అంబాల్ పాడీ మహాకాళి దేవాలయం ఉడుపి కి 2 నుండి 3 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహాకాళి మాత విగ్రహం షుమారు 6 అడుగుల ఎత్తు కలది దర్శనమిస్తుంది. అంబాల్ పాడీ అంటే అంబ లేదా మాత అని అర్ధం చెపుతారు. పాడి అంటే కొండపైన అని అర్ధం చెపుతారు. ఇక్కడ విశేషంగా చెప్పాలంటే, మహాకాళీ మాత భక్తులతో పత్రి అనే ఒక వ్యక్తి నోటి ద్వారా పలుకుతుందని చెపుతారు. ఈ పలుకులు ప్రతి శుక్రవారం సాయంత్రం మాత్రమే ఆ వ్యక్తి నోటి వెంట వస్తాయి. ఆ వ్యక్తి భక్తుల వ్యక్తిగత సమస్యలు విని పరిష్కారాలను సూచిస్తాడు. పర్యాటకులు ఇక్కడ కల మరో దేవాలయం లక్ష్మీ జనార్దన దేవాలయంకూడా దర్శించవచ్చు. దీనిలో మహావిష్ణువు దర్శనమిస్తాడు. అంబాల్ పాడీ దేవాలయంలో తీర్ధ స్నాన, రక్షయంత్ర, కుంకుమార్చన, మహాపూజ మొదలైన పూజలు నిర్వహిస్తారు. సమీప రైల్వే స్టేషన్ ఉడుపి. బస్సులు, టాక్సీలు, ఆటో రిక్షాలలో ఇక్కడకు చేరవచ్చు. ఉడుపిలో పర్యాటకులు బస చేసేటందుకు అనేక హోటళ్ళు ఉన్నాయి.