Search
  • Follow NativePlanet
Share
» »ఒంటరిగా ట్రెక్కింగ్ చేయగల ఈ ప్రదేశాలు మీకు తెలుసా?

ఒంటరిగా ట్రెక్కింగ్ చేయగల ఈ ప్రదేశాలు మీకు తెలుసా?

ఉత్తర భారతదేశం ఒంటరిగా ప్రయాణించటానికి కొన్ని అందమైన ప్రదేశాలు వున్నాయి. ఇక్కడ ఆదర్శమైన సోలో ప్రయాణాలకు ఉత్తర భారతదేశంలో ఉత్తమ ట్రెక్కింగ్ గురించి వివరించడం జరిగింది.

By Venkata Karunasri Nalluru

ఒంటరిగా ట్రావెల్ చేయటం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. ఇలా ప్రయాణించటానికి ఎంతో సహనం, ధైర్యం కావాలి. మీరు ఒంటరిగా ప్రయాణించినప్పుడు మీకు ఎలా ఇష్టమో అలా ఉండవచ్చు. కుటుంబం మరియు స్నేహితులతో ప్రయాణిస్తున్నప్పుడు మీకు కలిగే అనుభవాలు వేరు. ఒంటరిగా కాకుండా ఒక సమూహంతో ప్రయాణాలకు ప్లాన్ చేసినప్పుడు అది అనేక ప్రయోజనాలు అందిస్తుంది. మీరు ఒంటరిగా ప్రయాణిస్తే ఇంకొకర్ని ఒప్పించవలసిన అవసరం వుండదు. కానీ మీ స్నేహితులతో కలసి వెళ్ళినట్లయితే ఎప్పుడు ప్రయాణం చేయాలి మొదలైన ఇలా అన్ని విషయాలపై మీ సహచరుల నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. ఉత్తర భారతదేశంలో ఒంటరిగా వెళ్ళవలసిన యాత్ర గమ్యస్థానాల జాబితామీ కోసం క్రింద ఇవ్వబడినది.

ఉత్తర భారతదేశంలో ఒంటరిగా వెళ్ళవలసిన యాత్ర గమ్యస్థానాలు

1. త్రియుండ్

1. త్రియుండ్

త్రియుండ్ ఒక ప్రముఖ పర్వతారోహణ ప్రదేశం. ఈ ప్రదేశాన్ని మార్చి వంటి వేసవి నెలల్లో సందర్శిస్తారు. త్రియుండ్ ట్రెక్ చాలా ప్రశాంతంగా వుంటుంది. ఏ వయస్సువారైనా చేయవచ్చు. ఈ ట్రిప్ లో మీరు మౌనంగా కూర్చుని ధ్యానం చేయగల ఒక అద్భుతమైన విలువైన అవకాశం కూడా వుంటుంది.
PC : Alok Kumar

2. ఖీర్ గంగా

2. ఖీర్ గంగా

ఖీర్ గంగా మణికరణ్ లోని ఒక పేరెన్నిక గన్న పర్యాటక కేంద్రం. ఇక్కడి వేడి నీటి బుగ్గల్లోని తెల్లటి నీటికి ఔషధ గుణాలు ఉన్నాయంటారు. ఖీర్ గంగా అనే పేరు వ్యుత్పత్తిగా ఇక్కడి తెల్లటి నీటి నుంచి వచ్చింది. ఈ బుగ్గల్లో వుండే గంధకం వల్ల ఈ నీరు పాల లాగా తెల్లగా వుంటుంది, ఆ గంధకం నీటి ఉపరితలానికి తేలుతుంది. ఖీర్ గంగా నుంచి 2 కిలోమీటర్ల కొద్ది దూరంలో వున్న మంటలాయి తన ప్రాకృతిక మనోహర దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. పార్వతి నది, తెల్లటి మంచు పర్వతాల అందమైన దృశ్యాలను అందించే పుల్గా ఖీర్ గంగా నుంచి పర్వతారోహణ మార్గంలో ఉంటుంది. ఖీర్ గంగా సందర్శించడానికి ఉత్తమ సమయం మార్చి మరియు నవంబర్ నెలల మధ్య ఉంది. ఈ నెలల మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.
PC :Malay Gupta

