297 కి. మీ. ల దూరం. ఈ పట్టణాన్ని 19 వ శతాబ్దం లో బ్రిటిష్ వారు మద్రాస్ ప్రభుత్వానికి ఒక వేసవి విడిది గా ఏర్పాటు చేసారు. ఊటీ ఆనందాలు అమోఘం. కొండ శిఖరాలు, పర్వత శ్రేణులు, పచ్చటి బొటనికల్ గార్డెన్ లు, ఎగుడు దిగుడు కొండ చరియలు, ప్రవహించే జలపాతాలు, అందరూ మెచ్చే 'టాయ్ ట్రైన్' ప్రయాణాలు అన్నీ కలసి పర్యాట కుడికి పూర్తి ఆనందం అందిస్తాయి. ఆధునిక కాలంలో ఊటీ పట్టణం కూడా ఎంతో బిజి గా అయిపోయి, దాని చుట్టుపక్కల కల ప్రదేశాలకు పర్యాటకులు ప్రశాంత వాతావరనంకోరకు వెళుతున్నారు. మరి ఊటీ చుట్టుపట్ల కల ప్రదేశాలు, పర్యటనకు అనువైనవి ఏవి అనేది పరిశీలిద్దాం.

ఊటీ బొటానికల్ గార్డెన్స్

ఊటీ బొటానికల్ గార్డెన్స్

ఊటీ బొటానికల్ గార్డెన్స్ ను ప్రభుత్వం 1847 లో ఏర్పరిచినది. ఇది సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో కలదు. దీనిలో 650 రకాలకు మించిన వృక్ష జాతులు కలవు. ఇక్కడే సుమారు 20 మిలియన్ సంవత్సరాల నాటి వృక్ష వ్యర్ధం కూడా కలదని చెపుతారు. పచ్చటి ప్రదేశంలో నడక ఆహ్లాదకరం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మే నెలలో వార్షిక ఫ్లవర్ షో నిర్వహిస్తారు. ఇక్కడకు అనేక మంది బోటనీ విద్యార్ధులు ఆ సమయంలో వస్తారు. PicCredit: WikiCommons

ఊటీ లేక్

ఊటీ లేక్

ఊటీ సరస్సు, అందులోని బోటు హౌస్ లు పర్యాటకులకు అమిత ఆనందం కలిగిస్తాయి. బోటింగ్, ఫిషింగ్ చేయవచ్చు. లేదా సరస్సు ఒడ్డున షికార్లు కొట్టవచ్చు. వేసవిలో ఇక్కడ బోటు రేస్ లు కూడా జరుగుతాయి. ఫిషింగ్ అనుమతిస్తారు. కాని ఫిషింగ్ చేయాలంటే, ముందస్తు అనుమతులు కావాలి.

PicCredit: WikiCommons

దోడ్డ బెట్ట శిఖరం

దోడ్డ బెట్ట శిఖరం

దోడ్డ బెట్ట శిఖరం ఊటీ లో అతి ఎత్తైన ప్రదేశం సుమారు 2623 మీటర్ల ఎత్తు సముద్ర మట్టానికి వుంటుంది. ఈ శిఖరంనుంది ఊటీ నగర అందాలు చూడవచ్చు. ఈ శిఖరం ఊటీ కి 10 కి. మీ. ల దూరం లో కలదు. ఫోటోగ్రఫీ ఆసక్తి కలవారు దీనిని తప్పక చూస్తారు. ఈ శిఖరంపై తమిళనాడు టూరిజం శాఖ ఒక టెలీస్కోప్ హౌస్ కూడా నిర్వహించి చుట్టుపట్ల ప్రదేశాలను పర్యాటకులకు చక్కగా చూపుతోంది.

PicCredit: WikiCommons

నీలగిరి మౌంటెన్ రైల్వే

నీలగిరి మౌంటెన్ రైల్వే

నీలగిరి మౌంటెన్ రైల్వే ను నీలగిరి టాయ్ ట్రైన్ అని కూడా అంటారు. ఊటీ వెళితే, దీనిని తప్పక ఎక్కి ఆనందించాలి. ఇది ఆసియ లో అతి ఎత్తైన రైల్వే ట్రాక్ ఎన్నో సొరంగాలు, బ్రిడ్జి లు, కొనదేలిన పర్వత ప్రదేశాల వంపులు ఊటీ నుండి మెట్టుపలయం వరకు కలిగి వుంది. ఈ రైల్ మార్గం 1899 నుండి అమలు లో కలదు.

PicCredit: WikiCommons

కోడనాడు దృశ్య ప్రదేశం

కోడనాడు దృశ్య ప్రదేశం

కోడనాడు దృశ్య ప్రదేశం మీ కన్నుల విందు, ఇక్కడి నుండి క్రింద ప్రవహించే మోయర్ నదిని చూడవచ్చు. ఇక్కడ నుండే పచ్చటి ఎగుడు దిగుడ పర్వత శ్రేనులలోకల తేయాకు తోటలు చూసి ఆనందిన్చవచ్చ్లు. ఇక్కడ ఒక వాచ్ టవర్ కూడా కలదు. ఈ టవర్ నుండి రంగస్వామి శిఖరం చూడవచ్చు.
PicCredit: WikiCommons

గ్లెన్ మోర్గాన్ గ్రామం

గ్లెన్ మోర్గాన్ గ్రామం

ఊటీ కి కొద్దిపాటి దూరం లో కల ఈ గ్రామం ఇక్కడి తేయాకు తోటలకు ప్రసిద్ధి. తేయాకు తోటల నేపధ్యంలో అనేక సుందర దృశ్యాలను కూడా చూసి పర్యాటకులు ఆనందిస్తారు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ గా పేరు పడింది. ఇక్కడ కల రోప్ వే మరి ఒక అద్భుత ఆకర్షణ. ఒకే సారి దీనిలో నలుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు.

PicCredit: Glenmorgan

హిమపాత సరస్సు

హిమపాత సరస్సు

ఫిషింగ్ ఆసక్తి దారులకు, ట్రెక్కింగ్ చేసే వారికి ఈ ప్రదేశం ఒక హాట్ స్పాట్. ఇక్కడ కల మంచు పర్వతాలు 1823 లో ఒకసారి విరిగి సరస్సులో పడటం వలన దీనికి హిమపాత సరస్సు అనే పేరు వచ్చింది. ఉదయంవేళ సరస్సుపై దట్టమైన పొగమంచు వ్యాపించి వుంటుంది. మేఘాలు కిందకు దిగి నీటిలో కరిగి పోతున్నాయా అనేట్లు వుంటుంది. ఈ సరస్సులో ట్రాట్ ఫిషింగ్ ప్రసిద్ధ యాక్టివిటీ. దీనిని చాలా మంది పర్యాటకులు ఆనందిస్తారు.

PicCredit: WikiCommons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X