నాగాలాండ్ లోని ట్యూన్సంగ్, హక్చుంగ్ గ్రామానికి మధ్యలో ఉన్న ఈ చాంగ్ సంగ్ మొంగ్కో గిరిజన చాంగ్ ల మొదటి నివాస స్థలం అని నమ్మకం. చాంగ్ లు ట్యూన్సంగ్ జిల్లాని ఎక్కువగా ఆట౦క పరిచే వారిలో నాగాలాండ్ ప్రముఖ గిరిజనులలో ఒకరు. చాంగ్ సంగ్ మొంగ్కో, ట్యూన్సంగ్ జిల్లా కిందికి వస్తుంది.
ఇక్కడి జీవులు ఈ భూమిపై ఉన్న పెద్ద రంధ్రం నుండి ఉద్భవించాయని సాంప్రదాయబద్దంగా నమ్ముతారు. ముల్లంగ్ అని పిలువబడే ఈ గ్రామంలో ఒక ఎత్తైన వేదిక ఉంది. ప్రజల అభివృద్ది, శ్రేయస్సు కొస౦ చాంగ్ పూర్వీకులు ముల్లంగ్ ని నిర్మించారని భావిస్తారు. ప్రపంచ పరిణామా సమయంలో ఇది ఒక ప్రజా కోర్ట్ గా రూపాంతరం చెందిందని జానపద కధలలో చెప్పబడింది. గ్రామా సమస్యలను పరిష్కరించడానికి ఈ స్థలాన్ని ఉపయోగించేవారు.
మీరు ట్యూన్సంగ్ నుండి చాంగ్ సంగ్ మొంగ్కో కి పర్యాటక వాహనాలలో లేదా బస్సులలో తేలికగా చేరుకోవచ్చు. పగలు ఈ గ్రామాన్ని చూసుకొని, రాత్రికి ట్యూన్సంగ్ చేరుకోవచ్చు.