ఉదయపూర్ లోని సోలార్ అబ్జర్వేటరీ ఉదయపూర్ లోని సోలార్ అబ్జర్వేటరీని 1976 లో డాక్టర్ అరవింద్ భట్నాగర్ నిర్మించారు. ఫతే సాగర్ సరస్సులోని చిన్న ద్వీపం మీద ఉన్న ఈ అబ్జర్వేటరీ నమూనాను దక్షిణ కాలిఫోర్నియా లోని బిగ్ బేర్ సరస్సు లో ఉన్న సోలార్ అబ్జర్వేటరీ నిర్మాణాన్ని బట్టి తయారు చేసారు.
భారత ప్రభుత్వ ఖగోళ విభాగం తరఫున అహమదాబాద్ లోని ఫిసికల్ రీసర్చ్ లాబొరేటరీ దీనిని నిర్వహిస్తుంది. ఆస్ట్రేలియా కు, స్పైన్ కు మధ్య ఉన్న రేఖాంశ వ్యత్యాసాన్ని ఈ అబ్సర్వేటరీ సరిచేస్తుంది. సోలార్ క్రోమోస్ఫియర్ లు, అంతరిక్ష పరిశీలనలు, అయస్కాంత క్షేత్రాలను కొలిచేందుకు అవసరమైన అత్యాధునిక సామగ్రి ఈ అబ్సర్వేటరీ లో ఉంది. ఇక్కడి పరికరాలు సౌర జ్వాల, మాస్ ఎజేక్షన్ లు, సౌర ధార్మిక కేంద్రాల పరిణామం లాంటివి అర్ధం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.