Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

ఇండియాలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

By Mohammad

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్ 27). 1980 నుండి యు ఎన్ ఓ లోని భాగస్వామ్య దేశాలన్నీ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వేడుకగా సెప్టెంబర్ 27 న జరుపుకుంటున్నారు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం పర్యాటక పాత్ర మీద అవగాహన కల్పించడం మరియు అది సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా ఎలా ప్రభావితం చేస్తుందో తెలియపరచడం.

భారతదేశం పర్యాటక ప్రదేశాల సమాహారం. దేశంలో చూడటానికి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి తరచూ వేలల్లో, సీజన్ లలో అయితే లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. కేవలం పర్యాటకం మీదనే ఆధారపడి ఆదాయాన్ని ఆర్జించే రాష్ట్రాలు, దీవులు మన దేశంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు కేరళ, గోవా, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు వాటిలో కొన్ని.

<strong>ఇండియాలోని 50 అద్భుత ప్రదేశ చిత్రాలు !</strong>ఇండియాలోని 50 అద్భుత ప్రదేశ చిత్రాలు !

చాలా మంది చనిపోయేలోపు ఆ ప్రదేశం చూసిరావాలి, ఈ ప్రదేశం చూసిరావాలి అని ఇతరులతో అంటుంటారు. అలాంటి ప్రదేశాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయి ? అక్కడ నిజంగా అంత బాగుంటుందా ? అనేదే ప్రస్తుత ఈ వ్యాసం.

యంత్తంగ్ వాలీ

యంత్తంగ్ వాలీ

యంత్తంగ్ ఒక అద్భుత లోయ. ఇది ఉత్తర సిక్కిం లో కలదు. దీనిని 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్' గా అభివర్ణిస్తారు. సముద్ర మట్టానికి 3564 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ అందమైన హిమాలయాలు, రోడోడెండ్రాన్ అభయారణ్యం చూడదగ్గవి.

చిత్రకృప : soumyajit pramanick

మున్నార్

మున్నార్

కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ సముద్రమట్టానికి 7000 అడుగుల ఎత్తున కలదు. దీని చుట్టూ అందమైన సువాసనలు వెదజల్లె కాఫీ తోటలు ఉన్నాయి.

చిత్రకృప : Manu M G

స్టాక్ రేంజ్, లడఖ్

స్టాక్ రేంజ్, లడఖ్

లడఖ్ భారతదేశానికి ఉత్తర దిక్కున ఉన్న చిట్టచివరి ప్రాంతము. దీనిని దాటితే అవతలివైపు చైనా భూభాగం. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తు లో ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్లు ఇక్కడ గమనించవచ్చు.

చిత్రకృప : Karunakar Rayker

లేహ్/ లడఖ్

లేహ్/ లడఖ్

సింధూ నది ఒడ్డున, హిమాలయాలు, కారకోరం పర్వత శ్రేణుల మధ్య లడఖ్ ప్రదహన పట్టణం లేహ్ విస్తరించి ఉన్నది. క్రీ. శ. 16, 17 వ శతాబ్దం కాలం నాటి మసీదులు, బౌద్ధ ఆరామాలు, ప్రాచీన 9 అంతస్థుల భవనం ఈ నగరంలోని ప్రధాన ఆకర్షణలు.

చిత్రకృప : Koshy Koshy

మిజోరం

మిజోరం

రోలింగ్ కొండలకు, నదులకు, సరస్సులకు మరియు లోయలకు మిజోరం ప్రసిద్ధి. వృక్ష జలాలు, జంతుజాలాలు, అడవులు, జలపాతాలు, హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ప్రకృతి ప్రియులను ఆనందపరుస్తాయి.

చిత్రకృప : Dheeraj Dwivedi

గోవా

గోవా

గోవా పర్యాటక రంగం మీదనే ఆధారపడ్డ ఒక చిన్న రాష్ట్రం. ఇక్కడ చూడవలసిన వాటిలో చారిత్రక నేపథ్యమున్న చర్చిలు, బీచ్ లు, సముద్ర ఆహార రుచులు మరియు చవకగా దొరికే ఆల్కాహాలు మొదలైనవి ఒకెత్తైతే పారాగ్లైడింగ్, వాటర్ బైక్, బనానా బోట్ మొదలైన నీటి క్రీడలు ఆచరించడం మరో ఎత్తు.

చిత్రకృప : Nilesh

కన్యాకుమారి

కన్యాకుమారి

వివేకం నడియాడిన ప్రదేశం ... కన్యాకుమారి. ఇది త్రివేణి సంగమం ఎందుకంటే అరేబియా, హిందూ, బంగాళాఖాతం అనే మూడు సముద్రాలు కలుస్తాయి కాబట్టి. అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, బీచ్ లు, ఆలయాలు, తిరువళ్ళువార్ విగ్రహం మొదలైనవి ఆకట్టుకుంటాయి.

చిత్రకృప : Mehul Antani

రాణాఫ్ కచ్

రాణాఫ్ కచ్

కచ్ అనగా సంస్కృతంలో ద్వీపం అని అర్థం. ఇక్కడ జీవావరణంలో ముఖ్యమైన బన్ని గడ్డి భూములు, కచ్ బస్టర్డ్ సాంక్చూరీ, నారాయణ్ సరోవర్ సాంక్చూరీ, లిటిల్ రన్ వైల్డ్ యాస్ సాంక్చూరీ, కన్జర్వేషన్ రిజర్వ్, మ్యూజియం, ఫోర్ట్ చూడదగ్గవి.

చిత్రకృప : Nagarjun Kandukuru

కొంకణ్ రైలు ప్రయాణం

కొంకణ్ రైలు ప్రయాణం

కొంకణ్ ప్రాంతం మహారాష్ట్రలో మొదలై కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కొన వరకు ఉంటుంది. ఈ ప్రాంతం గుండా రైలులో ప్రయాణిస్తే జలపాతాలు, పశ్చిమ కనుమల పర్వతాలు, పచ్చిక మైదానాలు, గంభీరమైన చీకటి టన్నెల్ లు గమనించవచ్చు.

చిత్రకృప : 2il org

కోల్కత్తా

కోల్కత్తా

ఇది దసరా సీజన్. కోల్కత్తా లో దసరా వేడుకలు 5 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. దుర్గాష్టమి రోజున కాళీ మాతకు చేసే పూజ ప్రత్యేకమైనది. కాళీఘాట్, విక్టోరియా మహల్, హౌరా బ్రిడ్జి, ఆలిపోరా జూ మొదలైనవి చూడవచ్చు.

చిత్రకృప : Sreejit Pramanik

వాలీ ఆఫ్ ఫ్లవర్స్

వాలీ ఆఫ్ ఫ్లవర్స్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హెమకుండ్ లో 'ఘన్ ఘరియా' గ్రామం నుండి 2 కి. మీ ల దూరంలో వాలీ ఆఫ్ ఫ్లవర్స్ కలదు. జూన్ - అక్టోబర్ మధ్య కాలంలో పర్యాటకులు ఇక్కడ 300 జాతుల పుష్పాలను, హిమాలయ జంతుజాలాన్ని మరియు అరుదైన సీతాకోకచిలుకలను చూడవచ్చు.

చిత్రకృప : Alosh Bennett

ఒరిస్సా గోల్డెన్ ట్రయాంగిల్

ఒరిస్సా గోల్డెన్ ట్రయాంగిల్

పూరి - కోణార్క్- భువనేశ్వర్ హెరిటేజ్ ప్రదేశాలను కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ మూడు చోట్ల దేవాలయాలే ఫెమస్. పూరి లో జగన్నాథ ఆలయం, కోణార్క్ లో సూర్య దేవాలయం మరియు భువనేశ్వర్ లో లింగరాజ్ దేవాలయం చూడదగ్గవి.

చిత్రకృప : varun suresh

ధుంధర్ ఫాల్స్, భేదఘాట్, జబల్పూర్

ధుంధర్ ఫాల్స్, భేదఘాట్, జబల్పూర్

ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ప్రసిద్ధి చెందినది. నర్మదా నది దీని పుట్టుకకు కారణం, పాలరాతి శిలలను దాటుకుంటూ ఎంతో వేగంగా గలగలా మంటూ శబ్దం చేస్తూ కిందకు పడుతుంది. అద్భుతమైన ఈ జలపాతం సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

చిత్రకృప : Sandyadav080

బృందావనం

బృందావనం

బృందావనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు. శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన ప్రదేశం ప్రదేశం ఇది. గోవింద్ దెవొ ఆలయం, ఇస్కాన్ ఆలయం, బంకే బిహారి ఆలయం, మదన్ మోహన్ ఆలయం, జైపూర్ ఆలయం మొదలైనవి చూడదగ్గవి. హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

చిత్రకృప : Bhavishya Goel

వారణాసి

వారణాసి

వారణాసి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. దీనినే కాశీ అని పిలుస్తారు. స్థానిక గంగా నదిలో స్నానం ఆచరిస్తే అన్ని పాపాలు పోయి ముక్తి కలుగుతుందని చెబుతారు. సాయంత్రంవేళ గంగమ్మ తల్లికి హారతి ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప : Sujay25

గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్

జీవితంలో ఒక్కసారైనా అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం చూడాలి. ఇదే ఇక్కడి ప్రాధాన్ ఆకర్షణ. సంవత్సరం పొడవునా సిక్కులు దీనిని దర్శిస్తారు. గురుద్వారా యొక్క పై అంతస్తును 400 కేజీలతో బంగారంతో పూతవేసారు.