3. చంద్ర శిలా

3. చంద్ర శిలా

చంద్ర శిలా ప్రదేశం సముద్ర మట్టానికి 4000మీ. ల ఎత్తున కలదు. హర్వాల్ హిమాలయ శ్రేణులలో కలదు. ఈ ప్రదేశం సమీపంలోని సరస్సులు, మైదానాలు, నందా దేవి, త్రిశూల్, కేదార్ బందర్ పంచ్ మరియు చౌఖంబా శిఖరం వంటివి చూపుత్డుంది. ఈ ప్రదేశం లో రావణుడిని చంపిన తర్వాత శ్రీ రాముడు కొంత కాలం తపస్సు చేసాడు. ఇక్కడే చంద్రుకు కూడా తపస్సు చేసాడని చెపుతారు. ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చోప్త నుండి మొదలై తుంగనాథ్ వరకూ 5 కి.మీ.లు గా వుంటుంది. ట్రెక్కర్లు దేఒరియా తాల్ - దుగ్గల్ బిట్ట - తుంగనాథ్ - చంద్రశిల మార్గం లో కూడా ఇక్కడకు చేరవచ్చు.
PC : AjitK332

4. పిన్ పార్వతి

4. పిన్ పార్వతి

పిన్ పార్వతి సాహసికులకు, ఔత్సాహికులకు ఒక పేరొందిన ట్రెక్కింగ్ ప్రదేశం. దట్టమైన అడవులు మరియు భారీ హిమపాతం వున్న పర్వతారోహణ ప్రదేశం. ఆల్పైన్ పచ్చికభూములు, సహజమైన హిమ సరస్సులు, వేడి నీటి ఊటలు, మంచు మోహరించి యున్న ప్రదేశాలు ఇక్కడ గల ఉత్తేజకరమైన ఆకర్షణలు.
PC : Dhilon89

5. హంప్త పాస్

5. హంప్త పాస్

ఇక్కడ పర్వతాలలో పర్యాటకులు ఎక్కడానికి ఎక్కువభాగం పచ్చని లోయలు వుంటాయి. ఇక్కడ ట్రెక్ ప్రతి ఒక్కరోజు ఒక కొత్త ఆనందాన్ని ఉత్సాహాన్ని కలగచేస్తుంది.
PC : Sair18791

6. హర్-కి-దన్

6. హర్-కి-దన్

పర్యాటకులలో అమితంగా ప్రాచుర్యం పొందిన ఆక్టివిటీ ట్రెక్కింగ్. హర్-కి-దన్ లోయ అలాగే ట్రైల్స్ వంటివి ఇక్కడ ట్రెక్కింగ్ కి ప్రాచుర్యం పొందిన మార్గాలు. అద్భుతమైన ఈ ప్రదేశం లో నేచర్ వాక్స్ మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. ట్రెక్కింగ్ అనువైన వస్తువులు పర్యాటకులు తెచ్చుకోవాలి.
PC :Metanish

7. రుపిన్ పాస్

7. రుపిన్ పాస్

రుపిన్ పాస్ అధిక ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణి. సముద్ర మట్టం నుండి 15,000 అడుగుల ఎత్తులో జనావాసాలు ప్రాంతాల్లో నడుమ ఉన్నవి. ఇక్కడ వున్న కొత్త కొత్త దృశ్యాలు అడుగడుగునా ఒక అనుభవం వెల్లడిస్తుంది. రుపిన్ పాస్ ట్రెక్ హిమాచల్ ప్రదేశ్ లో క్లాసిక్ కొండ మార్గాలలో ఒకటి. పూర్తి అనుభవం వుంటేనే ఇక్కడ సోలో ట్రెక్ చేయాలి.
PC :Engti

