అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

యాగంటి : యుగాంతంతో ముడిపడి ఉన్న క్షేత్రం !

Written by:
Published: Thursday, June 9, 2016, 16:19 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

యాగంటి ... కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం. కర్నూలు జిల్లాలో దక్షిణం వైపున విస్తరించిన ఎర్రమల కొండ ప్రాంతంలో యాగంటి కలదు. ఇక్కడ వెలసిన నందీశ్వరున్ని దర్శించుకోవటానికి దేశవ్యాప్తంగా ఉండే శివ భక్తులు, యాత్రికులు సంవత్సరం పొడవునా వస్తుంటారు.

యాగంటి, బంగినపల్లె మామిడిపండ్ల కు పేరుగాంచిన బనగానపల్లె కు చేరువలో ఉన్నది. కర్నూలు నుండి బనగానపల్లె 75 కిలోమీటర్లు. ప్రతి రోజూ అరగంట కొకసారి కర్నూలు బస్ స్టాండ్ నుండి బనగానపల్లె కు ఎ పి ఎస్ ఆర్ టి సి బస్సులు తిరుగుతుంటాయి. రైళ్ళలో వచ్చేవారికి డోన్ లేదా నంద్యాల లేదా తాడిపత్రి మీదుగా బనగానపల్లె చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి : నవ నందులు ... సకలపాపహరణాలు !

డోన్ రైల్వే స్టేషన్ (బళ్ళారి, గుంతకల్, హంపి, బెంగళూరు మొదలైన ప్రాంతాల నుండి వచ్చేవారికి సూచించదగింది) మరియు నంద్యాల రైల్వే స్టేషన్ (విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి మొదలైన ప్రాంతాల నుండి వచ్చేవారికి సూచించదగింది) నుండి వచ్చే వారు బేతంచెర్ల రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి 20 కి. మీ ల దూరంలో ఉన్న బనగానపల్లె కు స్థానిక వాహనాల్లో షేర్ ఆటోలు, బస్సులు, జీపులు మొదలైన వాటిలో ప్రయాణించి చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి : సప్తనదులలో కొలువుదీరిన సంగమేశ్వర ఆలయం !!

ఇది కూడా చదవండి : అహోబిలం - అంతుపట్టని రహస్యం !

బనగానపల్లె కు సమీపాన ఉన్న మరో ప్రధాన రైల్వే స్టేషన్ తాడిపత్రి. కడప, గుంతకల్, తిరుపతి, చెన్నై, రేణిగుంట మొదలైన ప్రాంతాల నుండి వచ్చే వారికి తాడిపత్రి సూచించదగినది. తాడిపత్రి నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్నబనగానపల్లె కు ప్రభుత్వ బస్సులు అనేకం. సులభంగానే చేరుకోవచ్చు.

ఇది కూడా చదవండి : శ్రీశైలం - మల్లికార్జునస్వామి దివ్య క్షేత్రం !

బనగానపల్లె నుండి యాగంటికి పల్లెవెలుగు బస్సులు (ఇప్పుడైతే తెలుగు - వెలుగు బస్సులు), షేర్ ఆటోలు, తూఫాన్ వాహనాలు ప్రతిరోజూ తిరుగుతుంటాయి. మీరు బస్సు లో ప్రయాణించాలి అనుకుంటే ఓపిక ఉండాలి. ఆర్ టి సి బస్సు రోజుకు రెండు సార్లు మాత్రమే బనగానపల్లె - యాగంటి మధ్య తిరుగుతుంది. అది కూడా ఉదయం 7 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3: 30 కు మరోసారి అంతే. కాబట్టి నేనిచ్చే సలహా షేర్ అటో లో / స్థానిక వాహనాల్లో ప్రయానించండి. సొంత వాహనాలుంటే (బైక్ / కార్ / జీప్) మరీ మంచిది.

ఇది కూడా చదవండి : గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం సమీప పర్యాటక ప్రదేశాలు !

రోడ్డు మార్గం

బనగానపల్లె - యాగంటి రోడ్డు మర్గం అంతగా బాగుండదు. ఎత్తుపల్లాలు, గతుకులు, గతులుగా ఉంటుంది. గవర్నమెంట్ అంటే అదే మరి. రోడ్డు సింగల్ రోడ్డు. రానుపోనూ అదే. బనగానపల్లె పోలీస్ స్టేషన్ మీదుగా బి ఎస్ ఎన్ ఎల్ ఆఫీసు దాటి రోడ్డు పట్టుకుంటే సరాసరి యాగంటికి వెళ్ళే రోడ్డు పట్టుకోవచ్చు.