చిత్రకృప : Stefan Krasowski

రాజస్థాన్ ఎడారిలో క్యాంప్

రాజస్థాన్ ఎడారిలో క్యాంప్

భారతదేశంలో ఉన్న ఒకేఒక్క ఎడారి 'థార్ ఎడారి'. ఇది రాజస్థాన్ లో వాయువ్య భాగంలో కలదు. అందమైన ఒయాసిస్సులు, అరుదైన పక్షులు, ప్రాణులు,అభయారణ్యాలు, ఒంటెల మీద సఫారీ, రాత్రి పూట ఎడారిలో క్యాంప్ ఫైర్ లు ఆకట్టుకుంటాయి.

చిత్రకృప : Flicka

కూర్గ్

కూర్గ్

కూర్గ్ ను 'స్కాట్ లాండ్ అఫ్ ఇండియా' అని పిలుస్తారు. మరోరకంగా చెప్పాలంటే కర్ణాటక కాశ్మీర్ అని కూడా చెప్పవచ్చు. ప్రధాన ఆకర్షణలు : కాఫీ తోటలు, పచ్చగా ఉండే అడవులు, కొండ ప్రాంతాలు, లోయలు, టీ ఎస్టేట్లు, నారింజ తోటలు, జలపాతాలు. కూర్గ్ ప్రదేశ అందాలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి.

చిత్రకృప : Ananth BS

బోధ గయ

బోధ గయ

బోధ గయ లేదా బుద్ధగయ బౌద్దులకు పవిత్ర యాత్రా స్థలం. ఇక్కడున్న ప్రధాన ఆకర్షణ బోధి చెట్టు. బుద్ధుడు ఈ చెట్టు కిందనే జ్ఞానాన్ని పొందాడు. దీనికి సమీపంలోని మహాబోధి ఆలయం చూడదగ్గది.

చిత్రకృప : Dennis Jarvis

ఆగ్రా

ఆగ్రా

ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటి తాజ్ మహల్. ఇది ఆగ్రా లో కలదు. ఢిల్లీ కి 200 కి. మీ ల దూరంలో ఉన్న ఆగ్రా ను సందర్శించటానికి పర్యాటకులు ఎప్పడూ వస్తుంటారు. సమీపంలో ఆగ్రా కోట మరియు అక్బర్ నిర్మించిన నగరం ఫతేపూర్ సిక్రీ చూడదగ్గవి.

చిత్రకృప : Tiberio Frascari

మైసూర్

మైసూర్

మైసూర్ కర్ణాటక సాంస్కృతిక రాజధాని. గంధపు చెక్కల సువాసనలు, గులాబీ గుబాళింపులు ఈ నగరాన్ని శాండల్ వుడ్ సిటీ గా మార్చేశాయి. మైసూర్ పాలెస్, చాముండేశ్వరి దేవాలయం, బృందావన్ గార్డెన్ చూడదగ్గ వాటిలో ముఖ్యమైనవి.

చిత్రకృప : Spiros Vathis

హైదరాబాద్

హైదరాబాద్

హైదరాబాద్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నగరం. కులీ కుతుబ్ షా ఈ నగర నిర్మాత. నిజాం నవాబులు చివరి పాలకులు. చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్ మరియు మొదలైనవి చూడదగ్గవి.

చిత్రకృప : Masrur Ashraf

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు క్రీ. శ. 4 లేదా 5 వ శతాబ్దానికి చెందినవి. ఈ గుహలు విజయవాడకు 6 కి. మీ ల దూరంలో కలవు. నల్లని గ్రానైట్ రాయితో పడుకున్న భంగిమలో చెక్కబడిన 'అనంతశయన విష్ణువు' యొక్క భారీ ఏకశిలా విగ్రహం కలదు.

చిత్రకృప : Kalyan Kanuri

వైజాగ్

వైజాగ్

వైజాగ్ ఆంధ్ర రాష్ట్రంలో పెద్దది. ఆర్కే బీచ్, కైలాస గిరి, కంబాలకొండ, రామకృష్ణ బీచ్, మెరైన్ మ్యూజియం తో పాటు జిల్లాలో ఉన్న అరకులోయ, బొర్రా గుహలు, అనంతగిరి హిల్స్ చూడదగ్గవి.

చిత్రకృప : Amit Chattopadhyay

గండికోట

గండికోట

గండికోట ఏపీలోని కడప జిల్లాలో కలదు. లోయలో ప్రవహించే పెన్నా నది, కోట, రంగనాథ ఆలయం, మాధవరాయ ఆలయం, కత్తుల కోనేరు, మసీదు మొదలైనవి చూదగ్గవి.

చిత్రకృప : Gagan Josan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X