8. స్పితి లోయ

8. స్పితి లోయ

కై ఆరామం, స్పితి లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఇది భారతదేశం లోనే అతి పురాతన మఠం. పర్వత బైకింగ్ మరియు జడలబర్రె సఫారీ వంటి సాహస చర్యలు ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రాంతపు సహజ సౌందర్యం కారణంగా, పాప్ మరియు మిలరేపా వంటి కొన్ని బాలీవుడ్ సినిమాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఈ ప్రాంతంలో రెండు అతి ముఖ్యమైన పట్టణాలు, కాజా మరియు కేయలోంగ్. ఇక్కడ కనిపించే కొన్నిఅరుదైన జాతుల వృక్షజాలం మరియు జంతుజాలం, ఈ స్థల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. గోధుమ, బార్లీ, బఠానీలు ఈ ప్రాంతంలో పంటలలో కొన్ని. స్పితి యొక్క వాతావరణం, శీతాకాలంలో తప్ప సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. వేసవి కాలం, మే మరియు అక్టోబర్ నెలల మధ్యలో ఉంటుంది. ఈ స్థలం సందర్శించడానికి ఉత్తమ సమయం వేసవి కాలం.
PC : 40cima

9. లడక్

9. లడక్

దట్టమైన అడవులు నదుల నుండి ఏర్పడే వరదలను అరికట్టి గ్రామాల ముంపులు లేకుండా చేస్తాయి. అడవులు దట్టంగా వుంటే, ఆ ప్రదేశాలలో వన్య జీవులు తగిన ఆహారం అక్కడే పొంది గ్రామీణులకు, లేదా అడవులలో నివసించే వారికి అడ్డు లేకుండా వుంటాయి. ఒక పర్యావరణ పరి రక్షకుడిగా మానవుడు అనేక రకాల చర్యలు చేపట్టాలి. అపుడే వివిధ జంతు జాలాలతో పాటు మానవుడి జీవనం కూడా ఎట్టి ఇబ్బందులూ లేకుండా కొనసాగుతుంది. నాగరికత అధికకాలం విలసిల్లుతుంది. ఈ భూమి మీద కల అందమైన ప్రాంతాలలో లడఖ్ ఒకటి. ఈ ప్రదేశం ఇప్పటికి తన ఉనికిని కాపాడుకుంటూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. లడక్ ఎయిర్ పోర్ట్ రాష్ట్రం లోని ప్రముఖ ప్రాంతాలకు కలుపబడి వుంది.జమ్మూ ఎయిర్ పోర్ట్ దీనికి ప్రధాన విమానాశ్రయం. ఇక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సేవలు కలవు. లడఖ్ కు 712 కి. మీ. ల దూరంలో జమ్మూ తావి రైలు స్టేషన్ కలదు. జమ్మూ మరియు శ్రీనగర్ ల నుండి బస్సు ప్రయాణంలో లడఖ్ చేరవచ్చు.
PC : Deeptrivia

10. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్

10. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్

జిమ్ కార్బెట్ అనే ఒక ప్రసిద్ధ పులి వేటగాడి పేరుతో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ స్థాపించారు. జిమ్ కార్బెట్ పులి వేట గాడు మాత్రమే కాదు ఒక రచయిత కూడాను. ఆయన 'ది మాన్ ఈటర్స్ అఫ్ కుమావొన్ ' అనే ఒక పుస్తకం కూడా వ్రాశారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తర ఇండియా లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ని నైనిటాల్ జిల్లా లో ఒక ప్రసిద్ధ నేషనల్ పార్క్. నేటికీ ఇక్కడ 150 వరకూ పులులు కలవు. వీటిని చూడాలంటే, ఈ పార్క్ సందర్సన ఏప్రిల్ నుండి జూన్ నెలలలో అవి వాటి దప్పిక తీర్చుకొనేందుకు బయటకు వచ్చినపుడు చేయాలి. ఇక్కడ పులులు మాత్రమే కాక, ఇతర అడవి ఏనుగులు, సాంబార్ చిరుత, మొసలి, వంటి జంతువులు ఎన్నో కలవు. పార్క్ సంవత్సరం అంతా తెరచే వుంటుంది. కాని నవంబర్ 15 నుండి జూన్ 15 వరకూ పార్క్ లోని అన్ని జోన్ లు టూరిస్ట్ లకు తెరచి వుంటాయి.
PC :Soumyajit Nandy

