Search
  • Follow NativePlanet
Share

వర్కాల - పురుషుడు మరియు ప్రకృతిల కలయిక...!

34

కేరళలోని తిరువనంతపురం జిల్లాలో వర్కాల ఒక కోస్తా తీర పట్టణం. ఇది కేరళకు దక్షిణ భాగంలో కలదు. సముద్రానికి సమీపంగా కొండలు ఈ ప్రదేశంలోనే కలవు. ఇక్కడి ప్రత్యకత అంటే కొండల అంచులు అరేబియన్ సముద్రంతో కలుస్తాయి. దీనిని భారత పురావస్తు శాఖ వర్కాలలో రాతి ఏర్పాటుగా చెపుతుంది. వర్కాల గొప్పవైన పది సీసనల్ బీచ్ లలో ఒకటిగా చెపుతారు.

పురాణాల మేరకు వర్కాల ప్రదేశం వర్కాల చరిత్రపై గల కధనాలు

ఒక పాండ్య రాజును ఆయన చేసిన తప్పులుకు గాను బ్రహ్మ దేవుడు ఇక్కడ దేవాలయం కట్టమని చెప్పాడట. రెండవ కధగా నారద మహర్షి తనను చూడటానికి వచ్చిన పాపులను చూసి తన వల్కాలం విసిరి పారేసాడని అది ఈ ప్రదేశంలో పడటంతో దీనికి వర్కాలం అనే పేరు వచ్చిందని చెపుతారు.

అంతా యాత్ర మాత్రమే

ఈ ప్రదేశం హిందువులకు మరియు ముస్లిములకు కూడా యాత్రా స్థలమే. శివగిరి మటం, జనార్దన స్వామి టెంపుల్, కాడువయిల్,జుమా మసీదు, వర్కాల బీచ్ , పాపనాశం బీచ్ , కప్పిల్ సరస్సు , యాన్కేలో కూతా, వర్కాల టన్నెల్ , శివ పార్వతి దేవాలయం మరియు పవర్ హౌస్, మొదలైనవి వర్కాల పర్యటనలో ప్రధాన ఆకర్షణ. పాపస్నానం బీచ్ ఇక్కడ ప్రధానమైనది. దీని సమీపంలోనే జనార్ధన దేవాలయం కూడా కలదు. ఈ దేవాలయం రెండువేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినది.

వర్కాల బీచ్ లో పారా సెయిలింగ్ మరియు పారా గ్లైడింగ్ లు కలవు. బీచ్ వద్ద ప్రసిద్ధి చెందిన కపిల్ సరస్సు కలదు. ఈ బీచ్ సాయంత్రం వేళ విశ్రాంతి షికార్లకు బాగుంటుంది. ఈ ప్రాంతంలోనే కల పొన్నుమ్తుర్తు ద్వీపం లేదా గోల్డెన్ బీచ్ మరొక ఆకర్షణీయ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన శివ పార్వతి టెంపుల్ కలదు.

అన్జెంగో కోట, వర్కాల టన్నెల్ మరియు లైట్ హౌస్ లు కూడా తప్పక చూడాల్సిన ప్రదేశాలు. వర్కాల కధాకళి సెంటర్ ఒక పర్యాటక ప్రదేశం. ఇక్కడ కదాకళి డాన్సులు నిర్వహిస్తారు. కధాకళితో పాటుగా ఇక్కడ మోహిని అట్టం కూడా ప్రదర్శించ బడుతుంది.

వర్కాల లో యోగ ఇక్కడ కలకాసి యోగ అనుష్టాన కేంద్రం లో యోగ నేర్పిస్తారు. తరగతులు ఒక వారం నుండి ఒక నెలవరకు కలవు. మీకుగల సమయానుకూలత బట్టి చేరవచ్చు. శివగిరి మఠం లోని ధ్యాన తరగాతులుకు కూడా మీరు హాజరు కావచ్చు. వర్కాల బీచ్ పక్కనే నేచర్ క్యూర్ సెంటర్ కలదు.

చేరటం ఎలా ?వర్కాల తిరువనంతపురం కు 50 కి.మీ. ల దూరంలో కలదు. అట్లే, కొల్లంకు 49 కి.మీ. దూరంలో వుంది. దక్షిణ భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుండి వర్కాలకు ప్రభుత్వ బస్సులు కలవు. రైలు స్టేషన్ కూడా కలదు. తిరువనంతపురం విమానాశ్రయం సమీపం.

వాతావరణంఅన్ని కోస్తా జిల్లాల వలెనె వర్కాల లో కూడా వాతావరణం అన్ని కాలాలలోను ఒక మోస్తరుగా ఉంటుంది. శీతాకాలం పర్యటనకు అనువైనది.

 

వర్కాల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వర్కాల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వర్కాల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వర్కాల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం వర్కాల, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలలోని అనేక ప్రదేశాలకు బస్సు సౌకర్యం కలిగి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం వర్కాల రైలు స్టేషన్ నుండి కేరళలోని వివిధ ప్రదేశాలకు రైలు మార్గం కలదు. రైలు స్టేషన్ నుండి టాక్సీ లేదా ఆటో రిక్షా లో టవున్ కు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం వర్కాల కు త్రివేండ్రం విమానాశ్రయం సుమారు 55 కి.మీ. దూరంలో కలదు. విమానాశ్రయం నుండి టాక్సీ లలో వర్కాల కు చేరవచ్చు. బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri