వాగమోన్ చేరితే, ట్రెక్కింగ్ సిఫార్సు చేయదగినదే. పచ్చటి కొండలు, వివిధ రకాల పువ్వులు, తోటలు మీకు ఆహ్లాదం కలిగిస్తాయి. చిన్న చిన్న నీటి ప్రవాహాలు , జలపాతాలు వాటి పక్కన మీ నడక, చల్లని నీరు మీకు మరపురాని అనుభూతులు కలిగిస్తాయి. ఈ అడవులలో ట్రెక్కింగ్ ప్రకృతి ఒడిలో మీరు సేదదీరినట్లు భావిస్తారు.
చుట్టుపట్ల ప్రదేశాలు మిమ్ములను మంత్రముగ్ధులను చేస్తాయి. మీలోని ఎడ్రినాలిన్ అధికంగా ప్రవహించే సాహస కార్యాలైన పారాగ్లైడింగ్, మౌంటెనీరింగ్, రాక్ క్లైంబింగ్ లకు ఈ ప్రదేశం సరైనది. వాగమోన్ ట్రెక్కింగ్ మిమ్మల్ని ఎంతో ఉత్సమ భరితులను చేసి మీ విశ్రాంతి సెలవులను కొన్ని ఏళ్ళపాటు గుర్తు పెట్టుకొనేలా చేస్తుంది.