11. కసోల్

11. కసోల్

హిమాచల్‌ప్రదేశ్ లో టూరిస్టులకు స్వర్గధామం ఈ కసోల్ గ్రామం. ఇక్కడ ప్రకృతి అందాలు టూరిస్టులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఆహ్లాదకరంగా ఉంటుంది. పురుషులకు ఈ గ్రామంలో నిషేధం. కార‌ణం ఏమంటే ఫారెన్ మహిళలను ఈవ్ టీజింగ్ చేయడమేనని అక్కడి స్థానికుల ఆరోపిస్తారు. అంటే కసోల్‌లో పుట్టిన మగాళ్ళు మాత్రమే అక్కడి అందాలను ఆస్వాదిస్తార‌న్న‌మాట‌.
PC : Alok Kumar

12. మలానా

12. మలానా

మలానా హిమాచల్ ప్రదేశ్ లో ఒక పురాతన గ్రామం. ఇక్కడ మార్చి నెలలో సోలో ట్రిప్ చేయవచ్చును. పురాతనదేవాలయాలు ఇక్కడ చాలా వున్నాయి. మలానా ధారాళమైన మలానా నది ఒడ్డున, సముద్ర మట్టానికి 3029 మీటర్ల ఎత్తులో ఉంది. కులు లోయకి సమీపంలో ఉన్న మలానా, డియో తీబా మరియు చంద్రఖని శిఖరాల మంత్రముగ్దమైన దృశ్య వీక్షణ అందిస్తుంది.
PC :Jaypee

13. కణతల్

13. కణతల్

కణతల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వున్నది. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కొడియా జంగల్, శివపురి, సుర్కంద దేవి ఆలయం, తెహ్రి డ్యాం. ఇక్కడకు 80కి.మీ ల దూరంలో గల రిషికేష్ ఇక్కడకు సమీప పెద్ద పట్టణం. ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రి గర్వాల్ జిల్లాలో వున్న చంబా-ముస్సోరీ హైవే పై గల "కణతల్" ఒక చిన్న గ్రామం. ఈ అందమైన గ్రామం సముద్ర మట్టానికి 8500 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలవారికి ఇది ఒక విడిది స్థలం. ఈ గ్రామానికి నలువైపులా ఉన్న పచ్చటి పరిసరాలు, మంచుతో కప్పపడిన పర్వతాలు, నదులు, అడవులు ఈ గ్రామ అందాన్ని మరింత పెంచుతాయి.
PC : Nimish2004

14. మర్ఖా లోయ

14. మర్ఖా లోయ

మర్ఖా లోయ ఉత్తర భారతదేశం యొక్క ఉత్తమ ట్రెక్కింగ్ ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతంలో బౌద్ధమతం అభివృద్ధి చెందినది. సంవత్సరంలో అనేక నెలలు భారీ హిమపాతం వున్నట్లు గుర్తించారు.
PC : SlartibErtfass der bertige

15. తోష్

15. తోష్

తోష్ లోయ హిమాచల్ ప్రదేశ్లో పార్వతి వ్యాలీగా ప్రసిద్ధిచెందినది. మార్చి నెలలో భారతదేశంలో సోలో ప్రయాణాలకు ఉత్తమ స్థలాల్లో ఒకటి. మణికరణ్ తోష్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
PC :Margarita

16. చలల్

16. చలల్

హిమాచల్ ప్రదేశ్ లో పార్వతి నది నుండి చలల్ అనే అందమైన గ్రామంనకు ట్రెక్ చేస్తారు. ఈ గ్రామం కసోల్ నుండి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్చి నుంచి జూన్ మధ్య మరియు సెప్టెంబర్ నవంబర్ ల మధ్య చలల్ సందర్శించడానికి ఉత్తమ సమయం.
PC :NA

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X