దక్షిణ గోవా లో అనేక బీచ్ లు కలవు. వాటిలో కోల్వా బీచ్ ఒకటి. అయితే, చాలామంది ప్రసిద్ధి చెందిన బీచ్ లు మాత్రమే చూసి ఆనందిస్తారు. చిన్న బీచ్ అయిన వర్కా లాంటి వాటిని వదలివేస్తారు. వర్కా బీచ్ దక్షిణ గోవాలో కలదు. తాటి చెట్ల వరుసలు, తెల్లని ఇసుక కలిగిన ఈ బీచ్ సందర్శన మీకు మంచి ఆనందాన్నిస్తుంది.
రుచికరమైన గోవా ఆహారాలు మరియు అద్భుత కిక్ ఇచ్చే కాక్ టెయిల్స్ ఇక్కడ దొరుకుతాయి. వర్కా బీచ్ వర్కా గ్రామ సమీపంగా ఉంటుంది. ఇది మత్స్య కారుల గ్రామం అవటంతో, మత్స్యకారులు ఇక్కడ అధిక సంఖ్యలో కనపడతారు. ఫొటోగ్రాఫర్లకు చాలా ఇష్టమైన స్వర్గం. ఇక్కడి మత్స్యకారులు స్నేహపూరితులు. తాజా చేపలు తప్పక అందిస్తారు.
కోల్వా ప్రాంతంలో జరిగే వార్షిక ఫామా పండుగ వర్కా బీచ్ లో కూడా జరుగుతుంది. సంవత్సరానికోసారి గ్రామస్తులు మెనినో జీసస్ విగ్రహ ఆశీస్సులకొరకు కోల్వాకు వెళతారు. ఈ సమయంలో వర్కా చాలా ఆహ్లాదంగాను అందంగాను ఉండి పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడే కల తెల్లని ఇసుకతో నిండిన బెనాలిం బీచ్ ను కూడా తప్పక దర్శించాలి. దీనికి వర్కానుండి నడకలో చేరవచ్చు. దక్షిణ గోవాలోని కొల్వా నుండి వర్కా చేరవచ్చు. క్యాబ్ లు లేదా పనాజిం నుండి టాక్సీలో చేరవచ్చు. విమానాశ్రయం నుండి కొద్ది నిమిషాలలో కూడా చేరవచ్చు. వర్కా ప్రదేశం వాస్కోడగామాకు సమీపంలో ఉంటుంది. ఈ ప్రదేశానికి రైలు స్టేషన్లు కూడా కలవు.