Search
  • Follow NativePlanet
Share
» »వారాంతపు విహారాలు : రంగనతిట్టు బర్డ్ సాన్క్చురి

వారాంతపు విహారాలు : రంగనతిట్టు బర్డ్ సాన్క్చురి

రంగనతిట్టు పక్షి అభయాస్రమానికి వెళ్ళాలంటే ఆహ్లాదం కలిగించే వారి పొలాలు, కొబ్బరి చెట్ల వరుసలు, పుష్కలమైన నీరు ప్రవహించే కాలువలు వంటి దృశ్యాలను చూస్తూ వాటి మధ్య ప్రయాణించాలి. మరి ఇక ఈ పక్షి ఆశ్రమానికి వెళితే, మరింత పట్టలేని ఆనందాలు కలుగుతాయి.

ఈ పక్షి ఆశ్రయం సుమారు 170 జాతుల పక్షులకు ఆశ్రయం గా వుంటుంది. ఇదంతా ఒక కల అనుకుంటున్నారా ? కానే కాదు, రంగనతిట్టు పక్షి అభయ ఆశ్రమం దీనిని మీకు వాస్తవం చేస్తుంది.

ఇది కూడా చదవండి: పచ్చటి ప్రదేశాల కుద్రేముఖ్

రంగనతిట్టు పక్షి అభయ ఆశ్రమం శ్రిరంగపట్నానికి సుమారు 3 కి. మీ. లు మాత్రమే కాగా మైసూరు నగరానికి 19 కి. కమి. లు. అద్భుతమైన ఇక్కడ కల ఆరు చిన్న పాటి దీవులు కావేరి నదీ తీరంలో కలవు. ఈ దీవులు సైజ్ లో చిన్నవిగా ఉన్నప్పటికీ బెంగుళూరు నగర లేదా మైసూరు నగర నివాసితులకు ఒక చక్కని ఆహ్లాదకర వారాంతపు విహారం అందించ గలవు.

మైసూరు హోటల్ వసతులకు క్లిక్ చేయండి

40 ఎకరాలకు పైగా...

40 ఎకరాలకు పైగా...

నదీ తీరం దట్టమైన పచ్చటి ప్రదేశాలు, వృక్షాలతో ఆకర్షణీయంగా వుంటుంది. వీటిలో అర్జున్ వృక్షాలు, పండనాస్ చెట్లు, వెదురు తోటలు మొదలైనవి చూడవచ్చు. ప్రాంతం అంతా అనేక పక్షులు, చిన్న చిన్న జంతువులు, సరీ నృపాలవంటివి కూడా కనపడతాయి.ఈ ఒక రోజు విహారంలో పక్షి ప్రియులు వివిధ రకాల స్థానిక, వలస పక్షులను చూస్తూ కన్నులకు విందు చేసికొనవచ్చు. ఈ సంక్చురి కి వచ్చి సంతానోత్పత్తి చేసుకొనే వాటిలో బ్లాకు హెడ్ ఇబిస్, పెయింటెడ్ స్టార్క్ , యురేషియన్ స్పూన్ బిల్, వాలీ నేకేడ్ స్టార్క్ , బిల్లెద్ కింగ్ ఫిషర్ మరియు ఇండియన్ శాగ్ వంటివి కూడా కలవు.
వీటిలో చాలా పక్షులు పిల్లలను పెట్టి అవి ఎగరగానే వలసలు పోగా, మరి కొన్ని పక్షులు ఇక్కడే శాశ్వతంగా నివసిస్తాయి.

