వాగమోన్ జలపాతాలు ఇక్కడి సరస్సు నుండి వెలువడే చిన్న ప్రవాహం. ఈ ప్రవాహం క్రిందగల లోయలోకి పడటం చూడదగ్గ అంశం. గుట్టలమీద పడి అక్కడినుండి దట్టమైన అడవులలోకి కలిసిపోతుంది. ఈ జలపాతాలకు మార్గం ట్రెక్కర్లకు సుపరిచితం. ఈ జలపాతాల ప్రత్యేకత వాటి ఎత్తు కాదు. వాటి ఆవిర్భావం మరియు వాటి చుట్టుపక్కలగల పర్యావరణం పర్యాటకులను ఆశ్చర్య చకితులను చేస్తాయి.
ఇవి తప్పక చూడవలసిన దృశ్యాలు. మీకుగల చింతలన్నీ పక్కనపెట్టి ఆనందించేస్తారు. ఒక్కసారి వాగమోన్ జలపాతాలు సందర్శిస్తే చాలు, మీ వాగమోన్ పర్యటన ఎప్పటికి మరచిపోలేరు.