అమ్రితి జూలాజికల్ పార్క్ అమ్రితి నది వెంట తెల్లై యొక్క జవాడు హిల్స్ క్రింద ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం.ఇక్కడ వివిధ రకాల పక్షులు మరియు జంతువులు మరియు ఒక అందమైన జలపాతం ఉన్నాయి. ఈ ప్రదేశం జంతువులకు నివాస ప్రాంతాలుగా పేరుగాంచింది. పక్షులు మరియు కోతి వంటి జంతువులు, మచ్చల జింక, ముళ్ల పంది, ఫాక్స్, నెమలి, బాతు, అడవి చిలుకలు, మొసలి, అడవి పిల్లి మరియు డేగ వంటి వాటిని చూడవచ్చు. అనేక జాతుల మూలికా మొక్కలను మరియు చెట్లను ఈ పార్క్ లో చూడవచ్చు.
అమ్రితి జూలాజికల్ పార్క్ సమీపంలో ఒక పిల్లల ఆట విభాగం మరియు ఒక ధ్యానం హాల్ తో పాటు రెండు విశ్రాంతి గృహాలు ఉన్నాయి. సెలవు రోజులలో ఇక్కడకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఇటీవలే గుర్తించి ,రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకున్నారు. ప్రవేశ రుసుము Rs.2 / గా ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా గిరిజనులు ఉపాధి అవకాశాలు సృష్టించే దిశగా అమ్రితి సమీపంలో నిమ్మియంబట్టు వద్ద కొండ జాతి సొసైటీ ని ఏర్పాటు చేసారు.