Photo Courtesy: Ritesh Nayak

 పచ్చటి ప్రదేశాలు

పచ్చటి ప్రదేశాలు

నదీ తీరం దట్టమైన పచ్చటి ప్రదేశాలు, వృక్షాలతో ఆకర్షణీయంగా వుంటుంది. వీటిలో అర్జున్ వృక్షాలు, పండనాస్ చెట్లు, వెదురు తోటలు మొదలైనవి చూడవచ్చు. ప్రాంతం అంతా అనేక పక్షులు, చిన్న చిన్న జంతువులు, సరీ నృపాలవంటివి కూడా కనపడతాయి. ఈ ఒక రోజు విహారంలో పక్షి ప్రియులు వివిధ రకాల స్థానిక, వలస పక్షులను చూస్తూ కన్నులకు విందు చేసికొనవచ్చు. ఈ సంక్చురి కి వచ్చి సంతానోత్పత్తి చేసుకొనే వాటిలో బ్లాకు హెడ్ ఇబిస్, పెయింటెడ్ స్టార్క్ , యురేషియన్ స్పూన్ బిల్, వాలీ నేకేడ్ స్టార్క్ , బిల్లెద్ కింగ్ ఫిషర్ మరియు ఇండియన్ శాగ్ వంటివి కూడా కలవు.
వీటిలో చాలా పక్షులు పిల్లలను పెట్టి అవి ఎగరగానే వలసలు పోగా, మరి కొన్ని పక్షులు ఇక్కడే శాశ్వతంగా నివసిస్తాయి.

Photo Courtesy: Ritesh Nayak

 సంతానోత్పత్తి కేంద్రం

సంతానోత్పత్తి కేంద్రం

రంగన తిట్టు బర్డ్ సాన్క్చురి కి 30 రకాల పక్షుల కు ఒక సంతానోత్పత్తి కేంద్రంగా గుర్తించబడినది. చలికాలమైన డిసెంబర్ నెలలో అధిక సంఖ్యలో పక్షులు వలసలు రావటం గమనించవచ్చు. ఒక పార్క్ వలే నిర్వహించ బడుతున్న ఈ సాన్క్చురి చక్కని కాలిబాట లతో ప్రవేశంలో అద్భుత దృశ్యాలతో అందంగా వుంటుంది. ఇక్కడ కల బోటు విహారం సందర్శకులకు ఒక మధురానుభూతి. బోటు విహారానికి టికెట్ రూ.50/-ఒకరికి. ఈ బోట్ విహారంలోనే మీరు అనేక పక్షులు, నదీ తీరంలో గుడ్లు పెడుతున్న మొసళ్ళు కూడా చూడవచ్చు. మరికొంత అధిక రుసుము చెల్లించి ఈ బోటు విహారంలో సరిగ్గా 40 నిమిషాలలో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి అవతలి ఒడ్డు కూడా చేరవచ్చు.

Photo Courtesy: shrikant rao

ఆసక్తి కర అంశాలు

ఆసక్తి కర అంశాలు

మంచి అనుభవం కల ఈ బోటు నావికులు మీకు పక్షుల గురించి అనేక ఆసక్తి కర అంశాలు వివరిస్తారు. పక్షులు, మొసళ్ళు మాత్రమే కాక అనేక ఇతర చిన్న జంతువులను కూడా చూడవచ్చు. బోటు విహారంలో నీటిలో చేతులు పెట్టి ఆనందిస్తూ వుంటే, మొసలి పట్టుకు గురి అయ్యే ప్రమాదం వుంది సుమా!

Photo Courtesy: Hari Prasad Nadig

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

బెంగుళూరు కు 130 కి. మీ. ల దూరం కల ఈ రంగనతిట్టు ప్రదేశం చేరాలంటే, రోడ్డు మార్గం లో బెంగుళూరు - మైసూరు రహదారి లో ప్రయాణించాలి. రాత్రి వసతి పొందాలనుకుంటే, మైసూరు లేదా శ్రీరంగపట్న లలో పొందవచ్చు. బస్సు లలో ప్రయాణించ గోరు వారు నేరుగా మైసూరు (144 కి. మీ.) లేదా శ్రీరంగపట్న (125 కి. మీ.) బెంగుళూరు నుండి ప్రయాణించి అక్కడి నుండి టాక్సీ లలో అందమైన ఈ ప్రదేశం చేరవచ్చు. Photo Courtesy: Hari Prasad Nadig

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X