Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన గోడ ఎక్కడ వుందో మీకు తెలుసా ?

ప్రపంచంలో రెండవ అతి పెద్దదైన గోడ ఎక్కడ వుందో మీకు తెలుసా ?

దేశంలో నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడాలలో "కుంబాల్ ఘర్ కోట" ఎంతో విశిష్టమైనది. రాజస్థాన్ రాష్ట్రం రాజ్సమంద్ జిల్లాలో చారిత్రక ప్రదేశంగా పేరుగాంచిన కుంబాల్ ఘర్ లో ఈ కోట వుంది. ఆరావళి ప్రాంతంలో 36కి.మీ

By Venkata Karunasri Nalluru

దేశంలో నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడాలలో "కుంబాల్ ఘర్ కోట" ఎంతో విశిష్టమైనది. రాజస్థాన్ రాష్ట్రం రాజ్సమంద్ జిల్లాలో చారిత్రక ప్రదేశంగా పేరుగాంచిన కుంబాల్ ఘర్ లో ఈ కోట వుంది. ఆరావళి ప్రాంతంలో 36కి.మీ ల వరకు విస్తరించి వున్న ఈ కోటను 15వ శతాబ్దంలో "రాణా కుంభ" మహారాజు నిర్మించారు.

ఈ కోటకు ఏకంగా 36 ఆలయాలు, 250 భవంతులతో పాటు వీటికి రక్షణగా చైనా గోడలాగే ఇండియన్ వాల్ వుంది. మేవార్ నదీ ఒడ్డున ఈ కోట వుంది. 13 శిఖరాలను, వాచ్ టవర్లను, మరియు బురుజులను కలిగి ఉంది. దీనిలో మహారాణా ఫతే సింగ్ నిర్మించిన గోపుర ప్యాలెస్ వుంది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. శత్రువుల దాడి నుండి రక్షణ

1. శత్రువుల దాడి నుండి రక్షణ

అత్యంత పొడవుగా వున్న కుంబాల్ ఘర్ కోట గోడను శత్రువుల దాడి నుండి రక్షణగా నిర్మించారు.

pc: youtube

2. రెండో పొడవైన గోడ

2. రెండో పొడవైన గోడ

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత రెండో పొడవైన గోడగా ఇది ప్రసిద్ధి పొందింది.

pc: youtube

3. విశిష్టతలు

3. విశిష్టతలు

ఎంతో అద్భుతంగా కనువిందు చేసే ఈ కోటలో ఆశ్చర్యానికి గురి చేసే ఎన్నో విశిష్టతలు దాగివున్నాయి.

pc: youtube

4. ప్రధాన ఆకర్షణ

4. ప్రధాన ఆకర్షణ

ఈ కోట ప్రాంగణంలో 360 హిందూ, జైన ఆలయాలు వున్నాయి. వీటిలో నీలకంఠ మహాదేవుడి ఆలయం ప్రధాన ఆకర్షణ.

pc: youtube

5.ఆరడుగుల ఎత్తులో వున్న శివ లింగం

5.ఆరడుగుల ఎత్తులో వున్న శివ లింగం

ఈ ఆలయంలో మహా శివుడు కొలువై వుంటాడు. ఇక్కడున్న ఆరడుగుల ఎత్తులో వున్న శివ లింగం దేశంలో అతి పెద్ద శివలింగాల్లో ఒకటి.

pc: youtube

6. రాణా కుంబార్

6. రాణా కుంబార్

కుంభాల్ ఘర్ కోటలోని హనుమాన్ పోల్ సమీపంలో జైన దేవాలయం కలదు. ఈ జైన దేవాలయాన్ని రాణా కుంబార్ నిర్మించారు.

pc: youtube

7. పరశురాముని దేవాలయం

7. పరశురాముని దేవాలయం

ఈ ఆలయంలో జైనుల జీవన చిత్రాలను ప్రతిబింబించే విధంగా కళాకృతులు చెక్కబడ్డాయి. కోటలోని పురాతన గుహలో పరశురాముని దేవాలయం వుంది.

pc: youtube

8. శ్రీరాముని ఆశీర్వాదం

8. శ్రీరాముని ఆశీర్వాదం

ఈ ఆలయంలో పరశురాముని ఋషి విగ్రహం వుంటుంది. పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేసాడని తరువాత శ్రీరాముని ఆశీర్వాదం పొందాడని చెపుతారు.

pc: youtube

9. రెండు అందమైన మహల్ లు

9. రెండు అందమైన మహల్ లు

కుంభాల్ ఘర్ లో వున్న అందమైన ప్యాలెస్ లలో ఈ ప్యాలెస్ ఒకటి. దీనినే మేఘాలయ ప్యాలెస్ అంటారు. ఈ ప్యాలెస్ లో రెండు అందమైన మహల్ లు వున్నాయి.