చిత్ర కృప : siriesha darbha

రోడ్డు మార్గం దారిపొడవునా కనిపించేవి

బనగానపల్లె నుండి యాగంటి కి వెళ్ళేటప్పుడు ముందుగా కనిపించేది రోడ్డు పక్కనే ఉన్న షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమం. వీలైతే ఆశ్రమాన్ని దర్శించండి. పంట పొలాలను గమనిస్తూ .. వీచే చల్లటి గాలులను ఆస్వాదిస్తూ ముందుకు సాగండి.

చిత్ర కృప : ramesh naidu

రోడ్డు మార్గం దారిపొడవునా కనిపించేవి

మీ వాహనంలో పెట్రోల్ అయిపోతే, పోయించుకోవటానికి దారి మార్గాన హెచ్ పి పెట్రోల్ బంక్ ఉంది. ఇదే ఆ రూట్ కింద మీద ఉన్న ఒకే ఒక పెట్రోల్ బంక్. ఆకలేస్తే తింటానికి సమీపంలో మధు ఫుడ్స్ హోటల్ కలదు.

చిత్ర కృప : krishna gopal

రోడ్డు మార్గం దారిపొడవునా కనిపించేవి

ఎస్ ఆర్ బీ సి కాలువ దాటినా తరువాత పాతపాడు అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో చూడవలసిన స్థలం ఒకటుంది. అది కూడా రోడ్డు పక్కనే గుట్ట మీద ఉన్నది. అదే నవాబు బంగ్లా.

చిత్ర కృప : Heather Cowper

రోడ్డు మార్గం దారిపొడవునా కనిపించేవి

నవాబు బంగ్లాలో సినిమా షూటింగ్ లు జరుపుతారు. అరుంధతీ, అధినాయకుడు వంటి చిత్రాలను ఇక్కడే షూటింగ్ తీసారు. కోట కొంత భాగం శిధిలమైనప్పటికీ, వన్నె తగ్గలేదు. కోట అందాలను బయటి వైపునుండి చూడాలే తప్పనిచ్చి లోనికి ప్రవేశించరాదు. కోటని కాపలా కాస్తూ ఒక ముసలావిడ ఉంటుంది.

చిత్ర కృప : Phani Srinivas

రోడ్డు మార్గం దారిపొడవునా కనిపించేవి

కోటని కాపలా కాస్తూ ఒక ముసలావిడ ఉంటుంది. అందరీ దీన్ని నవాబు వేసవి విడిది అనుకుంటారు కానీ ఇది నవాబు ఉంపుడుగత్తె కు కట్టించి ఇచ్చిన కోటగా స్థానికులు చెబుతారు. కోట మొత్తం 9 గదులు, పెద్ద హాలు కలిగి కింద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది. నవాబు బంగ్లా నుండి కుడివైపు తిరిగితే సరాసరి యాగంటికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Vadrevu Vamsi Mohan Krishna

యాగంటి క్షేత్రం

యాగంటి క్షేత్ర ప్రధాన ఆలయం ఎత్తైన ఎర్రమల కొండల మధ్యన ఉన్నది. స్థలపురాణం ప్రకారం, అగస్త్య మహర్షి తపస్సు చేసిన తరువాత విష్ణువు కు ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటాడు. గర్భగుడి లో చెక్కిన వెంకటేశ్వర విగ్రహాన్ని లోనికి తీసుకొని వెళుతుండగా, విగ్రహం యొక్క కాలి బొటనవేలు విరిగిపోతుంది.

చిత్ర కృప : Ashwin Kumar

యాగంటి క్షేత్రం

విరిగిన విగ్రహాన్ని ప్రతిష్ట చేయకూడదు కదా ! అని మదనపడుతున్న సమయంలో మహర్షికి ఈశ్వరుడు ప్రత్యక్షమై " మహర్షి ! ఇదిగో చూడు. ఇక్కడ ఏడాది పొడవునా పారే జలపాతం ఉన్నది. నేను అభిషేక ప్రియుణ్ణి. కనుక ఎల్లప్పుడూ నీరు పారే చోట నాకు ఆలయం కట్టించాలి కానీ విష్ణువుకు కాదు. కనుక వేంకటేశ్వరుని విగ్రహప్రతిష్ట మాని, నా శివలింగాన్ని ప్రతిష్టించు" అని చెప్పాడు.

చిత్ర కృప : Bharath Kumar

యాగంటి క్షేత్రం - ఆలయ ప్రత్యేకత

ఆలయం విష్ణువుది కానీ గర్భగుడి లో ఉన్నది శివలింగం. ఆలయంలో అమ్మవారు ఉండరు. శివునిలోనే భాగమై ఉన్నట్లు భావిస్తారు. విష్ణు ఆలయం మాదిరే ద్వారపాలకులు మరియు ఇతర విగ్రహాలు ఉంటాయి అదే ఆలయ ప్రత్యేకత.

