Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విజయదుర్గ్ » వాతావరణం

విజయదుర్గ్ వాతావరణం

పర్యటించడానికి ఉత్తమ సమయం :విజయదుర్గ్ అర్థ ఉష్ణ మండల వాతావరణం కలిగి వుండడం వల్ల ఏడాది పొడవునా వేడిగా, తేమతో కూడి వుంటుంది. విజయదుర్గ్ అందాలు చూసేందుకు చలికాలం ఉత్తమమైన సమయం అని చెప్పాలి.

వేసవి

వేసవి :విజయదుర్గ్ లో ఫిబ్రవరి నుంచి మే నెల దాకా వేసవి వుంటుంది. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలకు చేరుకుంటుంది, కనిష్టంగా 27  డిగ్రీలు వుంటుంది. ఈ సమయంలో ఇక్కడికి రావడం చెప్పదగింది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం :మండే వేసవి తర్వాత జూన్ మధ్య నుంచి అక్టోబర్ దాకా వర్షాలకు విజయదుర్గ్ స్వాగతం పలుకుతుంది. ఈ కాలంలో పుష్కలంగా వానలు పడతాయి – దాంతో పరిసరాల్లో ఉష్ణోగ్రతలు  బాగా తగ్గుతాయి.

చలికాలం

శీతాకాలం :నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వరకు శీతాకాలం. విజయదుర్గ్ చూడ్డానికి ఇది అత్త్యుత్తమ సమయం. గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 26 డిగ్రీల వరకే వుండటంతో వాతావరణం ప్రధానంగా చల్లగా, హాయి గొల్పేదిగా వుంటుంది