pc: youtube

 10. విధానాలు

10. విధానాలు

చల్లటి గాలి లోనికి రావటం, వేడి గాలి బయటకి పోవటం వంటి విధానాలు ఇక్కడ గమనించవచ్చు.కేవలం ఇది మాత్రమే కాదు.

pc: youtube

11. అద్భుతాలు

11. అద్భుతాలు

ఈ కోటలో చూపరులకు కట్టి పడేసే మరెన్నో అద్భుతాలు దాగి వున్నాయి. ఈ కోటలో సందర్శించాలంటే కేవలం ఒక్కరోజు సరిపోదు.

pc: youtube

 12. 3500 అడుగులు

12. 3500 అడుగులు

3500 అడుగుల ఎత్తులో వున్న ఈ కోట 36 కి.మీ ల విస్తీర్ణంతో వ్యాపించివుండటంతో దీనిని చూసేందుకు చాలా సమయం పడుతుంది.

pc: youtube

13. మేవార్ కోట

13. మేవార్ కోట

కుంభాల్ ఘర్ ఫోర్ట్ 15 వ శతాబ్దంలో రాజు రానా కుంభాచే నిర్మించారు. ఈ మేవార్ కోట బాణా నది ఒడ్డున ఉంది.

pc: Amitdighe

14. రెండవ అతి ముఖ్యమైన కోట

14. రెండవ అతి ముఖ్యమైన కోట

ఇది రాజస్థాన్ లోని రెండవ అతి ముఖ్యమైన కోట. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కోటకు వస్తారు.

pc: youtube

15. శిఖరాలు

15. శిఖరాలు

ఈ భారీ కోట 13 శిఖరాలను, వాచ్ టవర్లను, మరియు బురుజులను చుట్టూ కలిగి ఉంది.

pc: youtube

16. గోపుర ప్యాలెస్

16. గోపుర ప్యాలెస్

కుంభాల్ ఘర్ కోట ఆరావళి ప్రాంతంలో సుమారుగా 36 కి.మీ. ల మేర వ్యాపించి ఉంది. దీనిలో మహారాణా ఫతే సింగ్ నిర్మించిన గోపుర ప్యాలెస్ ఉన్నాయి.

pc: youtube

17. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

17. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

పొడవైన ఈ గోడ శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం నిర్మించారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ఇది రెండోపొడవైన గోడగా ఉంది.

pc: youtube

18. ఏడు భారీ ద్వారాలు

18. ఏడు భారీ ద్వారాలు

కోటకు ఏడు భారీ ద్వారాలు కలవు. వీటిలో రామ్ పాల్ అతిపెద్ద గేటుగా ఉంది. పర్యాటకులు హనుమాన్ పాల్, మీద ఒక గుడిని చూడగలరు. హుల్లా పాల్, రామ్ పాల్, పగ్రాపాల్, నింబూపాల్, భైరవ పాల్ మరియు ఖానా పాల్ లు కోటకు గల ఇతర గేట్ల పేర్లు.

pc: youtube

19. కర్తార్ ఘర్

19. కర్తార్ ఘర్

పర్యాటకులు కోట నుంచి పరిసర ప్రాంతాల ను చక్కగా దర్శించవచ్చు. కర్తార్ ఘర్ అని పిలిచే మరొక కోట కూడా కుంభాల్ ఘర్ ప్రధాన కోట లోపల కలదు.

pc: youtube

20. కుంభాల్ ఘర్ ఎలా చేరుకోవాలి ?

20. కుంభాల్ ఘర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

ఉదయపూర్, అజ్మీర్, జోధ్ పూర్, పుష్కర్ ల నుండి తరచుగా నడిచే ప్రయివేట్ లేదా ప్రభుత్వ బస్సులలో పర్యాటకులు సౌకర్యవంతంగా కుంభాల్ ఘర్ చేరుకోవచ్చు.

pc: youtube

21.రైలు ప్రయాణం

21.రైలు ప్రయాణం

రైలు స్టేషన్ కుంభాల్ ఘర్ కు సమీప రైలు స్టేషన్ ఫల్నాలో కలదు. ఇది ముంబై, అజ్మీర్, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ మరియు జోధ్ పూర్ లకు తరచు ట్రైన్ సర్వీసులు కలిగి ఉంది. ఇక్కడినుండి కుంభాల్ ఘర్ కు క్యాబ్ లలో చేరవచ్చు.

pc: youtube

22. విమాన ప్రయాణం

22. విమాన ప్రయాణం

కుంభాల ఘర్ ప్రదేశానికి మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా డబోక్ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. మహారాణా ప్రతాప్ విమానాశ్రయంనుండి కుంభాల్ ఘర్ కు ప్రి పెయిడ్ టాక్సీలు దొరుకుతాయి.

pc: Hardikmodi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X