Search
  • Follow NativePlanet
Share
» »శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా ?

శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా ?

By Mohammad

పారిజాత వృక్షం గురించి తెలియని వారుండరు. ఈ వృక్షం పేరు చెప్పగానే చట్టుక్కున గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు - సత్యభామ. పురాణాల ప్రకారం చూసినట్లయితే శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుకొని వచ్చి సత్యభామకు ఇచ్చాడని కధనం. ఈ వృక్షం గురించి ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ డౌట్ ? అక్కడికే వస్తున్నా. ఆ బహుకరించిన పారిజాత వృక్షం మరెక్కడో కాదు మన భారతదేశంలోనే ఉంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకి జిల్లాలో కింటూర్ అనే గ్రామంలో పారిజాత వృక్షం కలదు. కృష్ణ పరమాత్ముడు ఇష్టసఖియైన సత్యభామకు బహుకరించిన పారిజాత వృక్షం ఇదే! ఈ మహా వృక్షాన్ని ప్రపంచంలోని పెద్ద పెద్ద బోటనీ శాత్రవేత్తలు పరిశీలించి, ప్రపంచంలోనే విలక్షణమైన వృక్షంగా కితాబిచ్చారు.

పారిజాత వృక్షం, కింటూర్ గ్రామం

పారిజాత వృక్షం, కింటూర్ గ్రామం

చిత్రకృప : Faiz Haider

పారిజాత వృక్షం - కధనాలు

కధనం -1

కింటూర్ గ్రామం బారాబంకి పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ గ్రామాన్ని మొదట 'కుంతి' అని పిలిచేవారు. 'కుంతి' పాండవుల తల్లి. మహాభారత కాలంలో ఈ ఊరిలో కుంతి దేవి ఒక శివాలయాన్ని నిర్మిస్తుంది. ఆవిడ చితాబస్మం నుంచి పారిజాత అనబడే వృక్షం పుట్టుకొచ్చినదని కొందరి భావన.

<strong>ఫతేపూర్ సిక్రీ - అక్బర్ కట్టించిన సుందర నగరం !</strong>ఫతేపూర్ సిక్రీ - అక్బర్ కట్టించిన సుందర నగరం !

కధనం -2

మరో కధనం ప్రకారం అర్జునుడు స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తీసుకొనివస్తాడు. కుంతీ దేవి పారిజాత పుష్పాలను తెంపుకొని శివుడిని అర్చిస్తుంది.

కధనం 3

శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి సత్యభామకు బహుకరిస్తాడు. దీనిని దొంగిలించడానికి ప్రయత్నించి కష్టాలలో పడతాడు. ఆ కథే పారిజాతాపహరణం.

పారిజాత వృక్షం శాఖలు

పారిజాత వృక్షం శాఖలు

చిత్రకృప : Faizhaider

ఈ పురాణ కధనాలు నిజమో కాదో తెలీదు గానీ ఈ వృక్షం మాత్రం పురాతమైనది. దీని వయస్సు వెయ్యి నుండి ఐదు వేల యేండ్లు ఉండొచ్చని భావన.

ప్రపంచంలోని ఏ చెట్టుకూ లేని ప్రత్యేకత ఈ చెట్టుకు ఉంది. ఆ ప్రత్యేకతలు ఏమిటంటే .. !

ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గానీ, పండ్లు గానీ ఉత్పత్తి చేయదు.

<strong>కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !</strong>కదిలే లింగమయ్య ... చూసొద్దాం పదండి !

దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి.

వీటి పుష్పాలు కూడా ఎంతో అందంగా బంగారు, తెలుపు రంగు కలిసిన వర్ణములో ఉంటాయి. పుష్పనాలు ఐదు రేకులు కలిగి ఉంటుంది.

పారిజాత పుష్పం

పారిజాత పుష్పం

చిత్రకృప : J.M.Garg

ఈ చెట్టు ఎప్పుడు పడితే అప్పుడు వికసించదు. ఇది కేవలం జూన్/ జులై నెలలో మాత్రమే వికసిస్తుంది. ఈ పుష్పాల సువాసనలు చాలా దూరం వరకు వ్యాపిస్తుంది.

వృక్షం యొక్క ఎత్తు 45 అడుగులు, చుట్టుకొలత 50 అడుగులు గా పేర్కొనటం జరిగింది.

వృక్షం గొప్పతనం ఏమిటంటే, దీని శాఖలు గానీ, ఆకులు గానీ కుచించుకుపోయి కాండంలో కలవడమే తప్ప ఎండిపోయి రాలటం జరగదు.

పారిజాత వృక్షం కాండం

పారిజాత వృక్షం కాండం

చిత్రకృప : Faizhaider

బారాబంకి ఎలా చేరుకోవాలి ?

కింటూర్ చేరుకోవాలనుంటే ముందుగా బారాబంకి పట్టణానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు / ప్రవేట్ వాహన సర్వీసులు కింటూర్ కు లభ్యమవుతాయి.

<strong>తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !</strong>తీపి వంటకాల రాజధాని : 'లక్నో' !

విమాన మార్గం : బారాబంకి కి సమీపాన లక్నో ( 26 కి.మీ), కాన్పూర్ (102 కి.మీ) ఎయిర్ పోర్ట్ లు కలవు.

రైలు మార్గం : బారాబంకి లో రైల్వే జంక్షన్ కలదు. ఢిల్లీ, కాన్పూర్, గోరఖ్పూర్, లక్నో తదితర పట్టణాల నుండి నిత్యం స్టేషన్ మీదుగా రైళ్లు వెళుతుంటాయి.

బస్సు మార్గం : లక్నో, కాన్పూర్ తదితర సమీప పట్టణాల నుండి బారాబంకి కి ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. బారాబంకి లో దిగి, అక్కడి నుంచి కింటూర్ కు ప్రవేట్ వాహనాలలో ఎక్కి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X