అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి ఎక్కడుందో మీకు తెలుసా?

Written by: Venkata Karunasri Nalluru
Updated: Wednesday, April 19, 2017, 11:15 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్ల బావి అభనేరి.వేల సంవత్సరాల క్రితం కట్టిన ఈ మెట్లబావి ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.ఇది నాటి ఇంజనీర్ల గొప్పతనానికి నిలువెత్తు తార్కాణం.ప్రపంచంలోనే ఇంతటి అపూర్వ కట్టడం మరెక్కడా లేదు.దీని ప్రాచీనతే దీనిని ప్రపంచ వారసత్వ జాబితా చరిత్రలో చేర్చేవిధంగా చేసింది.మరి అంతటి గొప్ప కట్టడం గురించి మనం తెలుసుకుందామా.

అభనేరి రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో జైపూర్,ఆగ్రా రోడ్డుపై జైపూరుకు 95కి.మీ దూరంలో గల ఒక గ్రామం.ఇక్కడ చాంద్ బవోరి అనే ఒక పెద్ద మెట్ల బావితో ఈ ప్రదేశం బాగా ప్రసిద్ధిగాంచింది.ఇండియాలోని మెట్లబావుల కన్నా ఈ మెట్ల బావి ఎంతో అందమైనది.అభనేరి గ్రామాన్నే గుర్జార్ ప్రతిహార్ రాజు సామ్రాట్ నిహీర్ భోజ్ స్థాపించినట్లు తెలుస్తోంది.

ప్రపంచంలోనే ఇంతటి అపూర్వ కట్టడం మరెక్కడా లేదు.

1. చాంద్ బవోరి

అభనేరి మెట్ల బావులు లేదా దిగుడు బావులకు ప్రసిద్ధి.వీటిలో వర్షపు నీరు వేసవి ఉపయోగార్థం నిలవచేసుకుంటారు. ఇక్కడ గల దిగుడు బావులన్నింటిలోనూ చాంద్ బవోరి చాలా ప్రసిద్ధిచెందినది.

pc:youtube

 

2. శిల్పశైలి

శిల్పశైలి విషయానికొస్తే చాంద్ బవోరి అందమైన శిల్పశైలి కూడా కలిగివుంది.ప్రపంచంలోనే అతి పెద్దది మరియు ఇండియాలోనే అతి పెద్దది మరియు లోతైన దిగుడు బావి.

pc:youtube

 

3. మెట్లబావి లోతు

13 అంతస్థులలో నలుచదరంగా నిర్మించిన ఈ మెట్లబావి లోతు సుమారు 100అడుగులుంటుంది. దీనికి ఇరుకైన 3500ల మెట్లు, 13 అంతస్థులలో నిర్మించారు.

pc:youtube

 

4. రాజాచంద్

దీన్ని క్రీ.శ.9వ శతాభ్దంలో రాజు రాజాచంద్ నిర్మించారు.ఈ బావికి 3వైపుల్నుండి కూడా మెట్లు కలవు.నాలుగోవైపు ఒకదానిపైఒకటిగా మంటపాలు నిర్మించారు.

pc:youtube

 

5. చెక్కడాలు

ఈ మంటపాలలో అందమైన శిల్పాలు చెక్కడాలు కూడా నిర్మించారు.ఇక్కడే ఒక స్టేజీ మరియు కొన్ని గదులు కూడా వున్నాయి.

pc:youtube

 

6. చాంద్ బవోరి

దీనిలో రాజు మరియు రాణి తమ కళలను ప్రదర్శించేవారు.చాంద్ బవోరిని ప్రస్తుతం ఆర్కియోలాజికల్ సర్వ్ నిర్వహిస్తోంది.

pc:youtube

 

7. ప్రవేశ రుసుము

ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించేందుకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. ది ఫాల్ మరియు ది డార్క్ నైట్ రైసెస్ వంటి చిత్రాల్లో ఈ మెట్ల బావిని మనం చూడొచ్చు.

pc:youtube

 

8. 8 లేదా 9 వ శతాబ్దం

చాంద్ బవోరికి ఎదురుగా హర్షత్ మాతా దేవాలయం కలదు.ఈ దేవాలయాన్ని 8 లేదా 9 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది.

pc:youtube

 

9. హర్షత్ మాతా దేవాలయం

మధ్యయుగం నాటి భారతదేశ శిల్పసంపదలో గల హర్షత్ మాతా దేవాలయం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.ఈ దేవాలయంలో దేవత హర్షత్ మాతా.

pc:youtube

 

10. జాతర

ఈ దేవత సంతోష్ ఆనందాల దేవతగా చెప్తారు.ప్రతిసంవత్సరం హర్షత్ మాతా దేవాలయంలో మూడు రోజులపాటు జాతర నిర్వహిస్తారు.

pc:youtube

 

11. ప్రసిద్ధిచెందిన నాట్యాలు

అభనేరి గ్రామం జానపదనృత్యాలకు ప్రసిద్ధి గాంచింది. ఘామర్, కలబెలియా, భావాయ్ వంటివి ఇక్కడ ప్రసిద్ధిచెందిన నాట్యాలు.

pc:youtube

 

English summary

World’s largest Step-Well in India !

Chand Baori is a stepwell built in 9th century AD by King Chanda of the Nikumbha Dynasty, who ruled over present day Rajasthan in India. It is situated in the village of Abhaneri near Jaipur city. It is the oldest and biggest step-well in the world.
Please Wait while comments are loading...