చిత్ర కృప : Ashwin Kumar

విరిగిన ఆ వేంకటేశ్వరుని విగ్రహం ఎక్కడ ఉన్నది ?

ప్రధాన ఆలయానికి పక్కనే కొండ మీద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

చిత్ర కృప : Phani Srinivas

అగస్త్య పుష్కరణి

యాగంటి ఆలయ కోనేరు ని 'అగస్త్య పుష్కరణి' అని అంటారు. పుష్కరణి లో నీళ్ళు మీరు ఏ మాసంలో చూసిన ఒకేవిధంగా ఉంటుంది. ఈ నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుందో, ఎలా కొండ చివరి భాగం వరకు పోతుందో ఎవ్వరికీ తెలీదు. కొండమీద నుంచి వచ్చే నీళ్ళు ఎల్లప్పుడూ తాజాగా, తియ్యగా ఉంటుంది.

చిత్ర కృప : Suresh Kumar

యాగంటి క్షేత్రం

పుష్కరణిలో స్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్ళటానికి మెట్ల మార్గం ఉన్నది. చెప్పులు బయట వదిలేసి ఆలయంలోని ప్రవేశించాలి. ఆలయ గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. అది దాటగానే రంగమండపం, ముఖ మండపం, అంతరాళం లు ఉన్నాయి.

చిత్ర కృప : Srivathsa Rao U

యాగంటి క్షేత్రం

ఆలయ గర్భగుడిలో ఉమామహెశ్వరుడు కొలువై ఉంటాడు. ఎదురుగా బసవన్న (నంది) విగ్రహం ఉంటుంది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసినట్లు అచ్చం అలాగే నంది రోజురోజుకూ పెరుగుతున్నాడు. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో చెప్పబడింది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు మాత్రమే చెందుతుంది.

చిత్ర కృప : Rama Mahendravada

యాగంటి క్షేత్రం - ఇంకో విచిత్రం

అగస్త్య ముని ధ్యానంలో ఉన్నప్పుడు కాకులు ఆయన చుట్టూ చేరి గోల చేసేవాట. ఆగ్రహించిన మహర్షి కాకులు తిరగకూడదని శాపం పెట్టాడని స్థానిక కధనం. అందుకే ఆలయ ప్రాంగణంలో, చుట్టూ ఎక్కడా కాకులు కనిపించవు.

చిత్ర కృప : Prajeeth

యాగంటి క్షేత్రం - గుహలు

ప్రధాన ఆలయానికి పక్కనే సహజ సిద్ధంగా ఏర్పడ్డ మూడు గుహలు యాత్రికులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి . వీటి వద్దకి చేరుకోవాలంటే మెట్ల వల్లే అవుతుంది.

చిత్ర కృప : jinka subbarayudu

యాగంటి క్షేత్రం - గుహలు

ఆగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన గుహను వెంకటేశ్వర గుహ అని పిలుస్తారు. ఇక్కడే పక్కన ఉన్న మరో గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినాడు దీనినే రొకళ్ల గుహ అని పిలుస్తారు. మీరు మరో గుహ, శంకర గుహ గమనించవచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకి జ్ఞానోపదేశం ఇక్కడే చేసాడని చెబుతుంటారు.

చిత్ర కృప : Srivathsa Rao U

యాగంటి క్షేత్రం - వసతి

యాగంటి లో ఆలయం దిగువ భాగాన ఉచిత అన్నదాన సత్రం ఉంది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 :30 వరకు, తిరిగి రాత్రి 8 గంటల నుండి 9 : 30 వరకు భోజనం వడ్డిస్తారు. వెజ్ ఫుడ్ మాత్రమే లభిస్తుంది. కాస్త సమీపంలోనే ఆశ్రమాలు, సత్రాలు కూడా ఉన్నాయి. రెడ్డి సత్రం, రైతు సత్రం లు వసతి సౌకర్యాలను అందిస్తాయి.

చిత్ర కృప : Prajeeth

యాగంటి క్షేత్రం - ఆలయ సందర్శన వేళలు

ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు , తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు

చిత్ర కృప : Andhra Pradesh Tourism

English summary

yaganti : unsolved mystery temple

Yaganti is famous for Uma Maheswara Temple located in Kurnool District of Andhra Pradesh. It was constructed by vijayanagara kings in the 15 century. The temple located in forest area.
Please Wait while comments are loading...