Search
  • Follow NativePlanet
Share
» » హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

అందమైన అరబ్ గార్డెన్ లు మరియు పెర్షియన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు కల హైదరాబాద్ నేటికీ నిజాముల కాలం నాటి వైభవాలను ప్రదర్శిస్తోంది. "సింహం యొక్క నివాసం" అని అక్షరాలా చెప్పబడే హైదరాబాద్ వాస్తవానికి సాటిలేని శిల్ప శైలి కల నిర్మాణాలతో నేటికీ ఒక అద్భుత నగరంగా నిలిచి వుంది. ఇండియన్ యూనియన్ లో చేరిన నాటి రాష్ట్రాలలో హైదరాబాద్ రాజ్యం చిట్టచివరిది. ఎందుకంటే, ఈ నగరం ఇండియన్ యూనియన్ నుండి అభివృద్ధి పరంగా పొందవలసినది ఏదీ లేదు. నిజాం పాలకులు బ్రిటిష్ పాలకుల సహకారంతో స్వంతగా వారి ప్రపంచాన్ని వారు నిర్మించుకున్నారు. హైదరాబాద్ నగర నిర్మాణ అద్భుతాలుఅప్పటి నిర్మాణ శైలి లో ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా కీర్తించబడ్డాయి. అట్టి హైదరాబాద్ అద్భుత కట్టడాలలో కొన్నింటిని పరిశీలిద్దాం...

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

చార్మినార్ - హైదరాబాద్ నగర ముఖ ద్వారం అయిన చార్మినార్ ను కుతుబ్ షాహి వంశం లోని అయిదవ సుల్తాన్ అయిన ముహమ్మద్ కూలి కుతుబ్ షా నిర్మించాడు. అయితే, ఈ చారిత్రక నిర్మాణాన్ని అప్పటి ప్లేగు వ్యాధి బాధితుల జ్ఞాపకార్ధం ఆ రాజు నిర్మించాడని చాలామందికి తెలియదు. హైదరాబాద్ నగరం పేరు చెపితే చాలు ప్రతి భారతీయుడికి చార్మినార్ కట్టడం గుర్తుకు వచ్చేస్తుంది.

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

గోల్కొండ కోట - ఇండియా కు మరెప్పుడూ తిరిగి రాణి కోహినూర్ వజ్రం, హోప్ డైమండ్, ఐడల్స్ ఎయె మరియు దర్యా ఐ నూర్ వజ్రాలు గోల్కొండ కోట లోని తవ్వకాలలో దొరికినవే. ఈ కోట ను ఇప్పటికి సందర్శకులు అధిక సంఖ్యలో సందర్శించి గత వైభవాలను చూసి ఆశ్చర్య చకితులవుతారు.

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

మక్కా మసీద్ - మక్కా మసీద్ ను మక్కా నుండి దిగుమతి చేయబడిన మట్టి తో నిర్మించారు. ఈ మసీదు భారత దేశం లోని మసీదులలో కెల్లా గొప్పదిగా చెప్పబడుతుంది. గొప్ప మహిమాన్విత మసీదు గా ముస్లిం లు దీనిని భావిస్తారు. ఈ మసీదు లోని కొలను చివర కల ఒక స్లాబు బెంచ్ పైన ఒకసారి కూర్చుంటే చాలు మీరు తిరిగి అక్కడే కూర్చొనటానికి జీవితంలో ఎపుడైనా సరే అక్కడకు వస్తారని చెపుతారు. మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

శిల్పారామం - హై టెక్ సిటీ లో కల శిల్పా రామం ఒక హస్త కళలను ప్రతి బిమ్బించే గ్రామం. భారతీయ సాంప్రదాయ కళలు, హస్త కళలను పరి రక్షించేందుకు రూపొందించారు. శిల్పారామం విలేజ్ అందమైన తోటలు, జలపాతాల మధ్యలో నిర్మించారు. సంవత్సరం పొడవునా భారతీయులు జరుపుకునే సాంప్రదాయ పండుగలు, ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారు.

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

రామోజీ ఫిలిం సిటీ ప్రపంచం లోని అన్ని ఫిలిం సిటీ ల కంటే పెద్దదిగా ఘనత వహించింది. ఈ ఫిలిం నగరం సుమారు 1666 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిలో పర్యటించాలంటే, గైడ్ ల సహకారం కావలసినదే. కొత్త జంటల హనీమూన్ పేకేజ్ ఏర్పాట్లు కలవు. సంవత్సరం పొడవునా, మరియు రోజు లోని ఇరవై నాల్గు గంటలూ ఈ ఫిలిం నగరం బిజి గానే వుంటుంది. పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు. ఇక్కడ ఫిలిం షూటింగ్ లు కూడా నడుస్తాయి.

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

హైదరాబాద్ అద్భుత ప్రదేశాలు !

చౌ మొహాల్ల పాలస్ హైదరాబాద్ పాలకులు అయిన నిజాముల అధికార నివాసం. ఈ పాలస్ చూస్తె చాలు దాని యజమానుల కీర్తి ప్రతిష్టలు ఎంత ఘనమైనవో తెలిసిపోతుంది. మెయిన్ గేటు పై భాగంలో సుమారు 250 ఏళ్ల నుండి నడుస్తున్న ఇక్కడి క్లోక్ టవర్ గడియారం నేటికీ ఒక అద్భుత పర్యాటక ఆకర్షణే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X