వాల్మీకి జాతీయ పార్కు 880 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వుంది. ఇది పశ్చిమ చంపారన్ లోని శివాలిక్ శ్రేణుల చివరి అంచున నెలకొని వుంది. ఈ జాతీయ పార్కు మౌలికంగా పులుల లాంటి అంతరించిపోతున్న వన్య ప్రాణులకు నిలయం. ఈ అభయారణ్యం పూర్తిగా దట్టమైన పచ్చదనంతో కప్పబడి వుంది. ఇక్కడి చిరుత పులులు, నల్ల దుప్పి, చేపలు పట్టే పిల్లులు, చిరుతలు లాంటి జంతువులు ప్రధాన ఆకర్షణలు.