వాగమోన్ సరస్సు అతి సుందరంగా ఉంటుంది. పచ్చటి పరిసరాలు మిమ్ములను ముగ్ధులను చేస్తాయి. ఇక్కడి లాన్లు ఎప్పటికపుడా బాగా కత్తిరించి అందమైన పువ్వులు ఉండేలా చేస్తారు. వెనుకనే ఉన్న కొండలు ఈ సరస్సు అందాలను మరింత పెంచాయి.
ఈ హిల్ స్టేషన్ సందర్శనలో మీరు ఈ సరస్సులో బోట్ విహారం చేయవచ్చు. ఎన్నో సుందర దృశ్యాలను చూడవచ్చు. రోడ్డు వైపునుండి సరస్సును చూస్తే అది మూడు గుట్టలతో కప్పినట్లు కనపడుతుంది. ఈ గుట్టలపై మీరు విహరించవచ్చు. ఈ సరస్సు పిక్ నిక్ లకు వారాంతపు సెలవులకు విశ్రాంతి ప్రదేశం. ఈ ప్రదేశాన్ని షూటింగ్ లకు కూడా వినియోగిస్తారు కనుక అపుడపుడు మీ కిష్టమైన సినీ నటులను కూడా చూసే అవకాశం ఉంటుంది.