లున్ఘర్ సిహై ఫంగ్రెఇ అనేది ఉఖ్రుల్ జిల్లాలో ఒక పొడవైన, సమతలముగా ఉన్న పర్వత శ్రేణి. సిహై ఫంగ్రెఇ పర్యాటకులకు, స్థానికులకు ప్రముఖ పిక్నిక్ స్పాట్ గా ఉంది. దీనిని సిహై ఫంగ్రెఇ అని కూడా పలుకుతారు. సిహై ఫంగ్రెఇ శిరుఇ శిఖరం మీద ఉన్న శిరుఇ లిల్లీస్ కి ప్రసిద్ధి చెందింది.
లున్ఘర్ సిహై ఫంగ్రెఇ గొప్ప వృక్షజాలంనకు ప్రసిద్ది చెందింది. పూలు మరియు పండ్లు, వివిధ అరుదైన రకాల ఆర్కిడ్ పూలు మరియు ద్రాక్ష పండ్లు వంటి పండ్లు, ఆపిల్, పియర్, ప్లం, పీచు మొదలైనవి పర్వత శ్రేణిలో పెరుగుతాయి. ఈ ప్రాంతం యొక్క అందాన్ని పెంచటానికి ఈ పర్వత శ్రేణి క్రింద సెలయేళ్ళు మరియు అందమైన మరియు నిర్మలమైన జలపాతం ఉన్నది. ఒక రోజు లున్ఘర్ సిహై ఫంగ్రెఇ లో పర్యటిస్తే మన మనస్సుకు ఉల్లాసాన్ని,ఆనందాన్ని కలిగిస్తుంది.
'సిహై' అనే పదం సిహై ఖుల్లెన్, సిహై ఖునొఉ మరియు సిహై కహోఫుంగ్ లతో సహా ఉఖ్రుల్ గ్రామాల ఒక సమూహం కోసం ఉపయోగించే ఒక సాధారణ సూచన పదం.